దళిత బంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది తెలంగాణ సర్కార్… ఇప్పటికే సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలోని అన్ని దళిత కుటుంబాలకు ఈ నింధులు అందగా… హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ దళిత బంధు నిధులు విడుదల చేశారు.. ఇదే సమయంలో… రాష్ట్రంలోని మరో నాలుగు నియోజకవర్గాల్లో నాలుగు మండలాలను కూడా ఎంపిక చేశారు సీఎం కేసీఆర్… అయితే, దళిత బంధుకు నిధులు ఎలా వస్తాయి అనే అనుమానాలు మాత్రం ప్రతిపక్షాలను తొలచివేస్తున్నాయి.. ఈ తరుణంలో దళితబంధుపై అసెంబ్లీ…
మరోసారి కేంద్ర ప్రభుత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రారు.. దళితబంధు పథకంపై అసెంబ్లీలో సుదీర్ఘ వివరణ ఇచ్చిన ఆయన.. ఈ సందర్భంగా వివిధ అంశాలను ప్రస్తావించారు.. కేంద్ర ప్రభుత్వంపై ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్ లో మనం శాసించే కేంద్ర ప్రభుత్వం రావొచ్చు అన్నారు.. కేంద్ర ప్రభుత్వానికి మన అవసరం పడొచ్చు.. లేకపోతే.. ఇప్పుడు ఉన్న కేంద్రమే మనల్ని కనికరించ వచ్చునని కామెంట్ చేశారు.. అనేక దఫాలుగా కేంద్రాన్ని నిధులు కూడా అడిగాం.. మీరు కూడా…
తెలంగాణలో రేపటి నుంచి స్కూళ్లకు దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి.. ప్రభుత్వ, ప్రైవేట్ అనే తేడా లేకుండా రేపటి నుంచి అంటే అక్టోబర్ 6వ తేదీ నుంచి 17వ తేదీ వరకు సెలువులు ఇచ్చినట్టు ప్రకటించింది ప్రభుత్వం.. ఇక, ఈ నెల 13వ తేదీ నుండి 17వ తేదీ వరకు జూనియర్ కళాశాలలకు దసరా సెలవులు ఉంటాయని వెల్లడించింది… దసరా సెలవుల్లో ఎలాంటి తరగతులు నిర్వహించ వద్దని అన్ని జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డ్ ఆదేశాలు జారీ…
దేశంలో నాలుగో మెట్రో నగరంగా హైదరాబాద్ స్థానం సంపాదించింది అని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రం వచ్చిన కొత్తలో ఎలా ఉంటుందో అనే అనుమానం ఉండేది. హైదరాబాద్ లో ఎక్కడ, ఎలాంటి సంఘటన జరగలేదు. అందర్ని కలుపుకుని ప్రభుత్వం ముందుకు పోతుంది అని తెలిపారు. కేసీఆర్ అందర్ని సమతుల్యంగా చూస్తున్నారు. జీహెచ్ఎంసిలోని 675 స్కోయర్ మీటర్లు. 102 స్కోయర్ మీటర్ల పరిదే పాత నగరం. మౌలిక వసతుల కల్పన కోసం దృఢ సంకల్పంతో పని చేస్తున్నాం.…
తెలుగు అకాడమీ డిపాజిట్ల గోల్మాల్ లో డొంక కదిలిస్తున్నారు సీసీఎస్ పోలీసులు. ఈ స్కాంలో పాత్రధారులతో పాటు సూత్రధారులను బయటకు లాగుతున్నారు. ఇప్పటికే పలువురిన అరెస్ట్ చేశారు. లేఖలు, డిపాజిట్ పత్రాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఫోర్జరీ ఎవరు చేశారు ఎందుకు చేశారో తేల్చే పనిలో నిమగ్నమయ్యారు. మరోవైపు ఈ స్కాంపై ప్రభుత్వం వేసిన త్రి సభ్య కమిటీ ఈరోజు నివేదిక ఇచ్చే అవకాశముంది. తెలుగు అకాడమీ డిపాజిట్ల గోల్ మాల్ కేసులో సీసీఎస్ పోలీసులు వేగంగా…
బతుకమ్మ, దసరా పండులను పురస్కరిచంఉకుని బుధవారం నుంచి తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలకు దసరా సెలవులు ఇవ్వనుంది ప్రభుత్వం. ఈ రెండు పండుగల సందర్భంగా ఈ నెల 6 నుంచి 17 వ తేదీ వరకు ఏకంగా 12 రోజుల పాటు సెలవులు ఇవ్వనుంది తెలంగాణ సర్కార్. ఇక తిరిగి ఈ నెల 18న పాఠశాలలు పున ః ప్రారంభం కానున్నాయి. ఇక అటు ఇంటర్ కళాశాలలకు ఈ నెల 13 వ తేదీ నుంచి సెలవులు ఇవ్వనుంది…
పేరుకు ఆ రెండు జాతీయ పార్టీలు కానీ. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆ రెండు పార్టీలు యేటికి ఎదురీదుతున్నాయి. తెలంగాణలో ఆ రెండు పార్టీలు పోటీలో ఉన్నట్లే కన్పిస్తున్నాయి. కానీ ఏపీలో మాత్రం వీటి ఉనికి అగమ్యగోచరంగా మారింది. కనీసం ఆ రెండు పార్టీలకు డిపాజిట్లు దక్కే పరిస్థితి లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంతకీ ఆ రెండు పార్టీలు ఏవో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. అవేనండి కాంగ్రెస్, బీజేపీలు. ఈ రెండు పార్టీలే కేంద్రంలో అధికారం…
తెలంగాణ కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 43,135 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా… కొత్తగా 207 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.. మరో ఇద్దరు వ్యక్తులు కోవిడ్ బారినపడి మృతిచెందాడు.. ఇదే సమయంలో.. 239 కోవిడ్ బాధితులు కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. దీంతో.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,66,735 కి చేరగా.. రికవరీ…
తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ… స్వాతంత్ర్యo వచ్చిన 70 ఏళ్లలో 60 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పాలించింది. 60 ఏళ్ళు మీరు ఏం చేశారు అని ప్రశ్నించారు. ఫ్లోరైడ్ తో నల్గొండ అతలాకుతలం అయింది. కాంగ్రెస్ పార్టీ పాపాలు పెరిగినట్టు ఫ్లోరోసిస్ పెరిగింది. మంచి నీటిని అందిస్తున్న కేసీఆర్ పైన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇక తెలంగాణ మొదటి ద్రోహి రేవంత్ రెడ్డి అని అన్నారు. జంగ్ లేదు బొంగు లేదు…
జమ్మికుంట పట్టణంలోని శంకర్ నందన గార్డెన్ లో ఆరే కులస్తుల గర్జన సభకు హాజరయ్యారు మాజీ మంత్రి బీజేపీ నేత ఈటల రాజేందర్,సెంట్రల్ ఓబీసీ మెంబర్ మోహన్ రావ్ పటేల్. ఆ సందర్భంగా ఈటల మాట్లాడుతూ… నేను భూ కబ్జా చేస్తే, వేల కోట్ల అక్రమ ఆస్తులు సంపాదిస్తే 18 సంవత్సరాలు నాతో కలిసి ఎలా ఉన్నారు అని ప్రశ్నించారు. కేసీఆర్ కు అవసరం అనుకుంటే ఎవరితో అయిన మాట్లాడుతాడు. అవసరం లేదు అనుకుంటే ఎవరిని దగ్గరికి…