హుజురాబాద్ నియోజక వర్గానికి ఉప ఎన్నిక ఈనెల 30 వ తేదీన జరగబోతున్నది. ఇప్పటికే అన్ని పార్టీలు ప్రచారంలో మునిగిపోయాయి. అధికార టీఆర్ఎస్, బీజేపీలు ఇప్పటికే అభ్యర్ధులను ప్రకటించాయి. టీఆర్ఎస్ తరపున గెల్లు శ్రీనివాస్ బరిలో ఉంటే, బీజేపీ నుంచి ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్ధిపై అనేక చర్చలు జరిగాయి. మొదట కాంగ్రెస్ అభ్యర్ధిగా కొండ సురేఖను అనుకున్నా, ఆమె తిరస్కరించడంతో తెరపైకి అనేక పేర్లు వచ్చాయి.…
ఈరోజు కాంగ్రెస్ పార్టీ విద్యార్ధి, నిరుద్యోగ సైరన్‌కు పిలుపునిచ్చింది. దిల్షుఖ్ నగర్‌కు చేరుకొని అక్కడి నుంచి పెద్ద ఎత్తున ర్యాలీ చేయాలి అన్నది కాంగ్రెస్ పార్టీ ఆలోచన. అయితే, దిల్షుఖ్ నగర్- ఎల్బీనగర్ ప్రాంతంలో నిత్యం ట్రాఫిక్ అధికంగా ఉంటుంది. దీంతో పోలీసులు అనుమతి నిరాకరించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సీఎం అయ్యాక పేదోళ్లు విద్యకు దూరం అయ్యారని, కులవృత్తులకు పరిమితం…
ఈ రోజు హుస్నాబాద్‌లో బీజేపీ సభను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సభకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, ఎంపీ, తెలంగాణ బీజేపీ అద్యక్షుడు బండి సంజయ్, హుజురాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. హుజురాబాద్‌లో కేసీఆర్ రాజ్యాంగం అమలు అవుతుందని, మద్యం ఏరులై పారుతోందని, ఇంత చేసినా తనను ఏమీ చేయలేకపోతున్నారని ఈటల పేర్కొన్నారు. అక్టోబర్ 30 న జరిగే కురుక్షేత్ర యుద్ధంలో ధర్మం గెలుస్తుందని, అన్ని జిల్లాల నుండి ఈటలను గెలిపించాలని…
తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ పండగ కానుకగా బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభం అయినట్లు మంత్రి కేటీఆర్ అన్నారు. ఏలాంటి ఇబ్బందులు లేకుండా చీరల పంపీణీ కార్యక్రమం పూర్తి అయ్యేలా అన్నిచర్యలు తీసుకున్నామన్నారు మంత్రి. 18 సంవత్సరాలు నిండి, ఆహార భద్రత కార్డ్ కింద నమోదైన అర్హూలైన ప్రతి ఒక్క ఆడబిడ్డకు బతుకమ్మ చీర అందాలని సూచించారు. ప్రభుత్వ పథకంతో రాష్ట్రంలోని అడబిడ్డలకు అందమైన చీరతోపాటు, నేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నిండాయన్నారు మంత్రి. 2017 నుంచి గత…
హుజురాబాద్ ఉప ఎన్నికలు సమయంలో అధికార, ప్రతిపక్షాల మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది… గతంలో హుజురాబాద్‌లో కాంగ్రెస్ పార్టీకి 60 వేల ఓట్లు వచ్చాయని.. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు ఒక్క ఓటు పెరిగినా.. నేను, నా భార్య మా పదవులకు రాజీనామా చేస్తామని.. దీనికి నువ్వు సిద్ధమా? అంటూ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి.. అయితే, గండ్ర వ్యాఖ్యలపై సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు కాంగ్రెస్ నేత మధుయాష్కీ…
సంచలనం సృష్టించిన తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ కేసు రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు వెలుగుచూశాయి.. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఏపీకి ఇవ్వాల్సిన నిధులపై ఈ నెల 18న బ్యాంకు అధికారులతో భేటీ అయ్యారు ఏపీ అకాడమీ డైరెక్టర్ సోమిరెడ్డి.. ఈ నెల 21 న కార్వాన్ యూబీఐ బ్యాంక్ నుండి రూ.24 కోట్లు విత్ డ్రా కు రఫిక్ అనే తెలుగు అకాడమీ ఉద్యోగిని పంపించారు.. అయితే, మస్తాన్‌వలి అనుచరుడిగా రఫీక్ తో పరిచయం…
సంచలనం సృష్టించిన తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ వ్యవహారంలో నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు సీసీఎస్ పోలీసులు.. ఈ కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. మరో ముగ్గురు కోసం వేట ప్రారంభించారు.. తెలుగు అకాడమీలో మొత్తం రూ.63.47 కోట్లను నగదు రూపంలో విత్ డ్రా చేశారు.. ఆ ముగ్గురు నిందితులు.. ఇన్నవో కారులో ఆంధ్రతో పాటు ఇతర ప్రాంతాలకు డబ్బులు తరలించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.. డబ్బులు కొల్లగొట్టడంలో ఏపీ మర్కంటైల్ సొసైటీ చైర్మన్.. సహకరించినట్టు…
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర మొదటి విడత ఇవాళ్టితో ముగియనుంది.. ఈ సందర్భంగా హుస్నాబాద్ లో రోడ్ షో, ముగింపు సభ నిర్వహణకు బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి.. ఇక, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ రాబోతున్నారు.. మెత్తం 36 రోజుల పాటు 438 కిలో మీటర్లు మేర పాదయాత్ర చేశారు బండి సంజయ్.. ఎనిమిది జిల్లాల్లోని 19 అసెంబ్లీ, 6 పార్లమెంట్ నియోజకవర్గాలను…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మరో పోరుకు రెడీ అయింది. తెలంగాణలోని విద్యార్థి, నిరుద్యోగ సమస్యలపై పోరాటానికి నేడు శ్రీకారం చుట్టబోతుంది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ లోని రాజీవ్ చౌరస్తా నుంచి ప్రారంభం కానున్న ఈ కార్యక్రమం 65 రోజుల పాటు సాగనుంది. విద్యార్థి- నిరుద్యోగ జంగ్ సైరన్ పేరుతో డిసెంబర్ 9 వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగించనున్నారు. రాష్ట్రంలోని బడుగు, బలహీన, దళిత, గిరిజన, మైనార్టీ, ఆదివాసీ విద్యార్థులందరికీ… కార్పొరేట్…
ఎట్టకేలకు హుజురాబాద్ ఉపఎన్నికల్లో తమ అభ్యర్థిని దాదాపు ఖరారు చేసింది కాంగ్రెస్. బలమూర్ వెంకట్ పేరును ఫైనల్ చేశారు. ఇవాళ అధికారికంగా ప్రకటించే అవకాశముంది. గెల్లు శ్రీనివాస్ కు బలమైన పోటీ ఇవ్వడానికి బలమూర్ వెంకట్ ను రంగంలోకి దింపుతున్నట్టు సమాచారం.ప్రస్తుతం ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న వెంకట్ కాంగ్రెస్ నుండి యూత్ లీడర్ గా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. అంతేకాదు…బలమూర్ వెంకట్.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వాడు కావడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్…