తొమ్మిది రోజులు జరుపుకునే బతుకమ్మ వేడుకల్లో ఒక్కో రోజుది ఒక్కో ప్రత్యేకత. రోజుకో రకమైన పూలతో, రోజుకో ప్రత్యేకమైన నైవేద్యాన్ని గౌరమ్మకు సమర్పిస్తారు. ఎంగిలిపూల బతుకమ్మ: మహాలయ అమవాస్య రోజు బతుకమ్మ వేడుక మొదలవుతుంది. తెలంగాణలో దీన్ని పెత్రామాస అని కూడా అంటారు. నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు. అటుకుల బతుకమ్మ: ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.…
కార్పొరేట్ శక్తులను పెంచే పనిలో పడింది మోడీ ప్రభుత్వం అని కాంగ్రెస్ నాయకులు జగ్గారెడ్డి అన్నారు. కుల వృత్తులు కూడా కార్పొరేట్ శక్తులు చేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తున్న.. తెలంగాణ, ఏపీ లో ఆందోళనలు లేకపోవడం దురదృష్టకరం. రైతులు బయటకు రాకపోవడం కి పోలీసు కేసులు కారణం అని అన్నారు. జగన్, కెసిఆర్ పోలీసుల తో కేసులు పెట్టిస్తున్నారు. వ్యవసాయ చట్టాలపై కనీసం జగన్, కెసిఆర్ మాట్లాడటం లేదు. రైతుల కోసం కొట్లడేది ఒక…
తెలంగాణ సాంస్కృతిక ప్రతీక, రాష్ట్ర పండుగ బతుకమ్మ ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు సీఎం కేసీఆర్.. తీరొక్కపూలను పేర్చుకుని తొమ్మిది రోజులపాటు ప్రకృతిని ఆరాధిస్తూ ఆనందోత్సాహాల నడుమ ఆటాపాటలతో ఆడబిడ్డలు బతుకమ్మ సంబురాలు జరుపుకుంటారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.. ఒకనాడు సమైక్యపాలనలో విస్మరించబడిన బతుకమ్మను స్వయం పాలనలో ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించిందన్న ఆయన… తెలంగాణ ప్రజల జీవనంలో భాగమైపోయిన ప్రకృతి పండుగ బతుకమ్మ, నేడు ఖండాంతరాలకు విస్తరించడం గొప్పవిషయమన్నారు. తెలంగాణ సంస్కృతికి…
దళితబంధుపై చర్చ సందర్భంగా సుదీర్ఘ వివరణ ఇచ్చిన సీఎం కేసీఆర్ పలు అంశాలపై స్పందించారు… అయితే, అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ పచ్చి అబద్దాలు వల్లిస్తున్నారంటూ కౌంటర్ ఇచ్చారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులను అవమానిస్తారా? అంటూ ఫైర్ అయిన ఆయన.. సీఎం సోయిలో లేకముందే రామప్పకు యునెస్కో గుర్తింపు తెచ్చింది కేంద్రం కాదా? అని ప్రశ్నించారు. అర్హులైన వారికి పద్మశ్రీ అవార్డులిస్తూ పారదర్శకంగా వ్యవహరిస్తున్న ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వానిదేనన్న ఆయన……
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతూ, పెరుగుతూ వస్తున్నాయి… రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం… గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 218 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఒక్క కరోనా బాధితుడు మృతిచెందారు.. ఇక, 248 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,66,971 కు చేరగా.. రికవరీ కేసులు 6,58,657 కు పెరిగాయి.. ఇప్పటి వరకు కరోనాతో మృతిచెందినవారి సంఖ్య…
ఆంధ్రప్రదేశ్లో పని చేస్తున్న తెలంగాణ ప్రాంతవాసులకు గుడ్న్యూస్ చెప్పింది ఏపీ ప్రభుత్వం.. తెలంగాణ నేటివిటీ ఉన్న ఉద్యోగుల నుంచి ఆప్షన్లు తీసుకోవాలని సూచించింది.. స్పౌజ్ కేసుల విషయంలోనూ ఆప్షన్లు తీసుకోనుంది సర్కార్.. తెలంగాణ తరహాలోనే ఏపీ కూడా ఆప్షన్లు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది.. తెలంగాణ స్థానికత.. స్పౌజ్ కేసులకు సంబంధించి సుమారు 2 వేల మంది ఉద్యోగులు ఉంటారని అంచనా వేస్తోంది ఏపీ సర్కార్.. దీంతో.. సొంత ప్రాంతానికి వెళ్లాలని చూస్తున్న ఉద్యోగులకు ఊరట దక్కనుంది. ఇక,…
తెలుగు అకాడమీ నిధుల గోల్ మాల్ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది.. దీంతో, విచారణకు త్రిసభ్య కమిటీని నియమించింది ప్రభుత్వం.. అసలు ఈ నిధుల గోమాల్కు ప్రధాన కారణం ఏంటి? అనేతి తేల్చింది త్రిసభ్య కమిటీ.. తెలుగు అకాడమీ అధికారుల నిర్లక్ష్యమే నిధుల గోల్ మాల్ కు ప్రధాన కారణం అని తన నివేదికలో పేర్కొంది త్రి సభ్య కమిటీ.. తెలుగు అకాడమీకి సంబంధించిన నిధులు అన్ని బ్యాంకులలో కలిపి రూ.340 కోట్లు ఉండగా.. మూడు బ్యాంక్…
తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ కేసులో ఇవాళ కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.. తెలుగు అకాడమీ కేసులో ఏ-1 నిందితుడుగా ఉన్న యూనియన్ బ్యాంక్ మేనేజర్ మస్తాన్ వలిని కస్టడికి అనుమతించింది నాంపల్లి కోర్టు.. రేపటి నుండి ఈ నెల 12వ తేదీ వరకు కస్టడీలోకి అనుమతించింది కోర్టు.. ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో ఉన్న మస్తాన్ వలీని రేపు కస్టడీలోకి తీసుకోనున్నారు సీసీఎస్ పోలీసులు. మరోవైపు నిధుల గోల్డ్ మాల్ పాలడ్డ ముఠా మొత్తాన్ని అరెస్ట్ చేశారు…
మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నేత మోత్కుపల్లి నర్సింహులకు సీఎం కేసీఆర్ కీలక పదవి కట్టబెట్టేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది.. తెలుగు దేశం పార్టీలో ఉండగానే టీఆర్ఎస్లో చేరేందుకు అప్పట్లో మోత్కుపల్లి ప్రయత్నాలు చేశారనే ప్రచారం జరిగింది.. కానీ, ఆయనను పార్టీలో చేర్చుకోవడం కొందరికి ఇష్టం లేకపోవడంతో.. ఆ తర్వాత ఆయన భారతీయ జనతా పార్టీలో చేరారు.. అయితే, సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రకటించగానే.. పరిస్థితి మారిపోయింది… సీఎం కేసీఆర్ నిర్వహించిన సమావేశానికి వెళ్లొద్దని బీజేపీ నిర్ణయం…