కవులు, కళాకారులు కన్న తెలంగాణ రాలేదని ప్రజా యుద్ధ నౌక గద్దర్ అన్నారు. మంగళవారం ఆయన భువనగిరి మండలం హనుమపురం కళాకారుడు జంగ్ ప్రహ్లాద్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండో దశ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన జంగు ప్రహ్లాద్‌కు మనం ఘనంగా నివాళులర్పిం చాలన్నారు. మా భూములు, మా నీళ్లు, మా వనరులు,మా పాలన ఇంకా మాకు రాలేదన్నారు.
ప్రాంతీయ పార్టీల ప్రాణం ఈ భూమిలోనే ఉందని తెలంగాణ సమస్య అంటే భూ సమస్యలేనని గద్దర్ అన్నారు. ప్రాంతీయ పార్టీ సజీవంగా ఇంకా కొంతకాలం పరిపాలించాంటే భూ సమస్యలను పరిష్కారానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగులు వేయాలన్నారు. ఏ సంక్షేమ పథకా లలైన ప్రజలు ఎంత ఇస్తే అంతా తీసుకుంటారన్నారు. లక్షలు ఇచ్చే వాడు ఉంటే ఎన్నైనా తీసుకుంటారన్నారు. ప్రజలకు కావాల్సింది అదికాదని వాళ్ల కాళ్లమీద వాళ్లను నిలబడేలా చేయాలని గద్దర్ అన్నారు.