హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితం మరికొద్ది గంటల్లో వెలువడనుంది.. అధికార టీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకునేందుకు… అన్ని ప్రయత్నాలు చేసింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా తర్వాత… మండలాల వారిగా ఇన్‌చార్జ్‌లను నియమించింది. నియోజకవర్గంలో పట్టుసాధించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ నేతలు… విస్తృతంగా పర్యటించి… గెల్లు శ్రీనివాస్ గెలుపు కోసం ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారం మొదలు… పోలింగ్ రోజు ఓటర్లను పోలింగ్ బూతులకు చేర్చే వరకు పక్కా ప్రణాళికను అమలు చేసింది టీఆర్ఎస్. మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ హుజురాబాద్ నియెజకవర్గంలో మకాం వేసి ప్రచారం నిర్వహించారు. వీరికి అదనంగా మండలాల వారిగా ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు స్థానికంగా ఉండి… గెల్లు శ్రీనివాస్ తరపున క్యాంపెయిన్ చేశారు. హైదరాబాద్ నుంచి ఎప్పుటికప్పుడు ఇచ్చే ఆదేశాలను అమలు చేశారు.
Read Also : మన్యంలో రూ.4 వేల కోట్ల గంజాయి సాగు.. ధ్వంసం చేయకపోతే ప్రమాదం..!
సామాజిక సమీకరణాలపై అంచనాకు వచ్చిన టీఆర్ఎస్… సోషల్ ఇంజనీరింగ్ పై నజర్ పెట్టింది. పోలింగ్ ముగిసిన తర్వాత టీఆర్ఎస్ క్షేత్రస్థాయి నుంచి నివేదికలు తెప్పించుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం హుజురాబాద్‌లో గెలుపు తమదేనని టీఆర్ఎస్ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. హోరాహోరిగా జరిగిన ఎన్నికల్లో… గెలుపు తమదేనని టీఆర్ఎస్ ఆశాభావంగా ఉంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత పాలేరు, నారాయణ ఖేడ్, హుజూర్ నగర్, దుబ్బాక, నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు జరిగాయి. దుబ్బాక మినహా అన్ని చోట్ల గులాబీ పార్టీనే విజయం సాధించింది. ఉప ఎన్నికల్లో తమకు సక్సెస్ రేట్ ఎక్కువగా ఉందని.. హుజురాబాద్‌లోనూ తమదే గెలుపంటున్నారు నేతలు. మరోవైపు.. బీజేపీ కూడా గెలుపుపై ధీమాగా ఉంది.. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి ఈటల రాజేందరే వారికి పెద్ద ప్లస్ పాయింట్‌గా చెబుతున్నారు. దీంతో హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితంపై అధికార పార్టీలో ఉత్కంఠ కొనసాగుతోంది.