CM KCR: నేడు రెండు ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ సీఎం కేసీఆర్ దూకుడు మీద ఉన్నారు. ఈ మేరకు వరుసగా జిల్లా పర్యటనలు చేస్తున్నారు. ఇటీవల జనగామ, యాదాద్రి జిల్లాలలో పర్యటించిన కేసీఆర్.. ఈరోజు సంగారెడ్డి జిల్లాకు రానున్నారు. సంగారెడ్డి జిల్లాలో రెండు ఎత్తి పోతల పథకాలను ఆయన ప్రారంభించనున్నారు. సంగమేశ్వర, బసవేశ్వర అనే రెండు ప్రాజెక్టు నిర్మాణాలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణంతో నారాయణ ఖేడ్, జహీరాబాద్, ఆందోల్‌తో పాటు సంగారెడ్డి జిల్లాలోని పలు నియోజక వర్గాల ప్రజలకు తాగు, సాగు నీటి అవసరాలు తీర్చనున్నాయి.
కాగా ఈ రెండు ప్రాజెక్టులకు కాళేశ్వరం మెగా ప్రాజెక్ట్ నుంచి దాదాపు 20 టీఎంసీల నీటిని కేటాయించనున్నారు. ఎత్తిపోతల ప్రాజెక్టుల శంకుస్థాపన తర్వాత సీఎం కేసీఆర్ పలు అభివృద్ధి పనులను కూడా ప్రారంభించనున్నారు. అనంతరం ఆయన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆదివారంమహారాష్ట్ర పర్యటనకు వెళ్లి.. దేశ రాజకీయాలను తన వైపు తిప్పుకున్న కేసీఆర్ ఈ బహిరంగ సభలో ఏం మాట్లాడుతారో అనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది.
Also Read
తాజావార్తలు
-
Relationship Blindness: ప్రేమ ఉన్నా మాటలే లేవా?
-
BC Reservations: 34 శాతం బీసీ కోటాపై ఉత్కంఠ.. రిజర్వేషన్ల డేటా సమర్పించాలని సర్కార్‌కు హైకోర్టు ఆదేశం
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
Sardar2 : సర్దార్ -2 ఓవర్సీస్ రివ్యూ.. ఇది మరో సర్దార్ గబ్బర్ సింగ్
-
Samsung Roasts Apple’s First Foldable: యాపిల్ ఫోల్డబుల్‌పై శామ్సంగ్ ఘాటు సెటైర్లు..
ట్రెండింగ్
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?
-
IND vs AFG: టీమిండియాకు బిగ్ షాక్.. అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్‌కు స్టార్ పేసర్ దూరం.. ఇంకెన్నాళ్లు ఈ గాయాలు!
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!