✪ నేటి నుంచి మార్చి 4 వరకు శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. ఉ.8 గంటలకు స్వామివారి యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్న అర్చకులు.. స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించనున్న శ్రీకాళహస్తి దేవస్థానం.. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేటి నుంచి భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనం.. మార్చి 5 నుంచి స్పర్శ దర్శనాలు పున:ప్రారంభం
✪ ఈరోజు ఉదయం 9 గంటలకు హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి నేవీ హెలికాప్టర్ ద్వారా నెల్లూరుకు మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి భౌతికకాయం తరలింపు.. నేడు నెల్లూరులో కార్యకర్తల సందర్శనార్థం గౌతమ్‌రెడ్డి నివాసంలో భౌతికకాయం
✪ ఈరోజు, రేపు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించనున్న కేఆర్ఎంబీ ఇంజినీర్లు
✪ నేటి నుంచి వరంగల్ నిట్‌లో వైజ్ఞానిక వారోత్సవాలు
✪ నేడు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశం.. ఉక్రెయిన్, రష్యా సరిహద్దుల్లో ఉద్రిక్తతలతో అత్యవసర భేటీ