రాష్ట్రంలో రాజకీయంగా ముందడుగు వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మాజీ ఐఎఎస్ అధికారి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్. నల్లగొండ జిల్లాలో పర్యటించిన ఆయన కేసీఆర్ ప్రభుత్వంపై ఒక స్థాయిలో విరుచుకుపడ్డారు. బహుజనులు బాగుపడాలంటే బహుజన రాజ్యం రావాలన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా బంజారా బిడ్డలే అత్యాచారానికి గురవుతున్నారు.
నక్కలగండి ఎస్సెల్బీసీ ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయిన రైతులు సెక్యూరీటీ గార్డులుగా పనిచేస్తున్నారన్నారు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్. సీఎం జీతం 4, 25 లక్షలు వుంటే మాస్ గిరిజన బిడ్డలు పాములతో, తేళ్లతో కొట్లాడి పనిచేస్తే వచ్చే కూలీ 200 రూపాయలేనా అన్నారు. మన పిల్లలు చదివే బడుల్లో 200 విద్యార్థులు ఉంటే 1 టీచర్ ఉంటాడు ఎందుకీ పరిస్థితి? మన పిల్లలు చదివే యూనివర్సిటీలో పోస్టులు ఖాళీ ఉంటాయి. మన రాష్ట్రంలో ప్రయివేట్ యూనివర్సిటీల్లో రిజర్వేషన్లు లేకుండా చేస్తే, ఎస్టీ, ఎస్సీ ఎమ్మెల్యేలు రిజర్వేషన్లు కావాలని ఎందుకు నిలదీయలేదని ఆయన ప్రశ్నించారు.
మనల్ని అడుక్కునేలా చేస్తున్నారు ఈ పాలకులు. మన హక్కులు మనకు దక్కాలంటే, బహుజన రాజ్యం రావాలి. ప్రలోభాలకు లొంగి ఓటేస్తే మన జీవితాలు నాశనం అవుతాయన్నారు ప్రవీణ్ కుమార్. మన బహుజన రాజ్యం వచ్చాక దేవరకొండను సేవాలాల్ జిల్లాగా ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చారు.