రేపటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండగా, ఎల్లుండి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి ట్వీట్ చేశారు. గతంలో కేంద్రం ఇచ్చిన హామీలను మరోసారి గుర్తు చేయాలనుకుంటున్నానని తెలిపారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారని, ప్రతి భారతీయుడికి ఇల్లు నిర్మించి ఇస్తామన్నారని కేటీఆర్ అన్నారు.. అలాగే ఇంటింటికీ నీరు, విద్యుత్, టాయిలెట్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని కూడా హామీ ఇచ్చారని తెలిపారు.…
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ‘రెవెన్యూ చట్టాలు – ధరణిలో లోపాలపై జరుగుతున్న రౌండ్ టేబుల్ సమావేశంలో ఎంపీ బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం.. ధరణి పోర్టల్ పై తీవ్రంగా విమర్శించారు. ధరణి పోర్టల్ ప్రారంభమై రెండేళ్లైనా సమస్యలు మాత్రం తీరలేదు. సీఎం మాటలకు… చేతలకూ పొంతన లేకుండా పోయిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది రైతులు, మాజీ సైనికాధికారులుసహా ప్రజలు దీనివల్ల అనేక కష్టాలు పడుతున్నా చర్యలు తీసుకోకపోవడం సిగ్గు చేటన్నారు.రాష్ట్రంలో ఉన్న మొత్తం…
వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారాయి. కొత్త జిల్లాలపై ఆమె తెలంగాణ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలను కొందరు ఏపీ సీఎం జగన్‌కు అన్వయిస్తున్నారు. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ఆమెను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఏపీ గురించి తనను అడగొద్దంటూ తెలంగాణలోని కొత్త జిల్లాల గురించి మాట్లాడారు. ఇక్కడ 33 జిల్లాలు ఏర్పాటు చేసి ఏం సాధించారని షర్మిల ప్రశ్నించారు. కనీసం 33 జిల్లాలకు కావాల్సిన సిబ్బందినైనా డిప్లాయ్…
ఫీవర్ సర్వేతో రాష్ట్రంలో మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిపారు మంత్రి హరీష్‌రావు.. రాష్ట్రంలో కోవిడ్ పాజిటివిటీ రేటు కూడా తగ్గినట్టు వెల్లడించారు.. మహీంద్ర కంపెనీ ఆధ్వర్యంలో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ జహీరాబాద్ ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేయడాన్ని అభినందించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఇది 86వ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ అన్నారు.. కరోనా సెకండ్ వేవ్ లో 500 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం పడింది. కానీ, 200 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మాత్రమే…
కేంద్రంపై మరోసారి పోరాటానికి సిద్ధం అవుతోంది టీఆర్ఎస్ పార్టీ.. దానికి పార్లమెంట్ సమావేశాలను వేదికగా చేసుకోబోతోంది.. పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని గులాబీ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.. ఇందులో భాగంగా ఇవాళ పార్టీ ఎంపీలకు కీలక సూచనలు, దిశానిర్దేశం చేయనున్నారు గులాబీ బాస్.. పార్లమెంట్ బడ్జెట్ తొలి విడత సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రగతి భవన్లో టీఆర్ఎస్ పార్లమెంటరీ…
తగ్గినట్టే తగ్గిన చలి.. తెలంగాణలో మళ్లీ పంజా విసురుతోంది.. గత నాలుగైదు రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి.. చాలా ప్రాంతాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు సగటు కంటే తక్కువగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 6 డిగ్రీల సెల్సియస్ మేర తక్కువగా నమోదు అవుతున్నట్టు వాతావరణశాఖ అధికారులు ప్రకటించారు.. అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లాలోనే నమోదు అవుతున్నాయి.. జిల్లాలోని అర్లీ(టీ)లో 4.9 డిగ్రీలుగా నమోదైన ఉష్ణోగ్రతలు.. కుమరంభీంలో 5.8, సిర్పూర్ (యు)లో 5.8,…
✪ నేడు మహాత్మాగాంధీ వర్థంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాలలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్న రాజకీయ పార్టీలు✪ నేడు శ్రీకాకుళం శాంతినగర్‌లో గాంధీ స్మారక మందిరం ప్రారంభం… గాంధీ మందిరంతో పాటు స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తివనం ప్రారంభం✪ హైదరాబాద్: ప్రగతిభవన్‌లో నేడు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో టీఆర్ఎస్ ఎంపీలతో సమావేశం కానున్న సీఎం కేసీఆర్✪ హైదరాబాద్: నేడు డ్రగ్స్ కేసులో రెండో రోజు టోనీని విచారించనున్న పోలీసులు✪ ఢిల్లీ: నేడు లోక్‌సభ స్పీకర్…
ఈనెల 31 నుంచి పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఈసారి కరోనా నేపథ్యంలో రెండు దశల్లో బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. తొలి దశ సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు జరుగుతాయి. ఆ తర్వాత మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు రెండో దశ సమావేశాలను నిర్వహించనున్నారు. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో…
1 దేశంలో 2.35 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుత మూడో వేవ్‌లో జనవరి 21న దేశంలో అత్యధికంగా 3.47 లక్షల కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే. వారం రోజులుగా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. అయితే, కరోనా ముప్పు తొలగిపోలేదని, అప్రమత్తంగా వుండాలని ప్రపంచ ఆరోగ్యసంస్థ తెలిపింది. దేశంలో 3,35,939 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 13.39 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.2.తెలంగాణలో కరోనా కేసుల తీవ్రత కొనసాగుతూనే…