తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్.. కేసీఆర్.. ఈ మధ్య రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే కాగా.. ఇవాళ తాడేపల్లిలో ఏపీ ఎస్సీ, ఎస్టీ గెజిటెడ్ అధికారుల సంక్షేమ సంఘం డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో.. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ప్రభుత్వ సలహాదారు సజ్జలతో కలిసి పాల్గొన్న మంత్రి ఆదిమూలపు సురేష్.. కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు.. కొంత మంది కుహనా మేధావులు రాజ్యాంగం మార్చాలని అంటున్నారని ఆగ్రహం…
రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని చిన్నజీయర్ స్వామి ఆశ్రమం వద్ద శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు జరిగిన రెండో రోజు ఉత్సవాలకు సీఎం కేసీఆర్ సతీసమేతంగా హాజరయ్యారు. తొలుత భారీస్థాయి ఏర్పాటు చేసిన శ్రీరామానుజ విగ్రహ ప్రాంగణాన్ని సీఎం కేసీఆర్ పరిశీలించి పనులను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… శ్రీరామానుజచార్యుల విగ్రహం సమానత్వానికి ప్రతీకలాంటిదని తెలిపారు. దేవుడి ముందు ప్రజలందరూ సమానమే అన్నారు. రామానుజచార్యులు అందరినీ సమానంగా ప్రేమిస్తారని… మనం కూడా రామానుజ…
తెలంగాణలో కరోనా కొత్త కేసుల సంఖ్య నిలకడగా కొనసాగుతోంది.. గత బులెటిన్‌తో పోలిస్తే కేసుల సంఖ్య కాస్త తగ్గింది.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో తెలంగాణలో 2,421 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో ఇద్దరు కోవిడ్ బాధితులు మృతిచెందగా.. ఇదే సమయంలో 3,980 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 7,71,828కి చేరగా.. కోలుకున్నవారి సంఖ్య…
రైల్వే బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు రూ.10,080 కోట్లు కేటాయించిందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజీవ్ కిషోర్ తెలిపారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.7,032 కోట్లు, తెలంగాణ రాష్ట్రానికి రూ.3,048 కోట్ల కేటాయింపులు జరిగాయని వెల్లడించారు. 2022-23 బడ్జెట్లో గతంతో పోలిస్తే 30 శాతం కేటాయింపులు పెరిగాయన్నారు. 2021-22 బడ్జెట్లో రూ.7,049 కోట్ల కేటాయింపు జరిగాయని తెలిపారు. ఈ ఏడాది డబ్లింగ్, థర్డ్ లైన్, బై పాస్‌ల కోసం రూ.5,517 కోట్లు కేటాయించగా..…
ఫిబ్రవరి 5న హైదరాబాద్ నగరానికి ప్రధాని మోదీ రానున్నారు. ఈ సందర్భంగా ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలు, ముచ్చింతల్‌లో రామానుజచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల్లో మోదీ పాల్గొననున్నారు. ఫిబ్రవరి 5 న మధ్యాహ్నం 2:45 గంటలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ప్రధాని మోదీ చేరుకోనున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో పఠాన్‌చెరువులోని ఇక్రిశాట్‌కు చేరుకోనున్నారు. అక్కడ స్వర్ణోత్సవాల కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం సాయంత్రం 5 గంటల సమయంలో శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌కు హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారు. అక్కడ…
అమరావతే ఏపీకి రాజధాని అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ బదులిచ్చారు. రాజధాని నిర్ణయించే అధికారం రాష్ట్రానిదే అని చెప్పారు. మూడు రాజధానులపై రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తగ్గినట్లు తమ దృష్టికి వచ్చిందని.. కనుక ప్రస్తుతం అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అని స్పష్టం చేశారు. ఛలో విజయవాడకు వెళ్ళేందుకు ప్రయత్నిస్తున్న ఉద్యోగులను రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ నిర్బంధిస్తున్నారు. విజయవాడ పోలీసుల నిఘా నేత్రంలో వుంది.…
తెలంగాణలో బీజేపీ తన అస్థిత్వం కోసం పోరాటం చేస్తోంది. 2023 టార్గెట్ గా పావులు కదుపుతోంది. వచ్చిన అవకాశాలను దేన్నీ వదలడం లేదు. సీఎం కేసీఆర్ పై పోరాటానికి దిగారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. బడ్జెట్ సందర్భంగా సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు మంటలు రేపుతున్నాయి, రాజ్యాంగాన్ని మార్చాలంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన అన్న మాటలు రాజకీయంగా వివాదాస్పదమవుతున్నాయి. అంతేకాదు ప్రధాని మోదీపై ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల బీజేపీ నేతలు మండిపడుతున్నారు.…
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవతి.. సింగరేణి సంస్థ మూసివేతకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని విమర్శించిన ఆమె.. బొగ్గు గని కార్మికుల చెమట చుక్కతో దక్షిణ భారతానికి వెలుగులు పంచుతోన్న సంస్థ సింగరేణి అని పేర్కొన్నారు.. సింగరేణిలో రాష్ట్రానికి 51 శాతం, కేంద్రానికి 49 శాతం వాటా ఉన్నప్పటికీ బీజేపీ తన అధికారాలను తప్పుడు రీతిలో ఉపయోగిస్తోందని విమర్శించారు.. బీజేపీ వైఖరి సమాఖ్య స్పూర్తికి…