హైదరాబాద్ శివారులోని ముచ్చింతల్ చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలోని శ్రీరామనగరంలో సమతామూర్తి శ్రీరామానుజాచార్యుల భారీ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. అనంతరం ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. తెలుగు చిత్ర పరిశ్రమ ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి గడించిందని… తెలుగు సినిమా విశ్వవ్యాప్తమైందని కొనియాడారు. తెలుగు సినిమా సిల్వర్ స్క్రీన్‌పై అద్భుతాలు సృష్టిస్తోందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. తెలుగు భాషా చరిత్ర ఎంతో సుసంపన్నమైందని కీర్తించారు. కాగా…
తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటనకు సీఎం కేసీఆర్ దూరంగా ఉండటంపై తెలంగాణ బీజేపీ విమర్శలు చేస్తోంది. దేశ ప్రధాని వస్తే సీఎం కేసీఆర్ జ్వరం అని చెప్తూ తప్పించుకోవడం ఏంటని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ బీజేపీ ట్విట్టర్లో ఓ పోస్ట్ చేసింది. అనుకున్న విధంగానే జరిగిందని.. గతంలో ప్రోటోకాల్‌ను ఉల్లంఘించిన చంద్రబాబు, పంజాబ్ సీఎం చన్నీ అడుగు జాడల్లో కేసీఆర్ నడుస్తున్నారని ఎద్దేవా చేసింది. ఇందుకు సీఎం కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ అందుకోవడం…
పవిత్రమైన భారత రాజ్యాంగాన్ని అవమానపరిచారని ఆరోపిస్తూ సీఎం కేసీఆర్‌పై సిద్దిపేట జిల్లా గజ్వేల్ పోలీస్ స్టేషన్లో టీపీసీపీ చీఫ్ రేవంత్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీఐ వరప్రసాద్‌కు ఫిర్యాదుతో పాటు రాజ్యాంగం ప్రతిని కూడా అందజేశారు. తమ ఫిర్యాదు ఆధారంగా సీఎం కేసీఆర్‌పై చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి పోలీసులను కోరారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సారెడ్డి కూడా పాల్గొన్నారు. Read Also: సీఎం కేసీఆర్‌కు జ్వరం.. ప్రధాని కార్యక్రమానికి…
ప్రధాని మోదీ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ప్రధాని మోదీని రిసీవ్ చేసుకునే కార్యక్రమానికి సీఎం కేసీఆర్ దూరమయ్యారు. ముందుగా ప్రధానికి ఆహ్వానం పలికేందుకు కేసీఆర్ కూడా వస్తున్నారని ప్రచారం జరిగినప్పటికీ.. ఆయనకు జ్వరం కారణంగా హాజరుకాలేదని తెలుస్తోంది. కేసీఆర్‌కు జ్వరంగా ఉందని.. అందుకే ఆయన ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారని సీఎంవో వర్గాలు వెల్లడించాయి. అయితే సాయంత్రం ముచ్చింతల్‌లో జరిగే రామానుజచార్యుల విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మాత్రం కేసీఆర్ హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. Read Also: చలితో…
భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు.. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఆయన పర్యటన కొనసాగనుంది.. సంగారెడ్డి జిల్లాలోని ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల్లో పాల్గొననున్న ఆయన.. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో నిర్వహిస్తున్న రామానుజచార్యుల సహస్రాబ్ది సమారోహంలో పాల్గొంటారు.. ఈ పర్యటన కోసం మధ్యాహ్నం 2.45 గంటల ప్రాంతంలో ఇక్రిశాట్‌కు చేరుకోనున్న ప్రధాని మోడీ.. ఇక్రిసాట్ స్వర్ణోత్సవాలను ప్రారంభిస్తారు.. ఇక, ఇక్రిశాట్లో కొత్తగా ఏర్పాటు చేసిన పర్యావరణ మార్పుల పరిశోధన కేంద్రంతో పాటు ర్యాపిడ్ జనరేషన్…
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో డ్రోన్స్ పై నిషేధం విధిస్తున్నట్టు పోలీస్ కమిషనర్ తెలిపారు.. రామచంద్రపురం ఇక్రిశాట్, ముంచింతల్ చిన్న జీయర్ ఆశ్రమం వద్ద డ్రోన్స్ పై నిషేధం ఉంటుందని.. రేపు ఉదయం 6 గంటల నుండి ఈ నెల 15వ తేదీ వరకు నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని ఉత్తర్వులు జారీ చేశారు.. రిమోట్ కంట్రోల్ డ్రోన్స్, పర గ్లిడర్స్, మైక్రో లైట్ ఎయిర్ క్రాఫ్ట్స్ పై నిషేధం విధించారు.. 15వ తేదీ వరకు వీవీఐపీల రాక సందర్భంగా…
తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది.. అయితే, గత బులెటిన్‌తో పోలిస్తే మాత్రం.. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గగా.. తెలంగాణలో మాత్రం స్వల్పంగా పెరిగాయి.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన కోవిడ్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 30,886 శాంపిల్స్ పరీక్షించగా 4,198 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో ఐదుగురు మృతి చెందారు, ఇదే సమయం 9,317 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.. ప్రస్తుతం రాష్ట్రంలో…
డబ్బుల గురించి ఓ సినిమాలో హీరో పాడినట్టుగా.. బతుకు బండిని నడేపేది పచ్చనోటే.. డబ్బును బట్టి మనిషికి స్టేటస్ మారిపోతోంది.. ఇచ్చే విలువ కూడా మారుతుంది.. పేరు వెనుక లేని తోకలు కూడా వచ్చి చేరుతాయి.. అయితే, ఇప్పుడు తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే డబ్బులపై హాట్ కామెంట్సల్ చేశారు.. మానకొండూరు నియోజకవర్గంలోని ఇల్లంతకుంట మండల కేంద్రంలో దళిత బంధుపై నిర్వహించిన అవగాహన సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే రసమయి బాలకిషన్.. మనిషికి డబ్బు చాలా ముఖ్యం…
భారత రాజ్యాంగం విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలలపై ప్రతిపక్షాలు ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నాయి.. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి.. అయితే, ఈ వ్యవహారంలో సీఎంపై అన్ని పీఎస్‌లపై ఫిర్యాదు చేసేందుకు సిద్ధం అవుతోంది కాంగ్రెస్ పార్టీ.. రేపు అన్ని పోలీస్ స్టేషన్లలో సీఎం కేసీఆర్‌పై ఫిర్యాదు చేయనున్నట్టు వెల్లడించారు టి.పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. కేసీఆర్ మాటల వెనక కుట్ర ఉందన్న ఆయన.. నరేంద్ర మోడీ ఆదర్శ నాయకుడు పుతిన్ అయితే.. కేసీఆర్…
యూనివర్సిటీ గ్రాంట్స్ (యూజీసీ) చైర్మన్‌గా తెలంగాణ బిడ్డ నియమితులయ్యారు.. యూజీసీ చైర్మన్‌గా తెలంగాణకు చెందిన మామిడాల జగదీష్ కుమార్‌ను నియమిస్తున్నట్టు కేంద్రప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది… ఇప్పటి వరకు ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి వైస్-ఛాన్సలర్‌గా విధులు నిర్వహిస్తున్నారు జగదీష్ కుమార్… యూజీసీ చైర్మన్‌గా ఆయన ఐదు సంవత్సరాలు కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొంది కేంద్ర ప్రభుత్వం.. Read Also: రోజా తీవ్ర అసంతృప్తి..! అవసరమైతే రాజీనామాకు సై.. జగదీష్…