బీజేపీ నాయకులు అబద్ధాలు మాట్లాడితే నాలుక కోస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చారు తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్.. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు పనులు కళ్లముందే ఉన్నాయన్న ఆయన.. ఇక్కడకు వచ్చి బండి సంజయ్ డ్రామా ఆడారని మండిపడ్డారు. అంబేద్కర్ సృతి వనాన్ని బండి సంజయ్ అపవిత్రం చేశారంటూ ఫైర్ అయిన ఆయన.. బీజేపీ నాయకులకి నిజం చెప్పే దమ్ము లేదన్నారు.. ఇక్కడికి వచ్చి బీజేపీ డ్రామా చేసింది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, 2022…
దళితుల గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే నాలుక చీరేస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చారు పెద్దపల్లి ఎంపీ నేతకాని వెంకటేష్… మతోన్మాద శక్తులు అయిన బీజేపీ ఎంపీలు, నాయకులు కుక్కల్లా అరుస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆయన.. భారత రాజ్యాంగాన్ని బీజేపీ రాజ్యాంగంగా మారుస్తున్నారని ఆరోపించారు.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు అడ్డుపడ్డ చరిత్ర ఈ బీజేపీ నాయకులుది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. 1952 ఎన్నికల్లో అంబేద్కర్ పోటీ చేస్తే అడ్డుకుని పోటీ పెట్టిన చరిత్ర కాంగ్రెస్ ది…
కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత.. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై ఓ రేంజ్లో ఫైర్ అయిన తెలంగాణ సీఎం కేసీఆర్.. రాష్ట్రానికి జరుగుతోన్న అన్యాయం, కేంద్రం చేస్తున్న ద్రోహాన్ని ఎండగట్టారు.. ఇదే, సమయంలో ఆయన రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతూనే ఉన్నాయి.. అయితే, బీజేపీ ప్రభుత్వం పై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను మేం స్వాగతిస్తున్నాం అని ప్రకటించారు సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం.. ఖమ్మంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేంద్రంపై కేసీఆర్ చేసిన…
తెలంగాణ 15 ఏళ్ల నుంచి 17 ఏళ్ల లోపు టీనేజర్లకు కరోనా వ్యాక్సిన్ అందించే ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు హన్మకొండలో 103 శాతం మేర వ్యాక్సినేషన్ జరగ్గా… రంగారెడ్డి జిల్లా 51 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. రంగారెడ్డి జిల్లాలో 1,77,102 మంది 15 నుంచి 17 ఏళ్ల లోపువారుండగా.. కేవలం 90,046 మందికే ఇప్పటిదాకా కరోనా వ్యాక్సిన్ వేశారు. అటు రాష్ట్రంలోని 11 జిల్లాల్లో టీనేజర్లకు వ్యాక్సినేషన్ కవరేజీ 70 శాతం లోపే ఉంది. Read…
తెలంగాణ సీఎం కేసీఆర్ యాదాద్రి పునఃనిర్మాణాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో యాదాద్రి పర్యటించిన ఆయన.. పలు కీలక మార్పులు, చేర్పులు సూచిస్తూ వచ్చారు. అయితే, రేపు మరోసారి యాదగిరి గుట్ట పర్యటనకు వెళ్లనున్నారు. ముగింపు దశలో ఉన్న యాదాద్రి నిర్మాణ పనులను పరిశీలించనున్న సీఎం.. ఆలయ పునఃసంప్రోక్షణ కోసం నిర్వహించనున్న సుదర్శనయాగం, ఇతర ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో చర్చించనున్నారు.. కాగా, మార్చి 22 నుంచి మార్చి 28 వ తేదీ…
ఉత్తరాది గాన కోకిల, నైటింగేల్ ఆఫ్ ఇండియా లతా మంగేష్కర్ ఇక లేరు. ఆమె వయసు 92 ఏళ్ళు. తీవ్ర అస్వస్థతతో గత కొన్నాళ్ళుగా ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు లతా మంగేష్కర్. ఆసేతుహిమాచల పర్యంతం ఆబాలగోపాలాన్నీ అలరించిన గానకోకిల లతా మంగేష్కర్. ఆమె ఆకస్మిక మరణానికి యావత్ దేశం నివాళులర్పిస్తోంది. ప్రైవేటు వైద్య కళాశాలలు, డీమ్డ్ వర్సిటీల్లో రుసుములపై కీలక మార్గదర్శకాలు జారీ చేసింది జాతీయ వైద్య కమిషన్. ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వ…
మాసశివరాత్రి ఆదివారం నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే సూర్యుని వల్ల ఆరోగ్యం, శివుని వల్ల సంపదలు కలుగుతాయి. ఆదివారం రవివారం. అందుకే నవగ్రహాల్లో మొట్టమొదటివాడైన సూర్యుడిని ఆరాధన చేయాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. ఆదివారం నాడు మాత్రమే కాకుండా ప్రతిరోజూ ఉదయం వేళ ”జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం” అనే మంత్రాన్ని జపిస్తే సూర్యానుగ్రహం కలుగుతుంది. ఆరోగ్యం, సంపద మనకు లభిస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఆదివారం నాడు ఆదిత్యుడికి…
హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటనకు తెలంగాణ సీఎం కేసీఆర్ దూరంగా ఉండటంతో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య సోషల్ మీడియాలో వార్ నడుస్తోంది. #ShameOnYouKCR పేరుతో బీజేపీ నేతలు ఆరోపిస్తుంటే… #EqualityforTelangana పేరుతో టీఆర్ఎస్ నేతలు విరుచుకుపడుతున్నారు. ఈ రెండు హ్యాష్‌ట్యాగ్‌లు ట్విట్టర్లో ట్రెండింగ్‌లో ఉన్నాయంటే.. బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య వార్ ఏ రేంజ్లో నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం చేశారని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. తెలంగాణ పట్ల…
ఆసియాలోనే అతిపెద్ద సంబరం.. మేడారం జాతరకు తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుంది.. ప్రైవేట్ వాహనంలో వెళ్తే ఎక్కడో 5, 6 కిలోమీటర్ల దూరంలో దిగాల్సి ఉంటుంది.. కానీ, ఆర్టీసీ బస్సులు నేరుగా సమ్మక, సారక్క గద్దెల దగ్గర వరకు వెళ్తాయి.. దీంతో.. భక్తులు ఇబ్బందులు పాడాల్సిన అవసరం ఉండడు.. మేడారం జాతర కోసం ప్రత్యేకంగా 51 ప్రాంతాల నుంచి 3,845 బస్సులు నడుపుతున్నట్టు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.. భక్తులు ప్రైవేటు వాహనాల్లో వెళ్లి ఇబ్బందులకు…
తెలంగాణలో కరోనా కేసులు మరింత తగ్గాయి.. కోవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 74,803 శాంపిల్స్ పరీక్షించగా.. 2,098 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,76,313కు చేరింది.. ఒకే రోజు 3,801 రికవరీ కేసులు నమోదు అయ్యాయి.. దీంతో.. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 7,42,988కు పెరిగింది.. మరో ఇద్దరు కోవిడ్ బాధితులు…