Telangana: వాహనదారులకు గమనిక… ఈ-ఛలాన్ సర్వర్ డౌన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు భారీ డిస్కౌంట్ ఇవ్వడంతో వాహనదారులు పెండింగ్ ఛలాన్లు చెల్లించేందుకు ఆసక్తి చూపుతున్నారు. రూ.100 జరిమానా పడితే..రూ.25 చెల్లిస్తే సరిపోతుందంటూ ఆఫర్ ఇవ్వడంతో తొలిరోజే పెద్ద ఎత్తున వాహనదారులు ఛలాన్లు కట్టేందుకు పోటెత్తారు. ఈ కారణంగా పెండింగ్‌లో ఉన్న ఛలాన్లు నిమిషానికి 700 చొప్పున క్లియర్ అవుతున్నాయని తెలుస్తోంది. అయితే వాహనదారులందరూ ఒక్కసారిగా వెబ్సైట్ మీదకు రావడంతో ఈ-ఛలాన్ సర్వర్ క్రాష్ అయ్యిందని అధికారులు చెప్తున్నారు.
సర్వర్ క్రాష్ కావడంతో పెండింగ్ చలాన్ల క్లియరెన్స్‌కు అంతరాయం ఏర్పడింది. రోజుకు లక్ష నుంచి 3 లక్షల మంది వాహనదారులు తమ ఛలాన్లను క్లియర్ చేసేందుకు వెబ్సైట్ ఓపెన్ చేస్తారని అధికారులు భావించారు. ఆ మేరకు ఆ ఒత్తిడిని తట్టుకుని నిలబడేలా సర్వర్ కూడా అప్ డేట్ చేశారు. అయితే తొలి రోజే 3 లక్షలకు పైగా వాహనదారులు ఒకేసారి వెబ్ సైట్‌ను ఆశ్రయించడంతో సైట్ డౌన్ అయిపోయింది. కాగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో రూ.600 కోట్ల పైచిలుకు పెండింగ్ ఛలాన్లు ఉన్నాయి. ఆయా ఛలాన్లను డిస్కౌంట్‌తో చెల్లించేందుకు మార్చి 1 నుంచి 31వ తేదీ వరకు అధికారులు అవకాశమిచ్చారు.
Also Read
- Asaduddin Owaisi : ఒవైసీకి పోలీసుల గౌరవ వందనం.. అసలు ట్విస్ట్ ఇదే.!
- OTR: రేఖా నాయక్ రైస్ మిల్ పై ఈడీ దాడులు.. సొంత పార్టీ నేతలే కుట్ర చేశారా?
- CM Revanth Reddy :తెలంగాణ ఎగుమతుల్లో 68% వృద్ధి.. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీయే లక్ష్యం
- Human Skull Found : మొన్న మహిళ కాలు.. నేడు మనిషి పుర్రె.. ఇబ్రహీంపట్నంలో మిస్టరీ
తాజావార్తలు
-
Story Board : రాయితీలు తీసుకుంటూ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వరు?
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో అద్భుత ఘట్టం.. వైభవంగా తులసీ దామోదర కల్యాణం.!
-
Yuzvendra Chahal: రాజకీయాల్లోకి అడుగుపెట్టిన భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్.. కీలక బాధ్యతలు అప్పగింత..
-
Asaduddin Owaisi : ఒవైసీకి పోలీసుల గౌరవ వందనం.. అసలు ట్విస్ట్ ఇదే.!
-
OTR: రాజాం మున్సిపాలిటీలో జనసేనకు సొంత పార్టీ సెగ.. టీడీపీ నేతల అలక
ట్రెండింగ్
-
Microwave Cleaning Hacks : ఓవెన్లో మొండి మరకలా బెడదా.?.. 5 నిమిషాల ట్రిక్‌తో క్లీనింగ్ ఈజీ
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!