ట్రాఫిక్ రూల్స్‌ను బ్రేక్ చేసి చలానాలు వేసుకున్నవారికి గుడ్‌న్యూస్ చెబుతూ.. భారీ డిస్కౌంట్‌తో క్లియర్ చేసుకోవడానికి అవకాశం కలిపించింది ప్రభుత్వం.. కొన్నిసార్లు ఆ చలానాలు కట్టలేక వాహనాలను వదిలేసిన సందర్భాలు కూడా చూస్తున్నాం. ఇప్పుడు పెండింగ్ చలానాలు ఉన్నవాళ్లకి ట్రాఫిక్ పోలీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన విషయం తెలిసిందే.. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో రూ.600 కోట్ల పైచిలుకు పెండింగ్ చలాన్లు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. పెండింగ్ చలాన్లు క్లియర్ చేసేందుకు అధికారులు తీసుకొచ్చిన ప్రత్యేక డ్రైవ్‌కు అనూహ్యంగా స్పందన వస్తోంది..
Read Also: LPG Gas Price: భారీగా పెరిగిన గ్యాస్ ధర.. సిలిండర్‌పై రూ.105 పెంపు
ఇవాళ్టి నుంచి (మార్చి 1వ తేదీ) ఈ నెల మొత్తం పెండింగ్ లో ఉన్న చలాన్లను చెల్లిస్తే డిస్కౌంట్ ఇస్తున్నారు.. ఈ రోజు ఉదయమే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ చలాన్ల క్లియరెన్స్ మొదలైంది.. రాష్ట్రవ్యాప్తంగా వాహనాల పెండింగ్ చలాన్ల డిస్కౌంట్ కు విశేష స్పందన వస్తోంది.. ప్రతి నిమిషానికి దాదాపు 700 పెండింగ్ చలానాలను క్లియర్ చేస్తున్నారు అధికారులు.. ఆన్‌లైన్‌లో ఈ చలాన్ సైట్ ద్వారా పెండింగ్ చలాన్లు క్లియర్ చేసుకుంటున్నారు వాహనదారులు.. ఈ-చలాన్ వెబ్‌సైట్‌కు వెళ్లి వివరాలు ఎంటర్ చేస్తే.. గతంలో మీ వాహనంపై ఉన్న చలాన్లు.. వాటికి వేసిన సర్ ఛార్జ్‌తో పాటు.. డిస్కౌంట్ తర్వాత మీరు చెల్లించాల్సిన మొత్తాన్ని చూపిస్తోంది.. ఇక, పెండింగ్ చలాన్ల క్లియరింగ్ ఈ నెల చివరి వరకు ఉంటుందని తెలిపారు ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్… ఈ సేవ, మీ సేవ సెంటర్లులో కూడా క్లియరెన్స్ చేసుకోవచ్చు అని.. టూవీలర్ వాహనదారులు పెండింగ్ చలానాలో 75 శాతం రాయితీ ఇస్తున్నామని.. కార్లు, పెద్ద మోటార్ వాహనదారులకు 50 శాతం రాయితీ ఉందని వెల్లడించారు.