Dasoju Sravan: ప్రకాష్ రాజ్ కు బుద్ది ఉందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినీనటుడు ప్రకాష్ రాజ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. తెలంగాణలో నిరుద్యోగులు నానా ఇబ్బందులు పడుతున్నారని, 40 లక్షల మంది నిరుద్యోగులను కలవాలని ప్రకాష్ రాజ్ కి సూచించారు శ్రవణ్. ఇందిరా పార్క్ కి ఒక్కసారి వచ్చి చూడు. బుద్ది..జ్ఞానం లేదా ప్రకాష్ రాజ్ నీకు. రైతులు, నిరుద్యోగుల సమస్యలు నీకు గుర్తు లేవా..? ప్రతిపక్ష ఎమ్మెల్యే లను కొన్న కేసీఆర్ కి మద్దతు ఇవ్వడానికి సిగ్గుండాలి కదా ప్రకాష్ రాజ్ అంటూ ధ్వజమెత్తారు.
నువ్వు బెంగుళూరులో పోటీ చేస్తే నీకు వచ్చింది 24 వేల ఓట్లు. దాన్ని వదిలేసి… తెలంగాణలో తిరుగుతున్నావు ప్రకాష్ రాజ్. కాంగ్రెస్ కి నష్టం కలిగించే పనిలో ఉన్నారు కేసీఆర్. బీజేపీ, కేసీఆర్ కలిసి డ్రామా లాడుతున్నారు. మోడీని అడ్డం పెట్టుకొని తెలంగాణలో గెలవాలని చూస్తున్నారు కేసీఆర్. గడ్డిపోచ లాంటి ప్రకాష్ రాజ్, ప్రశాంత్ కిషోర్‌లను తెచ్చుకుని ఏదో చేద్దామనుకుంటున్నారు. వరదలో కొట్టుకు పోయె వాడికి గడ్డిపోచ లాగా పీకే దొరికాడు.
Also Read
- Revanth Reddy: మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్రావు, సంతోష్ రావు, కేటీఆర్ రూ.కోట్లు దోచుకున్నారు: సీఎం రేవంత్
- Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
- Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
రాజకీయ వ్యభిచారి పీకే అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు దాసోజు శ్రవణ్. పీకేతో 500 కోట్ల డీల్ కుదుర్చుకున్నారు కేసీఆర్. పీకేకి అసలు విలువలు ఉన్నాయా..? ప్రశాంత్ కిషోర్ ఒక్కడికే కేసీఆర్ 500 కోట్లు ఇచ్చాడు. విద్యావంతులు..మేధావులు అర్దం చేసుకోవాలి. తెలంగాణ రాజకీయ వ్యాపార ప్రయోగ శాలగా మార్చేశారు కేసీఆర్. మల్లన్న సాగర్ ని కాదు… భూమి కోల్పోయిన బాధితులను పీకే చూడాలన్నారు శ్రవణ్.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!