హైదరాబాద్ శివారులోని ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధి కర్ణంగూడ దగ్గర జరిగిన కాల్పులు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి అక్కడికక్కడే మృతిచెందగా.. మరో రియల్టర్ ఆస్పత్రిలో రాఘవేందర్ రెడ్డి చికిత్స అందుకుంటూ మరణించాడు. ఈ కాల్పుల కేసులో మరో ట్విస్ట్ బయటపడింది. శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిలపై గతం లో పలు మార్లు రాచకొండ పోలీసులకు ఫిర్యాదులు చేశారు.
తమ భూమిని కబ్జా చేస్తున్నారని రాచకొండ పోలిసులను కలిశారు లేక్ విల్లా ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు. ఈ ఫిర్యాదులను పట్టించుకోలేదు స్థానిక పోలీసులు. గత వారం రోజుల క్రితం ప్లాట్ ఓనర్స్ ను బెదిరించాడు శ్రీనివాస్ రెడ్డి . తమకు న్యాయం జరగకపోవడంతో కోర్ట్ మెట్లెక్కేందుకు సిద్ధం అయ్యారు లేక్ విల్లా ఓనర్స్. ఇంతలో అగంతకుల కాల్పుల్లో మరణించారు శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి.
1996 లో నెల్లూర్ వాసులకు భూమి అమ్మారు ఇంద్రా రెడ్డి, నర్సింహారెడ్డి, దేవి, పురుషోత్తం రెడ్డి. నెల్లూర్ వాసుల నుండి భూమిని సెల్ డీడ్ చేసుకున్నారు లేక్ విల్లా ప్లాట్ ఓనర్స్ సభ్యులు. ధరణి లో అదే భూమికి ఓనర్లు గా ఇంద్రారెడ్డి, నర్సింహా రెడ్డి పేర్లు వున్నాయి. వ్యవసాయేతర భూమిని వ్యవసాయ భూమి గా చూపించి ఇంద్రా రెడ్డి వద్ద నుండి ఓరల్ అగ్రిమెంట్ చేసుకున్నారు శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి.
అప్పటి నుండి లేక్ విల్లా ప్లాట్స్ లోకి వెళ్లి జేసీబీలతో అక్రమంగా చొరబడి బెదిరింపులకు పాల్పడ్డారు శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి. గత నెలలో తమను బెదిరించారంటున్నారు లేక్ విల్లా ప్లాట్ ఓనర్స్. లేక్ విల్లా తో పాటు ఇంకొన్ని భూములను ఇదే తరహాలో కబ్జా చేశారని చెబుతున్నారు లేక్ విల్లా ప్లాట్ ఓనర్స్. గతంలోనే పోలీసులకు ఫిర్యాదులు చేసినా లాభం లేదంటున్నారు లేక్ విల్లా ప్లాట్ ఓనర్స్. కాల్పులకు సంబంధించి పోలీసులు మట్టారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. కాల్పుల ఘటనపై ప్రస్తుతం ఇబ్రహీంపట్నం ఏసీపీ విచారణ చేస్తున్నారు.