దిష్టికి మన సమాజంలో ఎనలేని విలువ ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. కొత్తగా ఇల్లు కట్టుకున్నా ఇంటిముందు దిష్టిబొమ్మ కట్టడం, ఏదైనా పని ప్రారంభించినా గుమ్మడికాయను పగులగొట్టి దిష్టి లేకుండా చూసుకోవడం… దిష్టేమైనా తగిలిందేమోనని దిష్టిమంత్రాలు, యంత్రాలు వేయించడం సర్వసాధారణం. ఇలా దిష్టికి ఎనలేని ప్రాధాన్యత ఉంది మన సమాజంలో నరదిష్టంటే అంతకు మించి భయం వుంటుంది. అందుకే ఓ రైతు తన పంటకు దిష్టి తగలకుండా మనుషుల నుండి పక్షుల నుండి రక్షించుకునేందుకు వినూత్న పద్ధతి…
ఇవాళ, రేపు దేశ వ్యాప్తంగా భారత్ బంద్. సార్వత్రిక సమ్మెలో పాల్గొననున్న కార్మికులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు.. నిలిచిపోనున్న కార్యకలాపాలు. ఇవాళ టర్కీలో రష్యా, ఉక్రెయిన్ ల మధ్య మరోసారి చర్చలు. అనంతపురంలో నేడు ఎస్కేయూ పాలకమండలి సమావేశం. *నేడు నెల్లూరు నగరంలో ముఖ్యమంత్రి జగన్ పర్యటన. వీపీఆర్.కన్వెన్షన్ సెంటర్ లో జరిగే మేకపాటి గౌతమ్ రెడ్డి సంతాప సభకు హాజరు కానున్న సీఎం జగన్. పాల్గొననున్న మంత్రులు, ఎం.ఎల్.ఏ.లు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులు. స్టీల్…
ఎంఐఎం బీజేపీకి బి టీం అన్నారు ఆప్ సౌత్ ఇన్ ఛార్జి సోమ్ నాథ్ భారతీ. ముస్లిం ఓట్లు చీల్చుతూ బీజేపీకి ఓవైసీ లాభం చేస్తున్నాడు. మా నెక్స్ట్ టార్గెట్ గుజరాత్, హిమాచల్ ప్రదేశ్. కాశ్మీర్ పండిట్ల కోసం బీజేపీ ఏం చేసింది. కాశ్మీర్ ఫైల్స్ నిర్మాతకు డబ్బులు మాత్రమే కావాలి. యూట్యూబ్ లో పెడితే అందరూ ఫ్రీ గా చూస్తారు. కేసీఆర్ అవినీతి తెలంగాణలో చిన్నపిల్లలను అడిగిన చెప్తారు. పంజాబ్ లో కాంగ్రెస్ దళిత సీఎం…
హైదరాబాద్లో వింగ్స్ ఇండియా ఏవీయేషన్ షో (Wings India Aviation Show) అట్టర్ ఫ్లాప్ అయ్యింది. వివిధ సంస్థల ఉత్పత్తుల ప్రదర్శన దగ్గర నుంచి ఏర్పాట్లు వరకూ అన్ని ఫెయిలయ్యాయి. దీంతో ఈ ప్రదర్శనకు విచ్చేసిన సందర్శకులు పెద విరుస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి వింగ్స్ ఇండియా 2022కు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం వేదికయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా విమానయాన రంగంలో గల అనేక సంస్థలు తమ ఉత్పత్తుల్ని ఇక్కడ ప్రదర్శించాయి. దేశ, విదేశాలకు చెందిన విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు…
మంత్రులు.. ఎమ్మెల్యేలు రోడ్లపైకి వస్తుంటే.. అధికారపార్టీ కేడర్ మాత్రం వారికి షాక్ ఇస్తోంది. నియోజకవర్గాలకు బాస్లమని చెప్పుకొంటున్న శాసనసభ్యులకు తాజా పరిస్థితులు మింగుడు పడటం లేదట. ఇటీవల జరిగిన పరిణామాలు MLAలను మరింత కలవర పెడుతున్నట్టు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధికారపార్టీలో ఒక్కటే గుసగుసలు. భారీ ఏర్పాట్లు చేసినా కేడర్ డుమ్మా..!ధాన్యం కొనుగోళ్లుపై కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించింది అధికార టీఆర్ఎస్. ఇంఛార్జ్ మంత్రి…
ఆ మాజీ ఎంపీ ఎందుకు సైలెంట్ అయ్యారు? పార్టీలో నెలకొన్న విభేదాలతో టచ్ మీ నాట్గా ఉంటున్నారా.. లేక జంప్ చేయడానికి చూస్తున్నారా? ఇంతకీ ఎవరా మాజీ ఎంపీ? ఆయన చుట్టూ పార్టీలో ఎందుకు చర్చ? లెట్స్ వాచ్..! కాంగ్రెస్లో చప్పుడు లేని పొన్నంతెలంగాణ కాంగ్రెస్లో ఓ వెలుగు వెలిగిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కొంతకాలంగా సైలెంట్. హైకమాండ్ పిలుపిచ్చిన పార్టీ కార్యక్రమాల్లో తప్ప ఎక్కడా కనిపించడ లేదు. గతంలో పార్టీ తరఫున చేపట్టిన నిరసనల్లో…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జంతువుల వేటకు వెళ్లి విద్యుత్ షాక్ తో ఒకరు మరణించడం, మరొకరు ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపుతోంది. అడవి జంతువుల వేట వారి పాలిట మృత్యువు గా దాపురించింది. అడవి జంతువుల వేటకు వెళ్లి విద్యుత్ షాక్ తో ఒకరు మృతి చెందగా, ఆ మృతదేహం రెండు రోజులు అయినప్పటికీ లభించలేదు. పోలీసుల వేధింపులకు భయపడి మరో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం సృష్టించింది. గత రెండు రోజుల నుంచి పోలీసులు…
ఒక్కొక్కరికి ఒక్కో అభిమానం ఉంటుంది. కొందరికి సినిమా స్టార్లు అంటే పిచ్చి. ఇంకొందరికి రాజకీయ నేతలంటే అభిమానం. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్కు ఏపీలోనూ అభిమానులు ఉన్నారు. దీంతో కేటీఆర్ సీఎం కావాలంటూ ఏపీలోని ఓ అభిమాని బైక్ యాత్ర చేపట్టాడు. గుంటూరు జిల్లాకు చెందిన బాలరాజుగౌడ్ అనే వ్యక్తి వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ సీఎం కావాలని ఆకాంక్షిస్తూ గుంటూరు జిల్లా మాచర్ల నుంచి యాదాద్రి వరకు బైక్ యాత్రకు శ్రీకారం చుట్టాడు. తన బైక్…
తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. దేశవ్యాప్తంగా ఇప్పటికే నడుస్తున్న సైనిక్ స్కూళ్లకు అదనంగా మరో 21 సైనిక్ స్కూళ్ల ఏర్పాటుకు కేంద్ర రక్షణ శాఖ శనివారం ఆమోదం తెలిపింది. పీపీపీ పద్ధతిలో నడిచే ఈ కొత్త సైనిక్ స్కూళ్లలో 7 డే స్కూళ్లుగా పనిచేయనుండగా.. 14 మాత్రం రెసిడెన్షియల్ మోడ్లో నడవనున్నట్లు రక్షణ శాఖ ప్రకటన చేసింది. ఇక కొత్తగా ఏర్పాటు కానున్న 21 సైనిక్ స్కూళ్లలో రెండు తెలుగు రాష్ట్రాలకు ఒక్కోటి చొప్పున…
వరుసగా పెరుగుతున్న నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ సిలిండర్ల బాదుడుతో సామాన్యులు నానా అవస్థలు పడుతున్నారు. తెలంగాణలో ఆర్టీసీ, విద్యుత్ చార్జీలు విపరీతంగా పెంచారు. చంద్రబాబు హయాంలో ఛార్జీల పెంపుపై పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. చంద్రబాబు అధికారం కోల్పోయారు. ఇపుడు ధరలు తగ్గించక పోతే, ఆందోళనలు చేస్తాం అన్నారు సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం. వరి కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్రాలు బాధ్యత తీసుకోవాలన్నారు. కేసీఆర్ బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడడాన్ని స్వాగతిస్తున్నాం. రాష్ట్ర ప్రయోజనాల…