CM Chandrababu Kuppam Tour: కుప్పంలో సీఎం బిజీ షెడ్యూల్.. 23 వేల ఉద్యోగాల లక్ష్యంగా భారీ పరిశ్రమలకు శ్రీకారం
- సొంత నియోజకవర్గం కుప్పంలో సీఎం పర్యటన..
- నేటి మూడు రోజుల పాటు కుప్పంలో చంద్రబాబు టూర్..
- అభివృద్ధి, పార్టీ కార్యక్రమాలకు సమాన ప్రాధాన్యత..
- రూ.3,847 కోట్లతో 12 పరిశ్రమలకు శంకుస్థాపన..
- 23 వేల మందికి ఉపాధి కల్పించే పరిశ్రమల ఏర్పాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu Kuppam Tour: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి నుంచి మూడు రోజుల పాటు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో విస్తృతంగా పర్యటించనున్నారు. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాలకు కూడా సమాన ప్రాధాన్యత ఇస్తూ సీఎం బిజీ షెడ్యూల్‌ను ఖరారు చేశారు. మధ్యాహ్నం 3:30 గంటలకు ద్రావిడ విశ్వవిద్యాలయం హెలిప్యాడ్‌కు చేరుకోనున్న ఆయన, అనంతరం వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.
గుడుపల్లి మండలంలోని పొగురుపల్లిలో ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ పార్క్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. అలాగే రూ.3,847 కోట్ల వ్యయంతో ఏర్పాటు కానున్న 12 పరిశ్రమలకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ పరిశ్రమల ద్వారా సుమారు 23 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు అధికారులు తెలిపారు. అదనంగా రూ.1,026 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు కానున్న ఆరు పరిశ్రమలకు సంబంధించి సీఎం సమక్షంలో ఎంఓయూలు కుదరనున్నాయి.
Also Read
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
- MLA Gurajala Jaganmohan: హాట్ టాపిక్‌గా టీడీపీ ఎమ్మెల్యే వ్యవహారం.. కార్పొరేషన్ టికెట్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
పొగురుపల్లిలో నిర్వహించే భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం అబీస్ ప్రోటీన్స్ చికెన్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ప్రారంభించడంతో పాటు 200 మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందజేయనున్నారు. అలాగే 28 మంది పారిశ్రామికవేత్తలతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధిపై చర్చించనున్నారు. సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల కోసం ఏర్పాటు చేసిన సోలార్ పవర్ ప్లాంట్లను ప్రారంభించనున్నారు. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద నిర్మించిన 5,179 ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. మొత్తం మీద సీఎం మూడు రోజుల కుప్పం పర్యటనలో అభివృద్ధి, పారిశ్రామికీకరణ, ఉపాధి కల్పన, సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేయనున్నారు.
తాజావార్తలు
-
RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
-
Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
-
Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!