కేంద్ర ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత ట్వీట్….మోదీ సర్కార్ పై విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీఆర్ఎస్ నేతలు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పనితీరుపై ఇప్పటికే మంత్రి కేటీఆర్ వరసగా ట్వీట్లు చేస్తున్నారు. గ్యాస్ ధరలు, నిరుద్యోగం, ద్రవ్యోల్భనం ఇలా ప్రతీ అంశంపై ట్విట్టర్ వేదికపై కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు. ధాన్యం కొనుగోలుపై కేంద్ర అవలంభిస్తున్న తీరుతో పాటు తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, కేంద్ర ప్రాజెక్టుల్లో తెలంగాణకు మొండిచేయి చూపడంపై కేటీఆర్ మోదీ సర్కార్ ను విమర్శిస్తున్నారు. తాజాగా ఎమ్మెల్సీ కవిత కూడా కేంద్రంపై ట్విట్టర్ వేదికగా కేంద్రాన్ని విమర్శించారు. పెరుగుతున్న నిత్యావసర ధరలపై ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. డాలర్ తో పోలిస్తే అత్యంత గరిష్ట స్థాయికి రూపాయి మారకం విలువ చేరడంతో కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. తీవ్రస్థాయిలో నిరుద్యోగ రేటు పెరిగిందని… 7.83 శాతానికి నిరుద్యోగం చేరిందని విమర్శించారు. గ్యాస్ ధర వెయ్యికి చేరిందని… ఇదేనా మోదీ సర్కార్ మనకు చెప్పిన మంచి రోజులు అంటూ ట్వీట్ చేశారు.
ఇటీవల కాలంలో టీఆర్ఎస్ పార్టీ బీజేపీపై, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది. ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాలో అక్కడి ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరును కూడా ఎండగడుతోంది. రామనవమి, హనుమాన్ జయంతి ఉత్సవాల్లో గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఢిల్లీల్లో అల్లర్లు చెలరేగాయి. ఈ వ్యవహారంపై కూడా టీఆర్ఎస్ పార్టీ ఘాటు విమర్శలు చేసింది. కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఎందుకు మతఘర్షణలు చోటు చేసుకుంటున్నాయని ప్రశ్నించింది. వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే బీజేపీ ఇలాంటి చిల్లర, మతపరమైన రాజకీయాలు చేస్తుందని ఆరోపిస్తోంది. విభజన రాజకీయాలు తప్పితే బీజేపీ ప్రజలకు చేసిందేం లేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు టీఆర్ఎస్ నాయకులు. ఈ విమర్శలపై బీజేపీ కూడా అంతే స్థాయిలో స్పందిస్తోంది. మైనారిటీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటోందని… ఎంఐఎం పార్టీతో చేరి వారు చెప్పినట్లు నడుచుకుంటోందని విమర్శలు చేస్తున్నారు.
Also Read
- Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
- Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
- Heavy Rain Alert: వినాయక నిమజ్జనం వేళ తెలంగాణకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
- Tags
- bjp
- Gas Prices
- india
- inflation
- Kavita
తాజావార్తలు
-
BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
-
The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్‌పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
-
AMB, AAAల తర్వాత ఇక ‘మెగా సినిమాస్’.. ప్రపంచ స్థాయి స్క్రీన్‌తో బాస్ ఎంట్రీ?
-
Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
-
Amazon Sale: ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్.. తేదీ ప్రకటించిన అమెజాన్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!