RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nothing Phone (4b) RCB Edition: స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ నథింగ్ (Nothing) క్రికెట్ ఫ్రాంచైజీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)తో భాగస్వామ్యంగా రూపొందించిన ప్రత్యేక ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ Nothing Phone (4b) RCB ఎడిషన్ డిజైన్‌ను అధికారికంగా ఆవిష్కరించింది. ఇప్పటికే పలు టీజర్ల ద్వారా ఆసక్తిని పెంచిన సంస్థ.. ఇప్పుడు ఈ లిమిటెడ్ ఎడిషన్ ఫోన్ రూపురేఖలను విదుదల చేసింది.
RCB విజయాలకు గుర్తుగా:
ఈ ప్రత్యేక స్మార్ట్‌ఫోన్‌ను RCBతో నథింగ్ సంస్థకు ఉన్న రెండేళ్ల భాగస్వామ్యాన్ని పురస్కరించుకుని రూపొందించారు. 2025 టీ20 సీజన్లో అసోసియేట్ స్పాన్సర్‌గా వ్యవహరించిన నథింగ్, 2026 సీజన్లో టైటిల్ స్పాన్సర్‌గా మారింది. ఈ భాగస్వామ్య కాలంలో RCB వరుసగా రెండు సీజన్లలో ఛాంపియన్షిప్ విజయాలు సాధించడంతో.. ఆ విజయాలను స్మరించుకునేలా ఈ ప్రత్యేక ఎడిషన్‌ను తీసుకువచ్చారు.
Also Read
- Zeno Smart Phone: Zeno ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ లాంచ్.. బడ్జెట్ రూ.9,649.. 6,000mAh బ్యాటరీ, 90Hz రిఫ్రెష్ రేట్..
- రూ.1.3 లక్షల విలువైన iPhone 17 Pro.. కేవలం రూ.56 వేలకే.. ఆఫర్ ఫుల్ డీటెయిల్స్ ఇవే..
- POVA New Mobile: POVA 8 5G మొబైల్ ఫోన్ లాంచ్.. 8000mAh బ్యాటరీ, 144Hz రిఫ్రెష్ రేట్, FHD+ ఫ్లాట్ LCD స్క్రీన్..
- iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
జూలై 7న మాత్రమే అమ్మకాలు:
Nothing Phone (4b) RCB ఎడిషన్ జూలై 7, 2026న మాత్రమే విక్రయానికి అందుబాటులో ఉంటుంది. బెంగళూరులోని నథింగ్ స్టోర్‌లో సాయంత్రం 4 గంటల నుంచి ఫస్ట్ కమ్–ఫస్ట్ సర్వ్ విధానంలో ఈ ఫోన్‌ను విక్రయించనున్నారు. పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉండటంతో RCB అభిమానులలో భారీ ఆసక్తి నెలకొంది. ఈ ప్రత్యేక ఎడిషన్ ఫోన్‌కు సంబంధించిన తాజా సమాచారం, లాంచ్ నోటిఫికేషన్లు పొందాలనుకునే వినియోగదారుల కోసం నథింగ్ తన అధికారిక వెబ్సైట్లో ప్రత్యేక రిజిస్ట్రేషన్ పేజీని ప్రారంభించింది. ఆసక్తి ఉన్నవారు ముందుగానే నమోదు చేసుకుని అప్డేట్స్ పొందవచ్చు.
ఈ సందర్భంగా నథింగ్ సహ వ్యవస్థాపకుడు, ఇండియా ప్రెసిడెంట్ అకిస్ ఎవాంజెలిడిస్ మాట్లాడుతూ.. “సాంకేతికత కేవలం ఉత్పత్తులను మాత్రమే కాకుండా ఒక ప్రత్యేక సంస్కృతిని కూడా సృష్టించాలని మాకు ఉంది. RCBతో మా భాగస్వామ్యం సంప్రదాయాలను సవాలు చేసే రెండు కమ్యూనిటీలను ఒక వేదికపైకి తీసుకొచ్చింది. RCB చారిత్రాత్మక ఛాంపియన్షిప్ విజయాన్ని, మా సంయుక్త ప్రయాణాన్ని గుర్తు చేసుకునే ప్రయత్నమే Phone (4b) RCB ఎడిషన్ అని తెలిపారు.
తాజావార్తలు
-
CJP Deepfake Case: PM మోదీతో మహిళ మార్ఫ్డ్ ఫొటోలు.. CJP నేతలకు హైకోర్టు నోటీసులు
-
Trump-Jinping: ట్రంప్ విందుకు అందరూ వచ్చారు.. అసలైనోడే డుమ్మా కొట్టాడు.. ఎవరా ముఖ్యుడు!
-
CM Revanth Reddy : సీఎం రేవంత్‌కు కేరళలో ఘన గౌరవం.. ‘బెస్ట్ పబ్లిక్ సర్వెంట్’ అవార్డు.!
-
Kaaka Update: సంక్రాంతి బరి నుంచి తగ్గేదేలే.. ‘కాకా’ పనులు షురూ!
-
Gyanesh Kumar: ‘జ్ఞానేష్ కుమార్‌కు పద్మభూషణ్ ఇవ్వాలి’.. బెంగాల్ బీజేపీ చీఫ్ వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!