తెలంగాణకు కొత్త ప్రాజెక్టులు వస్తూనే ఉన్నాయి.. ముఖ్యంగా రాజధాని చుట్టూ కొత్త సంస్థలు తమ కార్యకలాపాలను ప్రారంభిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది గ్రిడ్ డైనమిక్స్ కంపెనీ.. ఈ సంవత్సరాంతానికి ఇక్కడి నుంచి సుమారు 1000 మంది ఉద్యోగులు కంపెనీ కోసం పని చేయనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు..
Read Also: Sonia Gandhi: సీడబ్ల్యూసీ సమావేశం.. సోనియా కీలక వ్యాఖ్యలు..
ప్రముఖ డిజిటల్ కన్సల్టింగ్ కంపెనీ గ్రిడ్ డైనమిక్స్ కంపెనీ హైదరాబాద్ లో తన కార్యకలాపాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది… అంతర్జాతీయంగా కంపెనీ తన విస్తరణ ప్రణాళికలో భాగంగా ఈ రోజు భారతదేశంలో తన కార్యకలాపాలను హైదరాబాద్ కేంద్రంగా ఎంచుకున్న ట్లు తెలిపింది. ఈ సంవత్సరాంతానికి ఇక్కడి నుంచి సుమారు 1000 మంది ఉద్యోగులు కంపెనీ కోసం పని చేయనున్నట్లు ఈరోజు మంత్రి కె. తారకరామారావుతో జరిగిన సమావేశంలో కంపెనీ సీనియర్ ప్రతినిధి బృందం తెలియజేసింది. కంపెనీ సీఈవో Leonard Livschitz ఈరోజు తన ప్రతినిధి బృందంతో మంత్రి కేటీఆర్‌ను హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో కలిసి.. ఈ మేరకు తెలియాజేశారు. ఇక, గ్రిడ్ మైనమిక్ కంపెనీ నిర్ణయాన్ని సాదరంగా ఆహ్వానించిన మంత్రి కేటీఆర్.. వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఇక, ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేశారు మంత్రి కేటీఆర్.. మల్టీ నేషనల్ కంపెనీలకు హైదరాబాద్ కేంద్రంగా నిలిచిందన్నారు.. గ్రిడ్ డైనమిక్స్ భారత్‌లో మొదటి యూనిట్‌ను ఏర్పాటు చేస్తోందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ యూనిట్ ఏర్పాటుతో హైదరాబాద్‌లో వెయ్యి మందికి ఉపాధి లభిస్తుందన్నారు కేటీఆర్.