Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్‌ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
- వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం ఎప్పుడు?
- పలువురు మాజీ క్రికెటర్లు అసంతృప్తి
- బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Sooryavanshi India Debut: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం ఎప్పుడు జరుగుతుందా? అనే ప్రశ్న ఇప్పుడు భారత అభిమానులనే కాదు.. ప్రపంచ క్రికెట్ అభిమానులను కూడా ఉత్కంఠకు గురిచేస్తోంది. ఇటీవల ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో బుడ్డోడికి అవకాశం ఇవ్వకపోవడంపై ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్లు మైకేల్ వాన్, అలిస్టర్ కుక్ కూడా వైభవ్‌కు వెంటనే అవకాశం ఇవ్వాలని బీసీసీఐని కోరడం విశేషం. బీసీసీఐ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌కు ఎవరన్నా చెప్పండి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బీసీసీఐ,అగార్కర్‌కు చెప్పాలి:
‘స్టిక్ టు క్రికెట్’ పోడ్కాస్ట్లో మాట్లాడిన మైకేల్ వాన్.. ఐర్లాండ్ సిరీస్‌లో వైభవ్‌ను ఆడించకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ‘బీసీసీఐకి, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌కు ఎవరైనా చెప్పాలి. ఐర్లాండ్ సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీని ఎందుకు ఆడించలేదు?. మా చిన్నోడిని మైదానంలో చూడాలని ఉంది’ అని వాన్ వ్యాఖ్యానించాడు. వాన్ వ్యాఖ్యలకు స్పందించిన కుక్ కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. ‘నేను రేపు స్టేడియానికి అభిమానిగా వెళ్తున్నాను. ఆ 15 ఏళ్ల కుర్రాడు తప్పకుండా ఆడాలని కోరుకుంటున్నాను’ అంటూ వైభవ్‌పై తన అభిమానాన్ని చాటుకున్నాడు.
Also Read
- IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
- IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
- Pakistan Cricket Team: శ్రీలంకతో సిరీస్‌కు ముందు పాకిస్థాన్ జట్టులో కీలక మార్పులు.. కొత్త కెప్టెన్ నియామకం..
- Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన వైభవ్:
2026 ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రదర్శనతో ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. 237.30 స్ట్రైక్‌రేట్‌తో 776 పరుగులు చేసి టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు. తన అద్భుతమైన ఆటతీరుకు గాను ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు. అయితే ఐర్లాండ్ పర్యటనలో భారత జట్టులో చోటు దక్కినా.. తుది జట్టులో మాత్రం అవకాశం రాకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. అదే సిరీస్‌లో భారత్ 0-2తో ఓటమిపాలవడం కూడా చర్చనీయాంశమైంది.
ప్రపంచమంతా వైభవ్ కోసం ఎదురుచూస్తోంది:
భారత మాజీ క్రికెటర్ సబా కరీమ్ కూడా వైభవ్ ప్రతిభపై ప్రశంసలు కురిపించాడు. ‘నా అభిప్రాయం ప్రకారం ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ అద్భుత సీజన్ తర్వాత గుర్తుండిపోయే సీజన్ ఏదైనా ఉంటే అది వైభవ్ సూర్యవంశీదే. ప్రపంచ స్థాయి బౌలర్లపై అతడు చూపించిన ఆధిపత్యం అసాధారణం’ అని పేర్కొన్నాడు. ‘వైభవ్ పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడే సామర్థ్యం ఉన్న ఆటగాడు. భారత అభిమానులే కాదు.. ప్రపంచమంతా అతడు ఐపీఎల్లో ఆడిన తరహాలోనే అంతర్జాతీయ క్రికెట్లో కూడా మెరుస్తాడని ఎదురు చూస్తోంది. అతడిపై నాకు పూర్తి నమ్మకం ఉంది. త్వరలోనే టీ20లతో పాటు వన్డేలు, టెస్టుల్లో కూడా భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తాడనే నమ్మకం నాకు ఉంది’ అని సబా కరీమ్ ధీమా వ్యక్తం చేశాడు.
ఇంగ్లండ్ సిరీస్‌లోనైనా అవకాశం దక్కుతుందా?:
ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అయినా వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం అవకాశం లభిస్తుందా అనే ఆసక్తి నెలకొంది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో.. రెండో టీ20లో జట్టు కూర్పుపై అందరి దృష్టి ఉంది. సంజు శాంసన్ విఫలమవడం బుడ్డోడికి కలిసిరానుంది. ఇప్పటికే భారత మాజీలు, విదేశీ దిగ్గజాలు, అభిమానులు వైభవ్‌కు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తుండగా.. టీమ్ మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
-
Amazon Festival Sale: ఈ కంపెనీ ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్లు.. ఓ లుక్కేయండి..
-
Apple iPhone Offers: ఐఫోన్ లవర్స్‌కు పండగే.. అమెజాన్ సేల్‌లో భారీగా తగ్గిన ఐఫోన్ 16, 17e ధరలు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు