సీఎల్సీ నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో తన పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చిన ఆయన.. ఆ తర్వాత మళ్లీ పాదయాత్ర తిరిగి ప్రారంభించారు.. పాదయాత్రలో ఉన్న ఆయన.. ఇవాళ ఢిల్లీలో రాహుల్ గాంధీతో జరిగిన తెలంగాణ కాంగ్రెస్ నేతల కీలక భేటీకి కూడా వెళ్లలేదు.. దీనిపై ముందుగానే అధిష్టానానికి సమాచారం ఇచ్చారు.. మరోవైపు.. పాదయాల్రలో ఉన్న సీఎల్పీ నేత భట్టికి ఫోన్ చేశారు రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్..…
భారతీయ సంస్కృతి సంప్రదాయాలు కాపాడే బాధ్యత ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్నారని తెలిపారు బీజేపీ నేత, మాజీ ఎంపీ విజయశాంతి.. హన్మకొండ జిల్లాలో జరిగిన జాతీయ సాంస్కృతిక మహోత్సవం ముగింపు కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో కలిసి పాల్గొన్న విజయశాంతి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతి ప్రపంచ దేశాలకు ఆదర్శం అన్నారు.. దేశ సంస్కృతిని కాపాడుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందన్న ఆమె.. సంస్కృతి సంప్రదాయాలు కాపాడే బాధ్యత మోడీ తీసుకున్నారని తెలిపారు. Read…
వాహనదారులకు మరోసారి గుడ్న్యూస్ చెప్పింది ప్రభుత్వం.. పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు రాయతీపై చెల్లించుకునే గడువు రేపటితో ముగియనున్న నేపథ్యంలో.. మరో సారి వెసులుబాటు కల్పించింది.. ముందుగా నిర్ణయించిన ప్రకారం.. మార్చి 1 నుండి 31వ తేదీ వరకు పెండింగ్లో ఉన్న చలాన్లపై రాయితీ అవకాశం ఉంది.. ఇవాళ్టి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2.40 కోట్ల చలాన్లు క్లియర్ చేశారు.. వీటి విలువ 840 కోట్ల రూపాయలుగా ఉంది.. ఇప్పటి వరకు పెండింగ్ చలాన్లు క్లియర్ చేసుకోవడం ద్వారా…
తెలంగాణలో మార్చిలోనే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.. రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నమోదు అయ్యాయి.. కొమురం భీం జిల్లా కెరమెరిలో ఇవాళ అత్యధికంగా 43.9, కౌటాలలో 43.7, చెప్రాలలో 43.8 డిగ్రీలుగా నమోదు కాగా.. జైనాథ్లో 43.8 డిగ్రీలు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది.. అయితే, ఎండ తీవ్రత నేపథ్యంలో పాఠశాలల సమయం కుదించాలని ఆదేశాలు జారీ చేశారు సీఎస్ సోమేష్ కుమార్.. రాష్ట్రంలో ఎండ తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా…
రేవంత్ రెడ్డి ఐరన్ లెగ్.. ఆయన అడుగుపెట్టడంతో తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ జీరో కాబోతోంది అని వ్యాఖ్యానించారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద.. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. రేవంత్ రెడ్డి ఫాల్తూ మాటలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.. పార్లమెంట్ సెంట్రల్ హాల్ ఇమేజ్ను అపహాస్యం చేసేలా రేవంత్ మాట్లాడారని.. బీసీ జనగణను తక్కువ చేసి వ్యాఖ్యానించారని.. వెంటనే బీసీలకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.. రేవంత్ రెడ్డిని ఇప్పటికే…
తెలంగాణలో సంచలనం కలిగించిన వికారాబాద్ లో మైనర్ బాలికపై అత్యాచారం, హత్ కేసు కొలిక్కి వస్తోంది. తానే హత్య చేసినట్టు ప్రియుడు మహేందర్ (నాని) పోలీసుల విచారణలో ఒప్పుకున్నట్టు సమాచారం. హత్య జరిగిన రాత్రి స్నేహితులతో కలిసి మద్యం సేవించాడు యువకుడు. ఉదయం మూడు నుండి నాలుగు గంటల ప్రాంతంలో బయటకు రమ్మని బాలికకు ఫోన్ చేశాడు ప్రియుడు. ఊరి చివరన నిర్మాణుష్య ప్రాంతంలో కలుసుకున్నారు ఇద్దరు. శారీరకంగా కలవాలని బాలికను కోరాడు యువకుడు. అయితే ప్రతిఘటించింది…
ఈమధ్యకాలంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరగడం, కొంతమంది ప్రాణాలు పోతుండడం, బైక్ లు ధ్వంసం కావడంతో తనిఖీలు పెంచారు పోలీసులు. బంజారాహిల్స్ పార్క్ హయత్ దగ్గర సాధారణ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులకు చుక్కలు చూపించారు మందు బాబులు. రోడ్డు కు అడ్డంగా పడుకోవడంతో ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం కలిగింది. కొంతమందిని పోలీసులు చూసీ చూడనట్లు…
ఏపీలో జిల్లాల పునర్విభజన పై సీఎం జగన్ కీలక సమీక్ష. ఉదయం 11 గంటలకు క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేపట్టనున్న ముఖ్యమంత్రి జగన్. తుది మార్పులు చేర్పులతో సిద్ధం కానున్న ఫైనల్ డ్రాఫ్ట్ సీఎం కేసీఆర్ కరీంనగర్ జిల్లా పర్యటన. వేములవాడ ,కొండగట్టు దేవాలయాల సందర్శన. పలు అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశాల్లో పాల్గొననున్న కేసీఆర్ మాసశివరాత్రి సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించిన ఆలయ అర్చకులు. సాయంత్రం…
సీఎం కేసీఆర్ ప్రారంభించిన దళిత బంధు అనేది ఒక్క ఆర్ధిక సహాయం కాదు, దళితుల అభ్యున్నతి కోసం ప్రారంభించిన ఒక్కఉద్యమం అన్నారు మంత్రి హరీష్ రావు. వారి జీవితాలు వెలుగులు నింపాలనేది సీఎం కేసీఆర్ ఆశయం. దళితబంధు ద్వారా ఆర్ధిక సహాయం అందించడమతో పాటుగా వ్యాపారాభివృద్ధికి ప్రభుత్వ అధికారులు సహకరిస్తారు. నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా 21 శాతం రిజర్వేషన్ దళితులకు కల్పించడం జరిగిందన్నారు. వైన్ షాప్ లో కూడా దళితులకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది.…
తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ళపై పార్టీల మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. తాజాగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కౌంటరిచ్చారు టీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ధాన్యం కొనుగోలుపై రాహుల్ గాంధీకి పలు ప్రశ్నలు సంధించారు. ఎంపీగా ఉన్న రాహుల్ గాంధీ గారు, రాజకీయ లబ్ది కోసం నామమాత్రంగా ట్విట్టర్ లో సంఘీభావం తెలపడం కాదన్నారు కవిత. ధాన్యం కొనుగోళ్ళకు సంబంధించి పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు ఒక నీతి, ఇతర రాష్ట్రాలకు మరో నీతి ఉండకూడదని టిఆర్ఎస్ పార్టీ…