Jai Moondra: టీమిండియాపై చెలరేగాడు.. బంపర్ ఛాన్స్ కొట్టేశాడు.. జయహో జై ముంద్రా!
- టీమిండియాపై చెలరేగిన జై ముంద్రా
- బంపర్ ఛాన్స్ కొట్టేసిన జై ముంద్రా
- జాన్ అబ్రహాం జట్టుకు ఆడనున్న జై
- Follow Us :
-
-
Add as a preferred
source on google
John Abraham’s ETPL Team Signs Ireland Star Jai Moondra: భారత మూలాలు కలిగిన ఐర్లాండ్ యువ పేసర్ జై ముంద్రా బంపర్ ఛాన్స్ కొట్టేశాడు. ఇటీవల టీమిండియాతో జరిగిన టీ20 సిరీస్‌లో అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన జై.. ఇప్పుడు యూరో టీ20 ప్రీమియర్ లీగ్ (ఈటీపీఎల్)లో ఆడే అవకాశం దక్కించుకున్నాడు. ప్రముఖ బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహాం సహ యజమానిగా ఉన్న ‘రోటర్‌డామ్ డాకర్స్’ జట్టుకు అతడు ఆడనున్నాడు. ప్లేయర్ డ్రాఫ్ట్‌లో జైని తొలి ఎంపికగా జాన్ అబ్రహాం టీమ్ తీసుకుంది.
టీమిండియాపై ప్లేయర్ ఆఫ్ ది సిరీస్:
రాజస్థాన్‌లో జన్మించిన జై ముంద్రా ప్రస్తుతం ఐర్లాండ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇటీవల భారత్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అతడు అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా భారత వికెట్‌కీపర్ బ్యాటర్ సంజు శాంసన్‌ను రెండు మ్యాచ్‌ల్లోనూ ఔట్ చేసి తన ఆధిపత్యాన్ని చాటాడు. మొదటి టీ20లో 4 ఓవర్లలో 25 పరుగులు ఇచ్చి 2 వికెట్స్ పడగొట్టిన జై.. రెండో టీ20లో 4 ఓవర్లలో 32 రన్స్ ఇచ్చి మూడు కీలక వికెట్స్ తీశాడు. పొట్టి సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన అతడికి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు కూడా దక్కింది
Also Read
- India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
- Virat Kohli 100 Centuries: 100 సెంచరీలు కొట్టలేడు..! కోహ్లీపై టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర కామెంట్స్
- Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
- India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
డ్రాఫ్ట్‌లో తొలి ఎంపికగా రోటర్‌డామ్ డాకర్స్:
యూరో టీ20 ప్రీమియర్ లీగ్ తొలి ప్లేయర్ డ్రాఫ్ట్‌లో మొత్తం ఆరు ఫ్రాంచైజీలు తమ జట్లను ఎంపిక చేసుకున్నాయి. ఐర్లాండ్, స్కాట్లాండ్, నెదర్లాండ్స్ నుంచి చెరో 12 మంది చొప్పున మొత్తం 36 మంది ఆటగాళ్లను డ్రాఫ్ట్‌లో ఎంపిక చేశారు. రోటర్‌డామ్ డాకర్స్ తమ తొలి ఎంపికగా జై ముంద్రాను తీసుకుంది. దాంతో అతడికి పెరుగుతున్న క్రేజ్‌కు నిదర్శనంగా నిలిచింది.
బలమైన జట్టును నిర్మించిన డాకర్స్:
జై ముంద్రాతో పాటు నెదర్లాండ్స్ అంతర్జాతీయ ఆటగాళ్లు మైకేల్ లెవిట్, ర్యాన్ క్లైన్, విక్రమ్‌జిత్ సింగ్, సాకిబ్ జుల్ఫికర్లను కూడా రోటర్‌డామ్ డాకర్స్ తీసుకుంది. స్కాట్లాండ్కు చెందిన జాస్పర్ డేవిడ్సన్ కూడా ఈ జట్టులో చోటు దక్కించుకున్నాడు. భారత్‌పై మెరుపు ప్రదర్శనతో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించిన జై.. ఇప్పుడు యూరో టీ20 ప్రీమియర్ లీగ్‌లో కూడా తన ప్రతిభను నిరూపించుకునే అవకాశం పొందాడు. ఈ టోర్నీలోనూ అతడు రాణిస్తే.. ప్రపంచవ్యాప్తంగా మరిన్ని ప్రముఖ ఫ్రాంచైజీ లీగ్‌లలో అవకాశాలు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
జైపై జట్టు నమ్మకం:
రోటర్‌డామ్ డాకర్స్ సహ యజమాని, దక్షిణాఫ్రికా మాజీ దిగ్గజ క్రికెటర్ జాంటీ రోడ్స్.. జై ముంద్రాపై ప్రశంసలు కురిపించాడు. ‘భారత్‌పై అంతర్జాతీయ వేదికపై జై మూండ్రా చూపించిన ప్రదర్శన మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంది. అతడు భవిష్యత్తులో గొప్ప క్రికెటర్‌గా ఎదిగే సామర్థ్యం ఉన్న యువ ఆటగాడు. అందుకే డ్రాఫ్ట్‌లో అతడిని తప్పకుండా తీసుకోవాలని ముందే నిర్ణయించుకున్నాం. మా జట్టులో అతడిని స్వాగతించడం ఆనందంగా ఉంది’ అని జాంటీ పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
-
Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
-
Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! ‘జై హనుమాన్’ అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
-
Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
-
Virat Kohli 100 Centuries: 100 సెంచరీలు కొట్టలేడు..! కోహ్లీపై టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర కామెంట్స్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!