Revolt RVX: రివోల్ట్ నుంచి కొత్త RVX ఎలక్ట్రిక్ బైక్ లాంచ్.. 160KM రేంజ్, 90kmph టాప్ స్పీడ్
- రివోల్ట్ నుంచి కొత్త RVX ఎలక్ట్రిక్ బైక్ లాంచ్
- 160 కిలోమీటర్ల వరకు రేంజ్
- ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.1.30 లక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రివోల్ట్ మోటార్స్ (Revolt Motors) భారత మార్కెట్లో తన కొత్త RVX ఎలక్ట్రిక్ బైక్ ని విడుదల చేసింది. యువతను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన ఈ బైక్‌ను పనితీరు, స్మార్ట్ ఫీచర్లతో మార్కెట్లోకి తీసుకొచ్చింది. రూ.1.30 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చిన ఈ బైక్, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 160 కిలోమీటర్ల వరకు రేంజ్ అందిస్తుందని కంపెనీ ప్రకటించింది.
శక్తివంతమైన మిడ్-డ్రైవ్ మోటార్
కొత్త Revolt RVXలో 4kW మిడ్-డ్రైవ్ పర్మనెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటార్ ని అందించారు. ఇది గరిష్టంగా 5.3kW పవర్ ఉత్పత్తి చేస్తుంది. వెనుక చక్రం వద్ద 230Nm టార్క్ ను అందించే ఈ బైక్ కేవలం 3.9 సెకన్లలో 0-40 kmph వేగాన్ని చేరుకుంటుంది. బూస్ట్ మోడ్‌లో గరిష్ట వేగం గంటకు 90 కిలోమీటర్లు.
Also Read
- Simple Wave Electric Scooter: సింపుల్ వేవ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫుల్ ఛార్జ్‌తో 243KM రేంజ్.. ధర ఎంతంటే?
- BYD Denza India Launch: భారత్‌లోకి మరో లగ్జరీ కార్ బ్రాండ్.. లగ్జరీ కార్ల మార్కెట్లో కొత్త సంచలనం..
- Volvo XC40, EX40, EC40 Updated: వోల్వో XC40, EX40, EC40 కొత్త వెర్షన్లు.. రేంజ్, ఫీచర్లు, టెక్నాలజీ వివరాలు
- EV Two-Wheeler Sales: భారత్ ఈవీ మార్కెట్లో సంచలనం.. టాప్-5 నుంచి ఓలా ఔట్..!
160KM రేంజ్.. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
ఈ బైక్‌లో 3.24kWh సామర్థ్యం గల తొలగించగల NMC బ్యాటరీ ప్యాక్ ను అమర్చారు. కంపెనీ ప్రకారం, IDC ప్రమాణాల ప్రకారం ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే 160 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఫాస్ట్ ఛార్జర్ సాయంతో బ్యాటరీని 0 నుంచి 80 శాతం వరకు కేవలం 80 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చు. రోజువారీ ప్రయాణాలతో పాటు లాంగ్ రైడ్స్‌కు కూడా ఇది అనువుగా ఉండేలా రూపొందించారు.
స్మార్ట్ ఫీచర్లతో ఆకట్టుకునే RVX
రివోల్ట్ RVXలో 3.5 అంగుళాల IP67 రేటింగ్ కలిగిన PMVA డిస్ప్లేను అందించారు. ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ, టెలిమాటిక్స్, OTA (Over-the-Air) అప్డేట్స్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. అదనంగా ఈ బైక్‌లో బూస్ట్, స్పోర్ట్, సిటీ, ఎకో రైడింగ్ మోడ్లు, జియోఫెన్సింగ్, కాల్ & మెసేజ్ నోటిఫికేషన్లు, హిల్ హోల్డ్ అసిస్ట్, రివర్స్ మోడ్, వాక్ అసిస్ట్, ఇమ్మొబిలైజర్, వెహికల్ లొకేటర్ వంటి సౌకర్యాలను కూడా అందించారు.
సస్పెన్షన్, కలర్ ఆప్షన్లు
బైక్ ముందు భాగంలో USD ఫోర్క్స్, వెనుక భాగంలో మోనోషాక్ సస్పెన్షన్ ను ఏర్పాటు చేశారు. ఇది రైడింగ్‌ను మరింత సౌకర్యవంతంగా చేస్తుంది. RVX మూడు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది. పెర్ల్ బ్లాక్, ఎలక్ట్రిక్ బ్లూ, ఎక్లిప్స్ రెడ్.
ధర ఎంత?
Revolt RVX ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.1.30 లక్షలు. దేశవ్యాప్తంగా ఉన్న 200కు పైగా రివోల్ట్ డీలర్‌షిప్‌ల ద్వారా ఈ బైక్ విక్రయించనున్నారు. కొత్త డిజైన్, మంచి రేంజ్, ఫాస్ట్ ఛార్జింగ్, స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లతో వచ్చిన Revolt RVX, భారత ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్లో యువతకు ఆకర్షణీయమైన ఎంపికగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
- Tags
- Revolt
- Revolt RVX
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!