తెలంగాణలో టీచర్ల ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. గురువారం రాత్రి తెలంగాణ సర్కారు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నెల 26 నుంచి ఏప్రిల్ 12వ తేదీ వరకు ఆన్లైన్లో టెట్ పరీక్ష దరఖాస్తులు స్వీకరిస్తామని విద్యాశాఖ తెలిపింది. జూన్ 12న టెట్ నిర్వహించనున్నట్లు పేర్కొంది. అభ్యర్థులు నోటిఫికేషన్ కాపీని ఈ నెల 25 నుంచి tstet.cgg.gov.in వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించింది.…
భక్తుల పాలిట కల్పతరువు యాదాద్రి. బహుసుందరంగా రూపుదిద్దుకుంది. యాదాద్రి ఆలయ మహా కుంభ సంప్రోక్షణ కార్యక్రమంలో భాగంగా శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, పూర్ణాహుతి నిర్వహిస్తున్నారు. నాలుగవ రోజు ఈ కార్యక్రమాలు సాగుతున్నాయి.
వారిద్దరు ఉపాధ్యాయులే. తోటి ఉపాధ్యాయురాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆమెని బెదిరించి అత్యాచారం చేసిన ఘటన ఇది. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో కేసు వెలుగు చూసింది. నిందితుడు పరారీలో ఉన్నాడు. ఖమ్మం జిల్లాకు చెందిన ఉపాధ్యాయుదు నమ్మించి, బెదిరించి మరో ఉపాధ్యాయురాలిని మోసం చేసి అత్యాచారం చేశాడు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం అంకన్నగూడెం ప్రభుత్వ పాఠశాలలో ఎస్జీటీ టీచర్ గా పనిచేస్తున్న బానోతు కిషోర్ అదే మండలంలో మరో పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని నమ్మించి, తనతో పాటు…
తెలంగాణలో 2022-2023 విద్యా సంవత్సరానికి పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలీసెట్) నోటిఫికేషన్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. ఈ మేరకు ఏప్రిల్ రెండో వారం నుంచి పాలీసెట్ దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరించనున్నట్లు విద్యాశాఖ ప్రకటన చేసింది. జూన్ 4 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపింది. రూ.100 ఆలస్య రుసుముతో జూన్ 5 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. జూన్ 30న పాలీసెట్ ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహిస్తామని తెలిపింది. పాలీసెట్ ద్వారా పదో తరగతి పూర్తి చేసుకున్న…
రైతు పడించిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే సేకరించాలని మంత్రి జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. నల్గొండ లోని లక్ష్మీ గార్డెన్స్ లో టీఆర్ఎస్ పార్టీ నల్గొండ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన మంత్రి జగదీశ్ రెడ్డి, జెడ్పి చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆహార భద్రత చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఈ దేశములో పండే ప్రతి వరి గింజను కొనాలని ఉంది. కానీ…
పాలకులు ఏదైనా మంచి పని చేస్తే అది కొన్నేళ్ల పాటు ప్రజలకు గుర్తుండిపోవాలి. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తి చేసిన యాదాద్రి ఆలయ పునరుద్ధరణ అలాంటిదే. గుట్టపై నూతనంగా వెలసిన ఆలయ నిర్మాణాలు శాశ్వతంగా నిలిచిపోతాయి. ఈ మహాకార్యాన్ని నిజం చేసిన సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు పేరు కూడా జన హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోతుంది. ఇప్పుడు యాదాద్రి అందాలను చూస్తే మైమరచిపోకుండా ఉండలేరు. అంత రమ్యంగా తీర్చిదిద్దారు యాదగిరి నరసింహుని సన్నిధిని. ఎక్కడా రాజీ…
ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం వైఖరిపై తెలంగాణ మంత్రులు మండిపడ్డారు. మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు కేంద్రం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం క్షమాపణలు చెప్పే పరిస్థితి వస్తుంది. ఈ పరాభవాన్ని తెలంగాణ ప్రజలు మర్చిపోరు. ఏ అంశంలోనూ నవ్యత్వం లేదు. కేంద్ర ప్రభుత్వానికి వ్యాపారధోరణితో వ్యవహరించడం తప్పితే, సంక్షేమం గురించి ఆలోచించే మనసే లేదు. ముఖ్యమంత్రి ఆలోచించి తదుపరి కార్యాచరణ ఖరారు చేస్తాం. అయితే, ఏది ఏమైనా, రైతుల ప్రయోజనాలను మా ప్రభుత్వం…
కేంద్రం ఒకే దేశం ఒకే ప్రొక్యూర్మెంట్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. తెలంగాణలో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గర బియ్యపు రాసులతో మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలతో ధర్నా నిర్వహిస్తాం. దేశంలోనే అధికంగా పంటలు పండిస్తున్న రెండో రాష్ట్రం తెలంగాణ అన్నారు. ధాన్యం కొనుగోళ్లలో పంజాబ్ కో నీతి హర్యానా కో నీతి తెలంగాణకు ఒక నీతా అని ఆయన మండిపడ్డారు. పంటలను నిల్వ చేసే…
తెలంగాణలో ధాన్యం సేకరణకు సంబంధించి కేంద్రంపై టీఆర్ఎస్ పోరాటానికి దిగిన సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో తెలంగాణ మంత్రుల సమావేశం ముగిసింది. అరగంటపాటు సాగింది ఈ సమావేశం. పంజాబ్ నుంచి ఏ తరహాలో అయితే బియ్యాన్ని కేంద్రం సేకరిస్తుందో, తెలంగాణ నుంచి కూడా అదే తరహాలో బియ్యాన్ని సేకరిస్తుంది. ఏ రాష్ట్రం పట్ల కేంద్రం ఎలాంటి వివక్షతతో వ్యవహరించదన్నారు కేంద్ర ఆహారశాఖ మంత్రి పీయూష్ గోయల్. తెలంగాణ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం.…
బీజేపీ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది నాంపల్లి కోర్టు.. గతంలో టీఆర్ఎస్ ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లను చించివేయడం.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ని దుర్బాషలాడిన కేసు విచారణ చేపట్టిన ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం.. ఈ కేసులో ఎంపీ అర్వింద్ విచారణకు హాజరుకాని కారణంగా నాన్‌బెయిల్‌బుల్ వారెంట్ ఇష్యూ చేసింది.. Read Also: KCR: కొల్హాపూర్‌లో కేసీఆర్ దంపతులు.. శ్రీ మహాలక్ష్మీకి ప్రత్యేక పూజలు కేసుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..…