Tirumala: భక్తులతో కళకళ… శ్రీవారి హుండీ గలగల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కలియుగ వైకుంఠం తిరుమలకు వస్తున్న భక్తుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. తిరుమల శ్రీవారి హుండి గలగలలాడుతోంది. కోవిడ్ కారణంగా ఏడాదిగా తగ్గిన స్వామి వారి ఆదాయం… అంచనాలకు మించి పెరుగుతోంది. ఈ మాసంలో ఇప్పటికే 90 కోట్లు దాటగా… నెలాఖరుకు వందకోట్లు అవుతుందని ఆంచనా వేస్తున్నారు. కరోనా మహమ్మారి పుణ్యమాని 2020లో హుండీ ఆదాయం రూ.700 కోట్లే. కానీ 2021లో హుండీ ఆదాయం రూ.900 కోట్లకు పెరగడంతో టీటీడీ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో రూ.128 కోట్ల ఆదాయం వచ్చింది. ఏప్రిల్‌లో ఇప్పటివరకూ 100 కోట్లకు పైగానే హుండీ ఆదాయం లభించింది.
అఖిలాండ కోటి బ్రహ్మండనాయకుడైన శ్రీవారి దర్శనార్దం వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంటే స్వామి హుండీ ఆదాయం కూడా పెరుగుతూ వస్తోంది. కోవిడ్ తీవ్రత తగ్గడంతో ఏడు కొండలకు భక్తులు పోటెత్తుతున్నారు. 2020 వరకు పెరుగుతూ వచ్చిన ఆదాయం… ఆ తర్వాత కరోనా కారణంగా తగ్గిపోయింది. 80 రోజులు పాటు దర్శనాలు నిలివేశాక… తర్వాత కూడా పరిమితంగానే భక్తుల్ని అనుమతించారు. దీనివల్ల 2020 సంవత్సరానికి 13 వందల కోట్ల వరకు హుండీ ఆదాయం వస్తుందని అనుకుంటే…, ఏడువందల కోట్ల వరకు తగ్గిపోయింది. 2021లో కూడా 900 కోట్లు మాత్రమే వచ్చింది.
Also Read
- Rain Alert: కొనసాగుతోన్న అల్పపీడనం.. రాబోయే 24 గంటల్లో ఆ 13 జిల్లాలో వర్షాలు!
- TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
- YS Jagan: డీఎస్సీ అక్రమాలపై సీఎం చంద్రబాబుకు జగన్ ప్రశ్నలు.. 1-6 ట్విస్ట్‌లతో ఎక్స్‌లో పోస్టులు!
- Ganesh Idol Protest: 'వినాయకుడి'తో వినూత్న నిరసన.. దేవుడికి ఈ తిప్పలు తప్పలేదా..?
కోవిడ్ తీవ్రత తగ్గడంతో శ్రీవారి భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగింది. సాధారణంగా ఒక రోజుకు శ్రీవారికి 3 కోట్లు వరకు హుండీ ఆదాయం వస్తుంది. గత మార్చిలో 128 కోట్ల రూపాయల కానుకలు వచ్చాయి. ఇక ఏప్రిల్ మాసంలో కూడా 21 రోజులకు 90 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ నెల చివరి నాటికి 120 కోట్ల వరకు హుండీ ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. మొత్తానికి గతంలో మాదిరిగా శ్రీవారి పై కాసుల వర్షం కురుస్తుండడంపై టీటీడీ సంతోషం వ్యక్తం చేస్తోంది.
తిరుమలకు గతంతో పోలిస్గే భక్తుల రద్దీ తగ్గింది. 3 కంపార్టుమెంట్లలో వేచివున్నారు భక్తులు. సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ఆదివారం శ్రీవారిని దర్శించుకున్నారు 67,437 మంది భక్తులు. తలనీలాలు సమర్పించిన వారు 29,440 మంది భక్తులు. హుండీ ఆదాయం రూ.4.28 కోట్లుగా టీటీడీ పేర్కొంది. సరాసరిన ఈ మధ్యకాలంలో 4 కోట్లకు పైనే ప్రతిరోజూ ఆదాయం లభిస్తోంది.
Read Also: Vemulawada Temple: నిండిన హుండీ.. పట్టించుకునేవారేరి?
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!