గతంతో పోలిస్తే ఎండాకాలం చుర్రుమనిపిస్తోంది. సమ్మర్ ఎఫెక్ట్ తో తెలంగాణలో జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లో మండుతున్న ఎండలతో ప్రాణాలు పోతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రం లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు జిల్లాలో నమోదు కావడం విశేషం. ఆదిలాబాద్ జిల్లా చెప్రాలలో 43.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయిందంటే ఎండల తీవ్రత ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. వడదెబ్బకు గురై మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో వడదెబ్బతో ఇద్దరు…
★ నేడు విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద 500 వైఎస్ఆర్ తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను ప్రారంభించనున్న సీఎం జగన్★ ఏపీలో పెరిగిన టోల్‌ప్లాజా రేట్లు.. నేటి నుంచి అమలు★ పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ నేడు ఏపీలోని అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద బీజేపీ, జనసేన ఆధ్వర్యంలో నిరసనలు, ధర్నాలు★ తిరుమల: నేటి నుంచి ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతి, రేపు శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం★ ప్రకాశం: మార్కాపురాన్ని ప్రత్యేక జిల్లాగా చేయాలంటూ నేడు…
తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతల దృష్ట్యా ఒంటిపూట బడుల సమయాన్ని కుదించింది ప్రభుత్వం.. ఉదయం 8 గంటల నుంచి 11.30 వరకే పాఠశాలలు పనిచేస్తున్నాయి.. ఇక, ఒకటో తరగతి నుండి 9వ తరగతి వరకు ఫైనల్ పరీక్షల తేదీలను రీషెడ్యూల్ చేసింది విద్యాశాఖ… గతంలో నిర్ణయించిన ప్రకారం.. ఏప్రిల్ 7వ నుండి కాకుండా.. ఏప్రిల్ 16వ తేదీ నుండి ప్రారంభమై ఏప్రిల్ 22వ తేదీ వరకు నిర్వహించనున్నారు.. ఇక, ఏప్రిల్ 23వ తేదీన ఫలితాలు వెల్లడించాల్సి ఉంటుంది.. అదే…
సిద్దిపేట జిల్లా మిర్దొడ్డిలో ఇవాళ ఉద్రిక్తత నెలకొంది.. తనకు సరైన భద్రత కల్పించడం లేదంటూ పీఎస్ లో దీక్షకు దిగారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు.. దీంతో.. ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం బెజ్జంకి పీఎస్‌కు తరలించారు. ఈసందర్భంగా పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు అడ్డుపడటంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.. అయితే, రఘునందన్ రావును బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. సిద్దిపేట సీపీకి ఫోన్ చేసిన ఆయన.. కొందరు…
సమయం ఏదైనా.. సందర్భం ఏదైనా.. చుక్కా, ముక్కా ఉండాల్సిందే.. అదే మందు.. మటనో.. చికెన్ ఉండాల్సిందే.. ఇదే ఇప్పుడు కొత్త రికార్డులు సృష్టిస్తూ మద్యం అమ్మకాలు జరిగేలా చేసింది.. 2021-22 ఏడాదిలో తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు సాగాయి.. ఈ ఆర్థిక సంవత్సరంలో మద్యం డిపోల నుండి రూ.30,711 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి.. ఈరోజు ఒక్క రోజే రూ.235 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయని అధికారులు వెల్లడించారు.. మొత్తంగా ఇవాళ్టితో…
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఐసీయూలో రోగిని ఎలుకలు కొరికిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు వైద్యులపై సస్పెన్షన్ వేటు వేసింది. అంతేకాకుండా ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావును కూడా బాధ్యుడిగా గుర్తించింది. ఆయనపై బదిలీ వేటు వేసింది. ఎంజీఎం సూపరింటెండెంట్‌గా శ్రీనివాసరావు స్థానంలో చంద్రశేఖర్‌కు పూర్తి బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా రోగిని ఎలుకలు కొరికిన ఘటనపై పూర్తి వివరాలు తక్షణమే నివేదిక పంపించాలని…
తెలంగాణలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం కొత్త రికార్డులు సృష్టించింది… ఈ ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం వచ్చినట్టు గణాంకాలు వెల్లడించారు అధికారులు.. ఒక్క మార్చి నెలలోనే రూ.1,501 కోట్ల ఆదాయం రాగా… ఈ ఆర్థిక సంవత్సరంలో (2021-22) మొత్తంగా రూ. 12,364 కోట్ల ఆదాయం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ప్రభుత్వ ఖజానాకు చేరింది.. ఇక, గత ఏడాదితో పోలిస్తే ఇది చాలా ఎక్కువ.. ఎందుకంటే.. గత…
తెలంగాణ ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత… వినూత్న తరహాలో ప్రయాణికులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.. నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీని లాభాల బాట పట్టించే పనిలో పడిపోయారు సజ్జనార్.. ఇక, ఏ పండుగ వచ్చినా..? ఏ ప్రత్యేక ఉన్నా..? ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ఆఫర్లు తీసుకున్నారు.. తాజాగా మరో ఆఫర్ తీసుకొచ్చింది టీఎస్ఆర్టీసీ… ఉగాది పండుగ సందర్భంగా 65 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం తీసుకొచ్చింది.. Read…
పోలీసులు ఎంత నిఘా పెట్టిన గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ దందా సాగుతూనే ఉంది.. ఇతర రాష్ట్రాలకు చెందినవారు.. విదేశాల నుంచి వచ్చిన వారు డ్రగ్స్‌తో సహా దొరికిపోయిన ఘటనలు అనేకం.. ఇక, డ్రగ్స్ కేసుల్లో ప్రముఖులను విచారించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే, హైదరాబాద్‌లో ఓ యువకుడు డ్రగ్స్‌తో మృతిచెందడం కలకలం సృష్టిస్తోంది.. గోవా వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన బీటెక్ విద్యార్థి.. డ్రగ్స్ తీసుకున్నాడు… అలా డ్రగ్స్ కు అలవాటు పడిన సదరు విద్యార్థి ముందుగా అస్వస్థతకు…
మార్చిలోనే ఎండలు దంచికొడుతున్నాయి… రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతూ మంట పుట్టిస్తున్నాయి… ఓవైపు ఎండల తీవ్రత.. మరోవైపు వడగాల్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.. దీంతో ఈ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కీలక సూచనలు చేసింది.. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, మంచిర్యాల జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిందని వెల్లడించారు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ రావు. ఆ జిల్లాలతో పాటు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, హైదరాబాద్‌లో 40…