నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండలం తుర్కల పల్లి సమీపంలో పండుగ పూట ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి కల్వర్టుకు ఢీకొనడంతో నలుగురి మృతి చెందారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు మహిళలు వున్నారు. వీరంతా నల్గొండ జిల్లా నేరేడుచర్లకు చెందిన వారుగా గుర్తించారు. నలుగురు మృతి చెందడంతో వారి కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతులంతా సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల వాసులుగా గుర్తించారు. ఐదుగురు కడప నుంచి తిరిగి వస్తుండగా మార్గమధ్యంలోనే కారు…
తెలంగాణలో సంచలనం కలిగించిన డ్రగ్స్ మరణం కేసుకి సంబంధించి నార్కోటిక్స్ ఎన్ ఫోర్స్ మెంట్ వింగ్ కీలక దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో వెలుగు చూస్తున్న అంశాలు అధికారులనే విస్మయానికి గురిచేస్తున్నాయి. తొలి డ్రగ్స్ మరణానికి సంబంధించిన కేసులో లక్ష్మీపతి కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. లక్ష్మీపతి కోసం మూడు నార్కోటిక్ ఎన్ ఫోర్స్ మెంట్ వింగ్ ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. గోవా, అరకు, విశాఖ, తణుకులో లక్ష్మి పతి తలదాచుకున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబీకులతో…
★ నేడు శుభకృత్ నామ ఉగాది పర్వదినం ★ అమరావతి: నేడు తాడేపల్లి క్యాంప్ కార్యాలయం సమీపంలో ఉగాది వేడుకల్లో సతీసమేతంగా పాల్గొననున్న సీఎం జగన్.. ఉ.10:30 గంటలకు పంచాంగ శ్రవణం ★ తిరుమల: నేడు శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం.. నేటి నుంచి అంగప్రదక్షిణం భక్తులకు టోకెన్లు జారీ చేయనున్న టీటీడీ ★ హైదరాబాద్: నేడు ఉదయం 10:30 గంటలకు ప్రగతి భవన్ జనహితలో ఉగాది వేడుకలు.. హాజరుకానున్న సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు…
తెలంగాణ సీఎం కేసీఆర్-గవర్నర్ తమిళిసై మధ్య గ్యాప్ క్రమంగా పెరుగిపోతోందనే వార్తలు వస్తున్నాయి.. గవర్నర్ ప్రసంగంలేకుండానే అసెంబ్లీ బడ్జెట్ సెషన్ ప్రారంభం కావడంపై పలు విమర్శలు వచ్చాయి.. అయితే, ఇవాళ రాజ్‌భవన్ వేదికగా జరిగిన ఉగాది వేడుకల్లో సీఎం కేసీఆర్‌పై పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేశారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. రాజ్ భవన్లో గవర్నర్ నిర్వహించిన ఉగాది ఉత్సవాలకు.. సీఎం కేసీఆర్ సహా టీఆర్ఎస్ నేతలు దూరంగా ఉన్నారు.. ఇక, వివిధ పార్టీలకు చెందిన నేతలు, రాష్ట్ర…
తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.. పేరుతోనే శుభాలను మోసుకొస్తున్న ‘శుభకృత్’నామ సంవత్సరం, ప్రజలకు అన్ని రంగాల్లో శుభాలను చేకూర్చనున్నదని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వ కృషి, దైవకృపతో పుష్కలమైన నీరు, పచ్చని పంటపొలాలతో తెలంగాణ అలరారుతున్నదని ఆనందం వ్యక్తం చేసిన సీఎం.. తెలంగాణ ప్రజలకు ఉగాది నుండే నూతన సంవత్సరం ఆరంభమవుతుందని, తమ వ్యవసాయ పనులను రైతన్నలు ఉగాది నుండే ప్రారంభించుకుంటారని పేర్కొన్నారు.. తెలంగాణ ప్రభుత్వం సాగునీరు, వ్యవసాయ…
మోస్ట్ వాంటెడ్ ఘరానా దొంగను అరెస్ట్ చేశారు రాచకొండ పోలీసులు… హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో 43 ప్రాంతాల్లో చోరీకి పాల్పడినట్టు గుర్తించారు.. అతడే ముచ్చు అంబేద్కర్ అలియాస్ రాజు… అతడి వద్ద నుంచి కోటి 30 లక్షల విలువచేసే 230 తులాల బంగారు ఆభరణాలు, 10 కిలోల వెండి ఆభరణాలు, 18 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.. అయితే, ఏ రంగంలో రాణించాలన్నా కొన్ని మెలుకువలు అవసరం.. ఇక్కడ మన దొంగ గారి తెలివితేటలు…
మా పేర్లు శిలా ఫలకాలపై అవసరం లేదు.. ప్రజల మనుసుల్లో ఉన్నామని ధీమా వ్యక్తం చేశారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు.. నిన్న కొన్ని నాటకీయ పరిణామాలతో ఆయన అరెస్ట్ అయిన విషయం తెలిసిందే కాగా.. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. పోలీసులు టీఆర్ఎస్కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.. ఎమ్మెల్యే హోదాలో పర్యటిస్తే.. టీఆర్ఎస్ నేతలు అడ్డుకుంటే పోలీసులు చోద్యం చూశారని మండిపడ్డ ఆయన.. క్రిమినల్ బ్యాగ్రౌండ్ ఉన్న వారు నాపై భౌతికదాడులు చేసేందుకు యత్నించారని.. అదనపు…
డ్రగ్స్ కి బానిసలవుతున్న విద్యార్ధుల్ని ఆ మురికికూపం నుంచి బయటపడేసేందుకు పోలీసులు కఠినచర్యలకు దిగుతున్నారు. హైదరాబాద్ లో డ్రగ్స్ కు బానిసై ప్రాణాలు కోల్పోయిన బీటెక్ విద్యార్థి మరణంలో అనేక సంచలన విషయాలు బయటపడుతున్నాయి. నల్లకుంట పోలీస్ ల అదుపులో ముగ్గురు డ్రగ్స్ వాడుతున్న వ్యక్తులు వున్నారని తెలుస్తోంది. సాప్ట్ వేర్ ఉద్యోగి రామకృష్ణ, గిటార్ టీచర్ నిఖిల్ జాషువా , బీటెక్ విద్యార్థి జీవన్ రెడ్డి లను కోర్టులో హాజరు పరుచనున్నారు పోలీసులు. పరారీలో ఉన్న…
మత్తుమందులకు వున్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఒకసారి దానికి అలవాటు పడితే అది యువతను వదలదు. ఈమధ్యకాలంలో యువత మత్తుకి బానిసలై తమ కెరీర్ నాశనం చేసుకుంటున్నారు. హైదరాబాద్ లో గల్లీకో ముఠా తయారై డ్రగ్స్ అమ్మేస్తోంది. జూబ్లీహిల్స్ పరిధిలో డ్రగ్స్ తయారు చేసి, విక్రయిస్తూ పట్టుబడ్డాడు శ్రీరామ్ అనే యువకుడు. ఇంటినే ల్యాబ్ లా మార్చాడా యువకుడు. సూర్యాపేట జిల్లా కు చెందిన యువకుడు శ్రీరామ్ ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చాడు. చెడు వ్యసనాలకు…
ఉగాది పండగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి మొత్తం ఐదు ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. సికింద్రాబాద్-తిరుపతి, మచిలీపట్నం-తిరుపతి, కాకినాడ-తిరుపతి, కాకినాడ-వికారాబాద్, తిరుపతి-మచిలీపట్నం మధ్య ఈ రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. ప్రత్యేక రైళ్ల వివరాలు: ★ సికింద్రాబాద్-తిరుపతి (రైలు నం: 07597) రైలు ఏప్రిల్ 1న రాత్రి 8:15 గంటలకు బయలుదేరుతుంది ★ మచిలీపట్నం-తిరుపతి (రైలు నం: 07095)…