జాబ్ స్పేస్ యాప్ ద్వారా ఎక్కడ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా మెసేజ్ ద్వారా తెలిసిపోతుందని తెలిపారు మంత్రి హరీష్‌రావు.. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో పోటీ పరీక్షల ఉద్యోగార్థులకు ఉచిత భోజనం కార్యక్రమం, స్టడీ మెటీరియల్ ప్రారంభించిన మంత్రి హరీష్ రావు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భవిష్యత్‌లో ప్రతి సంవత్సరం ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తామని తెలిపారు.. గ్రూప్ వన్, గ్రూప్ 2లో ఇంటర్వ్యూ లేకుండా వ్రాత పరీక్షల ద్వారా పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తామన్న ఆయన.. 500పైగా గ్రూప్ వన్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. ఇక, గ్రూప్ వన్‌లో కూడా 95శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇస్తాం, ఈ ఘనత సీఎం కేసీఆర్‌దేనని ప్రశంసించారు హరీష్‌రావు.
Read Also: CM Jagan: ప్రకృతి వ్యవసాయం కోసం కేంద్రం 90:10 నిష్పత్తిలో నిధులివ్వాలి
317జీవో తెచ్చి అన్ని జిల్లాల ఉద్యోగులకు న్యాయం చేస్తున్నాం, దీనిపై ప్రతిపక్షాలు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు హరీష్‌రావు.. 317జీవో పై సారాంశం తెలవకుండ బండి సంజయ్ ఎందుకు దీక్ష చేపట్టారు? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు దున్నపోతు ఈనిందటే దుడ్డెను కట్టేయన్నట్లు ఉన్నాయంటూ సెటైర్లు వేశారు. ఇక, కేంద్రం 15 లక్షల 65 వేల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తుందో బండి సంజయ్ తెలపాలి? అని డిమాండ్ చేశారు హరీష్‌రావు.. మూడు లక్షల ఉద్యోగాలు రైల్వేలో ఖాళీగా ఉన్నాయి.. బీజేపీ నేతలను ప్రశ్నిస్తే సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ఉద్యోగాలు ఇస్తామంటే మీకే పాలాభిషేకం చేస్తామన్న ఆయన.. తెలంగాణ.. దేశంలో అన్ని రంగాల్లో అగ్రామిగా ఉన్నది.. కానీ, బీజేపీ నేతలు నోరు పారేసుకొనడం తప్ప అసలు విషయం మాట్లాడారని ఎద్దేవా చేశారు. బీజేపీ డబుల్ ఇంజన్ గ్రోత్ ఎక్కడకి పోయింది…? అని నిలదీశారు హరీష్‌రావు.. ఎక్కడ కూడా అభివృద్ధి లేదు, యువత ఆలోచించాలని సూచించారు.. బీజేపీ నేతలకు దమ్ముంటే తెలంగాణకు రావాల్సిన 23 నవోదయ స్కూళ్లను తేవాలని సవాల్ చేశారు.