ప్రతీ జిల్లాలో వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలని యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని.. మొత్తం జిల్లా పాలనా యంత్రాంగాన్ని ధాన్యం కొనుగోలులో నిమగ్నం చేయాలని ఆదేశాలు జారీ చేశారు తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్.. రైతుల నుండి ధాన్యం మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్…
తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు కేఏ పాల్.. ఇవాళ రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసైని కలిసిన ఆయన.. వివిధ అంశాలపై చర్చించారు.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌పై మండిప్డడారు.. కేసీఆర్ అంత అవినీతి పాలన ఇప్పటి వరకు చూడలేదన్న ఆయన.. కేసీఆర్ అరెస్ట్ అవ్వడం ఖాయం అని జోస్యం చెప్పారు.. ఏడేళ్లలో 8 లక్షల కోట్ల సొమ్ము ఏమైందో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు.. ప్రజాశాంతి పార్టీ తరపున…
మరో 12 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి… కాంగ్రెస్ నేతలతో కలిసి వెళ్లి రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసైని కలిసిన ఆయన.. సమస్యలు, ప్రభుత్వ నిర్లక్ష వైఖరిపై ఫిర్యాదు చేశారు.. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. తాజా పరిస్థితులపై గవర్నర్ కు నివేదిక ఇచ్చామన్నారు.. రైతుల గుండెలు ఆగిపోతుంటే కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదని.. కొనుగోలు కేంద్రాలు తెరవడం ఆలస్యం వల్ల 30శాతం పంట దళారుల చేతుల్లోకి వెళ్లిపోయిందని మండిపడ్డారు..…
ఈ ఏడాది డిసెంబర్‌కి హైదరాబాద్‌లో 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం పనులు పూర్తి అవుతాయని తెలిపారు తెలంగాణ మంత్రి కేటీఆర్… ట్యాంక్ బండ్ దగ్గర నిర్మిస్తున్న 125 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహ పనులను మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలతో కలిసి పరిశీలించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పరి రక్షణ కోసం పాటు పడే వారికి అంబేద్కర్ ఆదర్శం అన్నారు.. ప్రపంచంలో అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహం హైదరాబాద్‌లో నిర్మాణం అవుతుంది.. ఎనిమిది…
ప్రతీ గింజను కొనాల్సింది సీఎం కేసీఆరేనని డిమాండ్ చేశారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. దాన్యం కొనుగోళ్ల విషయంలో కేసీఆర్‌వి డ్రామాలు అని మండిపడ్డారు.. ఇప్పటికే 50 శాతం ధాన్యం రైతులు అమ్ముకున్నారని.. మిల్లర్లకు అమ్మిన రైతులకు కూడా మద్దతు ధర ఇవ్వాలని సూచించారు.. గవర్నర్‌తో భేటీకి ముందు ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. గవర్నర్ దృష్టికి అన్ని సమస్యలు తీసుకెళ్తాం అన్నారు.. ప్రభుత్వంపై భారం మూడు వేల కోట్ల అని మేం మొదటి నుండి చెబుతున్నాం.. అయినా…
వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై నమోదైన కేసుల్లో ఇవాళ తుది తీర్పు వెల్లడించనుంది నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం.. ద్వేషపూరిత ప్రసంగానికి సంబంధించిన 2012 కేసుల్లో తీర్పు వెల్లడించనుంది.. కాగా, పదేళ్ల క్రితం నిర్మల్, నిజామాబాద్ జిల్లాలో అక్బరుద్దీన్ మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించారంటూ కేసు నమోదు చేశారు.. ఇక, ఈ కేసులో నాంపల్లిలోని ప్రజా ప్రతినిధుల కోర్టు విచారణ ముగించింది.. ఈ కేసులో 30 మందికిపైగా సాక్షులను విచారించింది కోర్టు.. అదే విధంగా ఆ…
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న రైతు సమస్యలపై గవర్నర్‌ని కలిసి వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించింది కాంగ్రెస్. ఇవాళ ఉదయం రాజభవన్లో గవర్నర్ తమిళ సైతో సమావేశం కానున్నారు. దానికి ముందు… కాంగ్రెస్ నాయకులు సీఎల్పీ వద్ద సమావేశమై గవర్నర్ కార్యాలయానికి బయలుదేరుతారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నేతృత్వంలో 28 మంది సభ్యుల బృందం గవర్నర్ తో భేటీ అవుతారు. రాష్ట్రంలో మద్దతు ధరలకు ధాన్యం కొనుగోలు చేయాలని కోరనుంది కాంగ్రెస్ పార్టీ. Read Also: Ukraine…
సాధారణంగా భార్యను భర్తలు హత్య చేసిన ఘటనలు ఎక్కువగా చూస్తుంటాం.. కానీ, పరిస్థితులు మారిపోయాయి.. భార్తలే భర్తలను దారుణంగా హత్య చేసిన ఘటనలు కూడా వెలుగు చూస్తున్నాయి.. జనగామ జిల్లాలో భర్తను దారుణంగా చంపింది భార్య. తండ్రి, మైనర్ కొడుకుతో కలిసి భర్త కళ్లల్లో కారం కొట్టి కత్తితో దాడిచేసింది. ఈ ఘటనలో భర్త అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. హైదరాబాద్‌లోని పార్షిగుట్టకు చెందిన హనుమాండ్ల వినోద్, జనగామలోని అంబేద్కర్ నగర్లో నివాసముంటున్న మంజులను రెండేళ్ల క్రితం రెండో…
గోదావరి ఉప నది ప్రాణహిత పుష్కరాలు ఇవాళ మొదలు కానున్నాయి. మీనరాశిలోకి బృహస్పతి ప్రవేశించినప్పుడు ప్రాణహిత నదికి పుష్కరం రానుంది. చైత్రశుద్ధ ద్వాదశి నుంచి చైత్రశుద్ధ బహుళ అష్టమి అంటే ఈ నెల 24 వరకు 12 రోజుల పాటు ప్రాణహిత పుష్కరాలు జరగనున్నాయి. కాళేశ్వరం వేదపండితులు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ఇవాళ మధ్యాహ్నం 3.54 గంటలకు పుష్కరాలు ప్రారంభంకానున్నాయి. కొమురంభీం జిల్లా కౌటాల, మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అర్జునగుట్ట, వేమనపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా…
* ఐపీఎల్లో నేడు ముంబైతో తలపడనున్న పంజాబ్.. పుణె వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ * హైదరాబాద్‌లో ఇవాళ బంగారం ధరలు.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49 వేలు, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,450, కిలో వెండి ధర రూ.72,700 * నేడు అక్బరుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యల కేసులో నేడు నాంపల్లి కోర్టు తీర్పు. * ఏపీ: కృష్ణా జిల్లాలో గవర్నర్ బిశ్వభూషణ్ పర్యటన.. పెనమలూకు నియోజకవర్గం…