తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం.. ఇప్పటికే రాహుల్ గాంధీ రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు.. అంతా ఒక కుటుంబంగా.. ఒక్కటిగా ముందుకు సాగాలని.. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.. దీంతో.. కలసి కట్టుగా నడుస్తున్నారు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు.. ఇటీవల జరిగిన పార్టీ ఆందోళన కార్యక్రమాల్లో ఒక్కటిగా కనిపించారు. మరోవైపు.. కాంగ్రెస్ శ్రేణుల్లో మరింత జోష్ నింపేందుకు…
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ విజయసాయిరెడ్డిపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు సినీ నిర్మాత బండ్ల గణేష్.. కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టిన ఆయన.. వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు.. మీకు కులం నచ్చకుంటే, కమ్మ వాళ్లు నచ్చకుంటే నేరుగా తిట్టoడి. కానీ, చంద్రబాబును టీడీపీని అడ్డం పెట్టుకొని కమ్మవారిని తిట్టకండి అని సలహా ఇచ్చారు. అధికారం శాశ్వతం కాదు, రేపు నువ్వు తప్పకుండా మాజీ అవుతావు అని…
తెలుగు రాష్ట్రాల్లో చిరుజల్లులు పడుతున్నాయి. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. నగరంపై ఆకాశం మేఘావృతమై ఉంది. ఓ మోస్తరు వర్షం కురవడంతో సిటీ వెదర్ ఒక్కసారిగా చల్లబడింది. దాంతో ఉక్కపోత నుంచి నగరవాసులకు ఉపశమనం లభించింది. మరోవైపు నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తెలంగాణలో ఏప్రిల్ 18 వరకూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.…
హైదరాబాద్లో హనుమాన్ శోభాయాత్రకు అంతా రెడీ అయింది. హనుమాన్ జయంతి సందర్భంగా… ఇవాళ హైదరాబాద్లో భారీఎత్తున శోభాయాత్ర నిర్వహించనున్నారు. ఉదయం 11.30 గంటలకు గౌలిగూడలోని రామాలయం నుంచి ప్రధాన శోభాయాత్ర ప్రారంభం కానుంది. సికింద్రాబాద్ తాడ్ బండ్ లో ఉన్న హనుమాన్ ఆలయం దగ్గర శోభాయాత్ర ముగుస్తుంది. మొత్తం 12 కిలోమీటర్లు శోభాయాత్ర సాగనుంది. అలాగే కర్మాన్ ఘాట్ హనుమాన్ ఆలయం నుంచి మరో శోభాయాత్ర ప్రారంభమై కోఠిలోని ఆంధ్రా బ్యాంక్ దగ్గర ప్రధాన శోభాయాత్రలో కలవలనుంది..…
* నేడు గుజరాత్లో 108 అడుగుల హనుమాన్ విగ్రహావిష్కరణ, ఉదయం 11 గంటలకు వర్చువల్గా ప్రారంభించనున్న ప్రధాని మోడీ * నేడు సీఎం జగన్ కర్నూలు పర్యటన, వైసీపీ నేత ప్రదీప్ రెడ్డి కుమారుని పెళ్లి వేడుకల్లో పాల్గొననున్న సీఎం జగన్ * తిరుపతి: నేడు ఎస్వీ యూనివర్సిటీలో జాబ్ మేళా.. నేటి నుంచి రెండు రోజుల పాటు జాబ్ మేళా, పాల్గొననున్న 137 కంపెనీలు, ఇప్పటి వరకు 1.34 లక్షల మంది రిజిస్ట్రేషన్ * నేడు…
తెలంగాణ హైకోర్టులో బార్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిగా హాజరయ్యారు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.సమావేశంలో హైకోర్టు చీఫ్ జస్టీస్ సతీష్ చంద్ర శర్మ, హైకోర్టు న్యాయమూర్తులు, బార్ కౌన్సిల్ సభ్యులు, బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ తెలంగాణ న్యాయవాదులు, బార్ కౌన్సిల్ సభ్యులు తనకి సన్మానం చేయడం చాలా అనందంగా ఉందన్నారు. ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డే. ఎక్కడ…
తెలంగాణలో బీజేపీ-టీఆర్ఎస్ వార్ నడుస్తోంది. కృష్ణా పుష్కరాల సమయంలో జోగులాంబ ఆలయాన్ని కేసీఆర్ సందర్శించి… అభివృద్ధి చేస్తామని ప్రకటించారు మరిచిపోయారా అని ప్రశ్నించారు బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. జోగులాంబ ఆలయం ఇప్పటి వరకు ఎందుకు అభివృద్ధి చేయలేదో సమాధానం చెప్పాలన్నారు. Read Also: Dr K.Lakshman: మోకాళ్ళ యాత్ర చేసినా జనం నమ్మరు ఒకనాడు మహబూబ్ నగర్ ఎంపీగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్న జిల్లా ప్రజలకు కన్నీరే మిగిల్చారు. బండి సంజయ్…
బండి సంజయ్ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో అధికార టీఆర్ఎస్ ఓర్వలేక పోతుందన్నారు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.కె. లక్ష్మణ్. ప్రజా సంగ్రామ యాత్ర ప్రగతిభవన్ లో ప్రకంపనలు సృష్టిస్తుందన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు మోకాళ్ళ యాత్ర చేసిన ప్రజలు నమ్మే పరిస్థితి లేరన్నారు లక్ష్మణ్. వెనుకబడిన పాలమూరు ప్రజలను టీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వం దగా చేసిందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా 24గంటల ఉచిత విద్యుత్ తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్నామని తెరాస నేతలు పదే పదే…
తెలంగాణలో సూరీడు చుర్రుమంటున్నాడు. సాధారణంగా ఏప్రిల్ మొదటి వారం నుంచి ఎండ వేడిమి పెరుగుతుంది. కానీ ఈసారి ఒక నెలముందుగానే ఎండలు పెరిగిపోయాయి. దీంతో బయటకు రావాలంటేనే జనం హడలిపోతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఎండలు మండుతున్నాయి. రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఇక్కడే నమోదవుతున్నాయి. కొమురం భీం జిల్లా కెరమెరిలో 43.9 గా గరిష్ణ ఉష్ణోగ్రతలు నమోదు కాగా వాంకిడిలో 43.8 గా నమోదు అయ్యాయి. అలాగే ఆదిలాబాద్ జిల్లా…
ఒకవైపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో దిక్కుతోచకుండా వున్న ప్రయాణికులపై మరో భారం మోపింది తెలంగాణ ఆర్టీసీ సంస్థ. ఒకటికాదు ఏకంగా రెండుసార్లు టికెట్ ఛార్జీలు పెంచిన ఆర్టీసీ బస్ పాస్ ధరలను కూడా బాగా సవరించింది. దీంతో 30 శాతం వరకూ బస్ పాస్ ఛార్జీలు పెరిగాయి. తాజాగా ప్రయాణికులపై తెలంగాణ ఆర్టీసీ పిడుగు వేసింది. రిజర్వేషన్ ఛార్జీలు పెంచేసింది. పెంచిన రిజర్వేషన్ ఛార్జీలపై ఇప్పటి వరకు అధికార ప్రకటన చేయలేదు ఆర్టీసీ. గుట్టుచప్పుడు కాకుండా…