వరి కొనుగోళ్ల విషయంలో కేంద్రంపై యుద్ధం ప్రకటించిన టీఆర్ఎస్ సర్కార్.. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఆందోళనలు చేస్తోంది.. ఇప్పటికే వివిధ రూపాల్లో గ్రామస్థాయి నుంచి నిరసన కార్యక్రమాలు నిర్వహించిన ఆ పార్టీ ఇప్పుడు.. హస్తిన వేదికగా ఢిల్లీపై యుద్ధం ప్రకటించింది.. తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ నిరసన దీక్ష చేపట్టారు.. వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని.. వన్ నేషన్ – వన్ ప్రొక్యూర్మెంట్ పాలసీ ఉండాలని డిమాండ్ చేస్తున్నారు.. ఇక, ఈ దీక్షలో పాల్గొన్న…
తెలంగాణలో వరి కొనుగోళ్ల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.. గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటానికి తీసుకెళ్లింది టీఆర్ఎస్ పార్టీ.. ఇవాళ ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా సీఎం కేసీఆర్ దీక్ష చేయబోతున్నారు.. వరి కొనుగోళ్లపై కేంద్రం వైఖరికి నిరసనగా దీక్షకు సిద్ధమయ్యారు.. ఇదే సమయంలో.. హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ దగ్గర బీజేపీ రైతు దీక్ష చేస్తోంది.. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని డిమాండ్ చేస్తోంది.. అయితే, బీజేపీ, టీఆర్ఎస్…
వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మధ్య యుద్ధం నడుస్తూనే ఉంది.. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా వివిధ స్థాయిల్లో.. వివిధ రూపాల్లో ఆందోళన చేసిన అధికార టీఆర్ఎస్ పార్టీ.. ఇప్పుడు హస్తిన వేదికగా ఆందోళనకు సిద్ధం అయ్యింది.. టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్ వేదికగా నిరసన దీక్ష చేపట్టబోతున్నారు.. కేంద్రం ధాన్యం కొనాలంటూ ఢిల్లీలో నిరసన దీక్షకు దిగుతోంది టీఆర్ఎస్ పార్టీ… ధాన్యం సేకరణ కోసం దేశ వ్యాప్తంగా…
* నేడు ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్ వర్చువల్ భేటీ, కోవిడ్, ఇండో-పసిఫిక్, క్వాడ్, ద్వైపాక్షిక అంశాలపై చర్చ * ఐపీఎల్లో నేడు హైదరాబాద్‌తో తలపడనున్న గుజరాత్.. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ * నేడు తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీరామ పట్టాభిషేకం.. రేపటి నుంచి సర్వదర్శన టోకెన్లు జారీని పునఃప్రారంభించనున్న టీటీడీ * నేడు ఏపీలో కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం.. ఉదయం 11.31 గంటలకు మంత్రులతో ప్రమాణం చేయించనున్న గవర్నర్ బిశ్వభూషణ్ *…
కరీంనగర్ జిల్లా బీజేపీ పార్టీలో వర్గ విభేదాలు ఇప్పట్లో సమసిపోయేలా లేవు..గతంలో సైతం పలుమార్లు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల ఓటమికి వర్గ విబేధాలే కారణం కాగా రాబోవు ఎన్నికల్లో కూడా ఈ గొడవ తప్పదేమో అని కింది స్థాయి కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. జిల్లా ఎంపీ గా రాష్ట్ర అధ్యక్షుడే ప్రాతినిధ్యం వహిస్తూ జిల్లాలో ఉన్నా అప్పుడప్పుడు అసమ్మతి రాగాలు వినబడుతూనే ఉన్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీజేపీ మూడు ముక్కలాట గా మారింది. కరీంనగర్ జిల్లా…
తెలంగాణ కాంగ్రెస్ కి జవజీవాలు తెచ్చేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తానన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కాంగ్రెస్ అధిష్టానం ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించింది. తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్‌గా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని నియమించింది. దీంతో ఆయన వర్గం ఖుషీగా వుంది. శ్రీరామనవమి సందర్భంగా రామగిరిలో సీతారాముల కల్యాణంలో పాల్గొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఏఐసీసీ తనకు ఈ బాధ్యతలు అప్పగించడంతో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తానన్నారు. కేసీఆర్…
తెలంగాణలో ఒకప్పుడు నీటికొరత తీవ్రంగా వుండేది. తెలంగాణ ఉద్యమం తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తాగునీరు, సాగునీరు పుష్కలంగా లభిస్తోంది. సిద్దిపేట రూరల్ మండలం సీఎం కేసీఆర్ స్వగ్రామం చింతమడక గ్రామంలో నూతనంగా నిర్మించిన పట్టాభి రామ దేవస్థానంలో ఘనంగా జరుగుతున్న ప్రతిష్టా మహోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు. పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు అర్చకులు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు…
https://www.youtube.com/watch?v=tlb10ojL91g భద్రాచలంలో శ్రీసీతారామచంద్ర స్వాముల వారి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం ఉదయం గం.10-30 లకు శ్రీ సీతారాముల కళ్యాణం జరగనుంది. 11వ తేదీన శ్రీరామచంద్రుల వారి పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహిస్తారు. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం మిథిలా స్టేడియంలో స్వామివారి ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించారు. శ్రీసీతారామచంద్ర స్వాముల కల్యాణం కోసం మిథిలా స్టేడియంలో చలువ పందిళ్లు వేశారు. 2.5లక్షల తలంబ్రాల పాకెట్లు సిధ్దం చేశారు. భద్రాద్రి ఆలయాన్ని రంగురంగుల విద్యుదీపాలతో అలంకరించారు. రేపు జరిగే…
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై మరోసారి సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేశారు తెలంగాణ మంత్రి కేటీఆర్.. ఓవైపు పెరిగిపోతున్న పెట్రో ధరలు.. మరోవైపు హిందీ భాషపై చేసిన వ్యాఖ్యలపై వ్యంగాస్త్రాలు విసిరారు.. ప్రధాని మోడీ నాయకత్వంలో ప్రపంచంలో పెట్రోలు, డీజిల్ ధరల్లో దేశం అగ్రస్థానంలోకి దూసుకెళ్లిందంటూ ఎద్దేవా చేసిన ఆయన.. కొనుగోలు శక్తి సమానత్వం అంచనా ఆధారంగా ప్రపంచంలో భారత్‌లో ఎల్పీజీ ధరలు అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు.. ఇక, పెట్రోలు…