హైదరాబాద్ సరూర్‌నగర్‌లో దారుణ హత్యకు గురైన నాగరాజు అంత్యక్రియలు పూర్తిచేశారు కుటుంబసభ్యులు.. వికారాబాద్ జిల్లాలోని అతని స్వగ్రామంలో.. పోలీసుల బందోబస్తు మధ్య అంతిమయాత్ర సాగింది.. నాగరాజును హత్య చేసినవారిని ఎన్‌కౌంటర్ చేయాలని నినాదాలు చేశారు గ్రామస్తులు.. అంత్యక్రియల తర్వాత ఎన్టీవీతో మాట్లాడిన నాగరాజు భార్య ఆశ్రీన్.. తాను అన్నవాళ్ల దగ్గరికి వెళ్లేదిలేదని స్పష్టం చేశారు. నాగరాజు కుటుంబ సభ్యులు తనతో సఖ్యతగానే వుంటున్నారని.. పెళ్లి చేసుకున్నా తనను ఒక్క మాట కూడా అనలేదని వెల్లడించింది ఆశ్రీన్.
Read Also: Chandra Babu: రుషికొండపై జగన్ కన్నుపడితే.. అంతే సంగతులు..!!
ఇక, మా నాన్న చావుకు కూడా మా అన్ననే కారణం.. మా అన్న.. రోజూ మా నాన్నని కొట్టేవాడు.. మా ప్రేమ విషయం మా నాన్న కి తెలుసు. మా పెళ్లికి అంగీకరించాడు. కానీ.. మా నాన్న చనిపోయాడని.. అదికూడా మా అన్న కొట్టడం వల్లే మృతిచెందాడని ఆవేదన వ్యక్తం చేశారు ఆశ్రీన్. మా అన్న దుర్మార్గుడు.. వాడిని చంపేయాలన్న ఆమె.. నాగరాజు హత్య సమయంలో ప్రేక్షక పాత్ర వహించిన జనంపై మండిపడ్డారు.. జనాలు కుక్కలకంటే హీనం… నాగరాజుని కొడుతుంటే… ఒక్కడు కూడా ఆపలేకపోయాడు.. చూస్తూ నిల్చున్నారు.. చనిపోయాక మాత్రం వందల మంది వచ్చారు.. ఇప్పుడు నా నాగరాజు ని తీసుకురాలేరు కదా? అంటూ కన్నీరుమున్నీరయ్యారు. నాగరాజుని కొడుతుంటే.. కొందరు మొబైల్ ఫోన్ లో రికార్డ్ చేశారని ఆవేదన వ్యక్తం చేసిన ఆశ్రీన్.. సమాజం పైనే తనకు అసహ్యం వేస్తోందన్నారు. నాగరాజు తల్లిదండ్రులు నాతో బాగానే ఉన్నారు… నేను ఇకపై వీళ్లతోనే ఉంటానని తెలిపారు. నాకు న్యాయం జరుగుతుంది అనే నమ్మకం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు నాగరాజు భార్య ఆశ్రీన్..