ఆరుగాలం శ్రమించి అరక దున్ని విత్తనాలు వేసినా అవి మొలకెత్తుతాయన్న ఆశలేదు. కొందరు కేటుగాళ్ళ కారణంగా అన్నదాతలకు అగచాట్లు తప్పడంలేదు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో మారుమూల గ్రామాలపై నకిలీ విత్తనాలు పంజా విసురుతున్నాయి. అమాయక రైతులే టార్గెట్ గా కార్యకలాపాలు అప్పుడే మొదలెట్టేశారు. మంచిర్యాల, కొమురంభీం జిల్లాలో నిషేధిత పత్తివిత్తనాలు అమ్మే ముఠాలు ఎక్కడి నుంచివస్తున్నాయో తెలీడం లేదు. ఏటా ఇదేతంతు జరుగుతున్నా అధికారుల నిఘా కొరవడుతుంది. విచ్చలవిడిగా నకిలీ విత్తనాలు గ్రామాల్లోకి ఇప్పటికే వచ్చిచేరాయి. పోలీసుల…
★ నేడు ఏలూరు జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన.. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు భరోసా ఇవ్వనున్న పవన్.. ★ విశాఖ: నేటి నుంచి మూడురోజుల పాటు వైసీపీ ఆధ్వర్యంలో జాబ్ మేళా… ఈ జాబ్ మేళా ద్వారా 23,935 మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ★ నేడు విశాఖ స్టీల్‌ప్లాంట్ గుర్తింపు సంఘం ఎన్నికలు.. 10,589 మంది ఓటర్ల కోసం 17 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు.. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్..…
ఈ రోజు ఏ రాశివారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టవచ్చు…? ఏ రాశివారు జాగ్రత్త వహించాలి..? ఏ రాశివారు ఏం చేస్తే మంచి ఫలితాలు రాబోతున్నాయి… శనివారం రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్ చేయండి. https://www.youtube.com/watch?v=oEQIrGb94nI
సికింద్రాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో గ్యాంగ్ వార్ చోటు చేసుకుంది. పాత గొడవల కారణంగా వారసిగూడ పోచమ్మ ఆలయం వెనుక వీధిలో సాయంత్రం కొంతమంది యువకులు వచ్చి వీధిలో యువకులతో గొడవ పెట్టుకుని కర్రలతో దాడి చేసి హంగామా సృష్టించారు. కర్రలతో పాటు రాళ్లతో దాడి చేసి పూల కుండీలను ధ్వంసం చేసి స్థానికులను భయబ్రాంతులకు గురి చేశారు. దీంతో స్థానికంగా ఉన్న మహిళలు డయల్ 100 ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దాడి…
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. వైఎస్ షర్మిల స్థాపించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీపై ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు.. తెలంగాణలో పాదయాత్రలు, దీక్షలు, ధర్నాలతో దూసుకెళ్తున్నారు వైఎస్ షర్మిల.. ఏ అవకాశం దొరికినా ప్రభుత్వంపై ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు.. ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్నారు. పాదయాత్రలో వివిధ వర్గాల ప్రజలను కలుస్తూ.. తెలంగాణలో రాజన్న రాజ్యం రాబోతోంది.. అందరికీ న్యాయం జరుగుతుందంటూ ముందుకు సాగుతున్నారు. అయితే, రాబోయే…
తెలంగాణలో సంచలనం సృష్టిస్తోన్న ఖమ్మం బీజేపీ నేత సాయి గణేష్ ఆత్మహత్య వ్యవహారం హైకోర్టుకు చేరింది… పోలీసుల వేధింపులు తాళలేకే సాయి గణేష్ ఆత్మహత్య చేస్తున్నాడంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.. ఈ ఆత్మహత్యపై సీబీఐతో విచారణ జరిపించాలని తన పిటిషన్లో పేర్కొన్నారు పిటిషనర్ తరపు న్యాయవాది అభినవ్.. ఇక, ఇవాళ ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి పువ్వాడ అజయ్‌తో పాటు మొత్తం 8 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.. ఇక,…
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు మంత్రి నిరంజన్ రెడ్డి. గతంలో వానాకాలం పంటలపై ఈసారి ఎలాంటి ఆంక్షలు విధించబోమన్నారు. వరితో పోల్చితే ఇతర పంటలు లాభదాయకంగా వుంటాయని మంత్రి తెలిపారు. రైతులకు ఇష్టమైన పంటలు పండించుకోవచ్చని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఇతర పంటల సాగుకు రైతులను ప్రోత్సహిస్తున్నట్టు ఆయన తెలిపారు. వానకాలం పంటలపై ఆంక్షలు పెడుతున్నారంటూ సాగుతున్న ప్రచారంపై స్పందిస్తూ ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. వరిపై ఆంక్షలు లేవని, లాభసాటి…
గోదావరి నది యాజమాన్య బోర్డ్ సమావేశానికి ఏపీ ఇరిగేషన్ శాఖ అధికారులు గైర్హాజరు అయ్యారు. దీంతో సమావేశాన్ని వాయిదా వేశారు బోర్డు చైర్మన్ మహేంద్ర ప్రతాప్ సింగ్. త్వరలో మరోసారి సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. బోర్డు సమావేశాలకు వరుసగా రెండు సార్లు డుమ్మా కొట్టారు ఏపీ ఇరిగేషన్ అధికారులు. గత నెల మార్చి 11 న నిర్వహించ తలపెట్టిన సమావేశానికి ఏపీ డుమ్మా కొట్టిన సంగతి తెలిసిందే. ఏపీ అధికారులు రాకపోవడంతో 13 వ సమావేశం..…
భారత ప్రభుత్వం ఈ ఏడాది దేశ వ్యాప్తంగా ఆరోగ్య మేళాలను నిర్వహిస్తుందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. దేశమంతా మండలి స్థాయిలో ఆరోగ్య మేళాలు నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ సదుపాయాలను వినియోగించుకోకుండా ప్రజలు ప్రయివేటు ఆసుపత్రికి వెళుతున్నారు. ధనిక, పేద అనే తేడా లేకుండా కేంద్ర ప్రభుత్వం హెల్త్ కార్డులు ఇస్తుందన్నారు. హైదరాబాద్ నారాయణగూడలోని కేశవ మెమోరియల్ లో హెల్త్ మేళాను ప్రారంభించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దానం నాగేందర్ హాజరయ్యారు. ఆయుష్మాన్ భారత్ హెల్త్…