OTR: తాండూరు కాంగ్రెస్‌లో గ్రూప్ వార్.. ఎమ్మెల్యే vs ఎమ్మెల్సీ పోరు ముదిరిందా?
- ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి
- ఫ్లెక్సీ విషయంలో మరోసారి బయటపడ్డ రెండు వర్గాల విభేదాలు
- ఎమ్మెల్యే ఆహ్వాన ఫ్లెక్సీని ఎమ్మెల్సీ వర్గం తీసేయించిందని ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OTR: అక్కడ హస్తం గట్టిగా బీటలువారుతోందా? ఫెవిక్విక్ పెట్టి అతికించినా అతుక్కోనంతగా గ్యాప్‌లు పెరిగిపోయాయా? కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ రెండు గ్రూప్స్‌గా విడిపోయి ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారా? కలిసి కార్యక్రమాల్లో పాల్గొనడమే అరుదైతే… ఒకవేళ గత్యంతరంలేక పాల్గొన్నా ముఖ ముఖాలు చూసుకోవడానికి కూడా ఇష్టపడటం లేదా? ఎవరా నాయకులు? ఎందుకా యుద్ధం?. వికారాబాద్ జిల్లా తాండూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య మనస్పర్థలు తారా స్థాయికి చేరాయి. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి వర్గీయుల మధ్య అంతర్గత కలహాలు మరోసారి బహిర్గతం అయ్యాయి. ఇటీవల వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం మంబాపూర్లో ఫ్లెక్సీ వివాదం రేగింది. తాము ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని సర్పంచ్ భర్త శ్రీనివాస్ తొలగించేశాంటూ ఆయనపై పెద్దేముల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు స్థానిక కాంగ్రెస్ నాయకులు. మంబాపూర్లో కొత్తగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ళ గృహప్రవేశ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని ఆహ్వానిస్తూ పెట్టిన ఫ్లెక్సీ అది. భార్య సర్పంచ్ కాగా…. భర్త శ్రీనివాస్ షాడోలా మారి పెత్తనం చెలాయిస్తున్నారని, సొంత పార్టీ వాళ్ళని కూడా చూడకుండా ఆయనే ఫ్లెక్సీని తొలగించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ లీడర్స్. దీనికి సంబంధించి ఇరు వర్గాలు పోలీసులకు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి. పూర్తి వివరాలు సేకరించాక కేసులు నమోదు చేస్తామంటూ పంపేశారు పోలీసులు.
మాంబాపూర్ సర్పంచ్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి వర్గీయులు కావడంతో ఎమ్మెల్యే మనుషులు కావాలనే గొడవ చేసారంటూ జిల్లాలో చర్చ జరుగుతోంది. ఇదేకాక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య అభిప్రాయ బేధాలు చాలా ఉన్నాయని, ఆ విషయం పలుమార్లు బహిర్గతం అయిందని కూడా చెప్పుకుంటున్నారు. నియోజకవర్గంలో జరిగే అధికారిక కార్యక్రమాలు, పార్టీ ప్రోగ్రామ్స్‌లో ఇద్దరూ కలిసి పాల్గొనడం చాలా అరుదన్నది స్థానిక నాయకుల మాట. ఒకవేళ ఇద్దరూ కలిసి పాల్గొంటే ప్రోటోకాల్ సమస్య తలెత్తడమో, స్టేజీ మీద ఒకరి ముఖం మరొకరు చూసుకోకుండానే కార్యక్రమం పూర్తి చేయడమో కామన్ అంటున్నారు. వికారాబాద్ జిల్లాలో అధికారుల పోస్టింగ్స్ విషయంలో కూడా ఆధిపత్య పోరు కొనసాగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యే ఒక అధికారికి, ఎమ్మెల్సీ మరొక అధికారికి సిఫారసు చేయడం విమర్శలకు దారి తీస్తోంది. ఇటీవల ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారుల ఎంపిక విషయంలో గందరగోళం రేగింది. అనర్హులకు ఇళ్ళు ఇచ్చారంటూ కొందరు ఆందోళన చేశారు. గతంలో పెద్దేముల్ మండల విద్యాధికారి విషయంలో కూడా వివాదం చెలరేగింది. ఒక ఎంఈఓ ఉండగానే మరో ఎంఈఓకు పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చారు. దీంతో పాత ఎంఈఓ ట్రాన్స్ ఫర్ అవక… కొత్తాయన జాయిన్ అవలేక సతమతం అయ్యారు. వాళ్ళలో కూడా ఒకరికి ఎమ్మెల్యే మద్దతు, మరొకరికి ఎమ్మెల్సీ మద్దతు ఇవ్వడం పెద్ద చర్చకు కారణం అయింది. ఇద్దరి మధ్య సయోధ్య కుదుర్చడానికి అధిష్టానం చొరవ చూపక పోవడంతో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. ఇది ఇలాగే కొనసాగితే నియోజకవర్గంలో పార్టీ పట్టు జారడం ఖాయమంటున్నారు కార్యకర్తలు.
Also Read
- Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
- Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు... ఆ సీట్లు దక్కేదెవరికి..?
- Off The Record: నమ్మినవాళ్లే జనసేనను ముంచుతున్నారా... ఈ సారి గ్లాస్ ప్లాన్ ఏంటి...?
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
- Tags
- ntv news
- NTV Telugu
- OTR
- telangana
తాజావార్తలు
-
Buddha Prasad: జనసేన లేకుండా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి జెండా ఎగురదు!
-
Nani – Rukmini Vasanth: తమిళ దర్శకుడి క్లాసిక్ లవ్ స్టోరీ.. నాని జోడిగా రుక్మిణి వసంత్.?
-
Kishan Reddy: కాంగ్రెస్ ఓటములకు ఎన్నికల సంఘం ఎలా బాధ్యత వహిస్తుంది? కిషన్‌రెడ్డి ప్రశ్న
-
PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!