Khamenei: ఖమేనీ అంత్యక్రియల్లో హృదయ విదారక దృశ్యం.. 14 నెలల మనవరాలి పార్థివదేహం
- ఖమేనీ అంత్యక్రియల్లో హృదయ విదారక దృశ్యం
- 14 నెలల మనవరాలి పార్థివదేహం
- సందర్శకుల్ని కంటతడి పెట్టిన దృశ్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియల్లో హృదయ విదారక దృశ్యం అందరికీ కంటితడి పెట్టిస్తోంది. 14 నెలల మనవరాలి చిన్న శవపేటిక అందరినీ భావోద్వేగానికి గురి చేసింది. టెహ్రాన్‌లోని గ్రాండ్ మొసల్లా ప్రాంగణానికి ఖమేనీ భౌతికకాయాన్ని తీసుకురాగా.. యుద్ధం ప్రారంభమైన తొలి దశలో ఆయనతో పాటు ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యుల శవపేటికలను కూడా అక్కడ ఉంచారు. మృతుల్లో ఖమేనీ అల్లుడు, కుమార్తె, కోడలుతో పాటు కేవలం 14 నెలల వయస్సు ఉన్న మనవరాలు కూడా ఉండటం విషాదాన్ని మరింత పెంచింది. ప్రస్తుతం ఇరాన్ కొత్త సుప్రీం నాయకుడిగా బాధ్యతలు చేపట్టిన మొజ్తబా ఖమేనీ భార్య కూడా ఉన్నట్లు సమాచారం.
అంత్యక్రియల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 14 నెలల చిన్నారి మనవరాలి చిన్న శవపేటిక అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ దృశ్యం అక్కడికి వచ్చిన ప్రజలను, విదేశీ ప్రతినిధులను తీవ్ర భావోద్వేగానికి గురి చేసింది. ఖమేనీ కుటుంబ సభ్యుల మరణంతో ఇరాన్లో విషాద ఛాయలు అలుముకోగా, అంత్యక్రియలకు హాజరైన లక్షలాది మంది ప్రజలు నివాళులర్పిస్తూ వారి కుటుంబానికి సంతాపం తెలిపారు. దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు కూడా ఖమేనీతో పాటు మృతి చెందిన కుటుంబ సభ్యులకు నివాళులు అర్పించారు.
Also Read
- Nepal Floods: నేపాల్‌లో జల ప్రళయం.. విరిగిపడ్డ కొండచరియలు.. మూడు రోజుల్లో ఎంత మంది చనిపోయారంటే!
- Indian Navy: సముద్ర రక్షణకు భారతే రథసారథి.. 6 అగ్రదేశాలతో కలిసి భారత నౌకాదళం గర్జన!
- Trump Iran Statement: ‘త్వరలోనే విజయం సాధిస్తాం’.. ఇరాన్‌తో ఘర్షణపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- Iran Embassy Shares Baahubali Video: ‘తలవంచం.. మోకరిల్లం’.. అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ మెసేజ్. ప్రభాస్ 'బాహుబలి' వీడియో షేర్ చేసి..!
ఫిబ్రవరి 28న ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడి చేశాయి. ఈ దాడిలో ఖమేనీ సహా కుటుంబ సభ్యులు, కీలక నేతలంతా హతమయ్యారు. దాదాపుగా 100 రోజులకు పైగా అంత్యక్రియలు జరపకుండా ఉంచారు. ప్రస్తుతం ఇరాన్-అమెరికా మధ్య శాంతి చర్చలు నెలకొన్న నేపథ్యంలో తాజాగా అంత్యక్రియలు చేపట్టారు. జూలై 9న ఖమేనీ అంత్యక్రియలు జరగనున్నాయి. అప్పటి వరకు ఆయా పవిత్ర స్థలాల సందర్శన జరగనుంది.
Tiny coffin of Khamenei's grandchild, killed in US-Israel strikes, shown during the funeral ceremony https://t.co/xazL42Xjvf pic.twitter.com/ho4IKkAG9a
— RT Intl (@RT_on_X) July 3, 2026
తాజావార్తలు
-
CM Revanth Reddy: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. విద్య నుంచి ‘SIR’ వరకు ఫుల్ ఫైర్
-
Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
-
Bhu Bharati: రైతులకు ఊరట.. భూ సమస్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.!
-
El Nino : తెలంగాణలో సెప్టెంబర్ సెగ.. 2 రోజుల్లో మరో 2 డిగ్రీలు పెరిగే ఛాన్స్.!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!