Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indonesia: ఓ ఘటన ఇండోనేషియాలో జరిగినట్లుగా సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తరచూ జరుగుతున్న దొంగతనాలతో విసిగిపోయిన స్థానికులు.. దొంగతనం చేస్తూ పట్టుబడిన నలుగురు వ్యక్తులకు వినూత్నంగా శిక్ష విధించారు. దొంగలను కొట్టడం లేదా హింసించడం కాకుండా, తల నుంచి కాళ్ల వరకు బ్రౌన్ కలర్ డక్ట్ టేప్‌తో పూర్తిగా చుట్టేయడంతో వారు ఈజిప్టు ‘మమ్మీ’లను తలపించేలా మారిపోయారు.
వైరల్ అవుతున్న కథనాల ప్రకారం.. ఈ ఘటన ఇండోనేషియాలోని ఓ నివాస ప్రాంతంలో చోటుచేసుకుంది. నలుగురు వ్యక్తులు ఓ దుకాణంలో దొంగతనం చేసేందుకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఆ ప్రాంతంలో ఇటీవల తరచూ దొంగతనాలు జరుగుతుండటంతో స్థానికులు ముందుగానే అప్రమత్తంగా ఉండడంతో వారిని పట్టుకున్నారు. దొంగతనానికి ప్రయత్నిస్తున్న సమయంలో స్థానికులు వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం.
Also Read
- L Murugan Resigns: కేంద్ర మంత్రి పదవికి మురుగన్ రాజీనామా.. కారణం ఏంటంటే..
- Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
- Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
- Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
పోలీసులు వచ్చే వరకు వారు తప్పించుకోకుండా ఉండేందుకు వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు అక్కడి స్థానికులు. నలుగురినీ టేప్‌తో పూర్తిగా చుట్టేసి అక్కడే ఉంచినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు స్థానికుల చర్యను సమర్థిస్తూ దొంగతనాలను అరికట్టేందుకు ఇది హెచ్చరికగా పనిచేస్తుందని వ్యాఖ్యానిస్తుండగా.. మరికొందరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సరైన పద్ధతి కాదని అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ వీడియోలో కనిపిస్తున్న ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందనే విషయంపై అధికారికంగా స్పష్టత లేదు.
🚨 Es FALSO que un hombre en Indonesia capturó a cuatro ladrones, los amarró con cinta y los disfrazó de Teletubbies.
✅ Medios locales confirmaron que el video corresponde a creadores de contenido grabando un reto para redes sociales. La historia de los supuestos ladrones fue… pic.twitter.com/vOd0nbTyov— Código MX (@CdigoMXdigital) July 2, 2026
తాజావార్తలు
-
Aafiya Sayed: రుక్మిణి ఎవరో తెలిసింది.. నితిన్ లవర్‌గా సరికొత్త హీరోయిన్
-
L Murugan Resigns: కేంద్ర మంత్రి పదవికి మురుగన్ రాజీనామా.. కారణం ఏంటంటే..
-
Scholarships : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
-
Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
-
Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!