అక్రమ లేఅవుట్లు అతిపెద్ద సమస్యగా మారిందని అభిప్రాయపడింది సుప్రీంకోర్టు… దేశవ్యాప్తంగా అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది.. అక్రమ లేఅవుట్ల క్రమబద్దీకరణను సవాల్ చేసిన జువ్వాడి సాగర్ రావు అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టింది సుప్రీం.. కేసులో అమికస్ క్యూరీగా సీనియర్ అడ్వకేట్ శంకర్ నారాయణను నియమించింది అత్యున్నత న్యాయస్థానం.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు జస్టిస్ నాగేశ్వరరావు.. అక్రమ లేఅవుట్లు అతిపెద్ద సమస్యగా మారాయన్న ఆయన.. అనియంత్రిత…
జాబ్ స్పేస్ యాప్ ద్వారా ఎక్కడ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా మెసేజ్ ద్వారా తెలిసిపోతుందని తెలిపారు మంత్రి హరీష్రావు.. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో పోటీ పరీక్షల ఉద్యోగార్థులకు ఉచిత భోజనం కార్యక్రమం, స్టడీ మెటీరియల్ ప్రారంభించిన మంత్రి హరీష్ రావు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భవిష్యత్లో ప్రతి సంవత్సరం ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తామని తెలిపారు.. గ్రూప్ వన్, గ్రూప్ 2లో ఇంటర్వ్యూ లేకుండా వ్రాత పరీక్షల ద్వారా పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తామన్న ఆయన..…
రంజాన్ సందర్భంగా ప్రయాణికులకు శుభవార్త అందించింది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. కార్గో సర్వీసు ఛార్జీలపై 25 శాతం డిస్కౌంట్ అందిస్తున్నట్టు ఎండీ వీసీ సజ్జనార్ ప్రకటించారు. ఆర్టీసీని గాడిన పెట్టేపనిలో భాగంగా ఎండీ సజ్జనార్ వినూత్న పథకాలు ప్రవేశపెడుతున్నారు.ప్రతీ పండగ సందర్భంగా కొత్త కొత్త డిస్కౌంట్లను ఆయన ప్రవేశపెడుతున్నారు. తాజాగా రంజాన్ మాసం సందర్భంగా ప్రయాణికులకు మరో శుభవార్త చెప్పారు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్. ఆర్టీసీకి సంబంధించిన కార్గో, పార్శిల్ ఛార్జీలపై 25శాతం తగ్గింపు…
పార్టీ సర్వేలో నిలిచేది ఎందరు?సర్వేలు.. వడపోతలు.. నిఘా వర్గాల నివేదికలు. ప్రస్తుతం టీఆర్ఎస్లో చర్చగా మారిన అంశాలివే. వీటి ఆధారంగానే టికెట్స్ కేటాయింపు ఉంటుందనే అంతర్గత చర్చ చాలామంది ఎమ్మెల్యేలలో గుబులు రేపుతోంది. సర్వేలో నిలిచింది ఎవరు? జారిపోయింది ఎవరు అనేది అంతుచిక్కని పరిస్థితి. ఇదే సమయంలో రకరకాల ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు ఎమ్మెల్యేలకు కునుకు లేకుండా చేస్తున్నాయి. ఉద్యమ పార్టీగా ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి.. 2014లో తొలిసారిగా అధికారంలోకి…
ప్రైవేటు ఆస్పత్రుల్లో లక్షల్లో ఖర్చు అయ్యే వైద్యాన్ని తెలంగాణ ప్రభుత్వం పూర్తి ఉచితంగా ప్రభుత్వ హాస్పిటళ్ళలో అందిస్తున్నది.గత 6 నెలల్లో ఉస్మానియా ఆసుపత్రిలో 50 కీళ్లు మార్పిడి ఆపరేషన్లు,60 రోజుల్లో 250 హృద్రోగ చికిత్సలు జరగడం సర్కారు దవాఖానాలపై ప్రజల నమ్మకానికి నిదర్శనం అని ట్వీట్ చేశారు మంత్రి హరీష్ రావు. సీఎం కేసీఆర్ దార్శనికత పేదలకు మోయలేని భారాన్ని తగ్గిస్తున్నదన్నారు. ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్, వైద్య సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఉస్మానియాలో మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ల…
కలియుగ వైకుంఠం తిరుమలకు వస్తున్న భక్తుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. తిరుమల శ్రీవారి హుండి గలగలలాడుతోంది. కోవిడ్ కారణంగా ఏడాదిగా తగ్గిన స్వామి వారి ఆదాయం… అంచనాలకు మించి పెరుగుతోంది. ఈ మాసంలో ఇప్పటికే 90 కోట్లు దాటగా… నెలాఖరుకు వందకోట్లు అవుతుందని ఆంచనా వేస్తున్నారు. కరోనా మహమ్మారి పుణ్యమాని 2020లో హుండీ ఆదాయం రూ.700 కోట్లే. కానీ 2021లో హుండీ ఆదాయం రూ.900 కోట్లకు పెరగడంతో టీటీడీ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది…
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ప్రాణహిత పుష్కరాలు కూడా తోడవడంతో గత 10 రోజులుగా రాజన్న ఆలయంలో భక్తుల సందడి పెరిగింది. గత 23 రోజులుగా హుండీ కౌంటింగ్ జరగకపోవడంతో ఆలయంలోని హుండీలన్నీ నిండిపోయాయి. ఈనెల 10న శ్రీరామనవమి ఉత్సవాలు ముగిసిన వెంటనే, ఇన్చార్జి ఈవో రమాదేవి వెళ్ళిపోవడంతో హుండీలను లెక్కించలేదు. ప్రధానాలయం తో పాటు బద్ది పోచమ్మ దేవాలయంలో కూడా హుండీలు నిండిపోయాయి. ఆలయంలో…
https://www.youtube.com/watch?v=XrlcYba0DH8 ఈ రోజు ఏ రాశివారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టవచ్చు…? ఏ రాశివారు జాగ్రత్త వహించాలి..? ఏ రాశివారు ఏం చేస్తే మంచి ఫలితాలు రాబోతున్నాయి… సోమవారం రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్ చేయండి.
* నేడు కరీంనగర్ కు రానున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. సాయంత్రం 4 గంటలకు పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణుల ఏర్పాట్లు. స్థానిక ఎన్టీఆర్ సర్కిల్ నుండి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ వరకూ భారీ ర్యాలీ * నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్. లక్ష్మీ నరసింహస్వామివారి అనుబంధ ఆలయమైన శ్రీ పర్వత వర్దిని సమేత రామలింగేశ్వర స్వామి శివాలయం పంచకుండాత్మక మహా కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొననున్న సీఎం కేసీఆర్ దంపతులు. * ఈ…