టీఆర్ఎస్ పార్టీ త్వరలోనే జాతీయ రాజకీయాలపై దృష్టి పెడుతుందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఎన్టీవీ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో ప్రత్యేకంగా ఆయన మాట్లాడుతూ పలు అంశాలపై వివరించారు. తాను 8 ఏళ్ల పాటు తెలంగాణ ఉద్యమంలో పని చేశానని.. తర్వాత 8 ఏళ్ల పాటు ప్రభుత్వంలో ఉన్నానని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే టీఆర్ఎస్ పార్టీ పుట్టిందని.. అందుకే రాష్ట్రం ఆవిర్భవించిన రోజు కలిగిన తృప్తి, సంతోషంతో పోలిస్తే మిగతా విషయాలు సరితూగవన్నారు.…
తెలంగాణ మంత్రి కేటీఆర్ మాట తీరు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ విషయంపై అయినా ఆయన ముక్కుసూటిగా మాట్లాడతారు. ఆయన మాటల్లో చాలా క్లారిటీ ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీకి పీకే అవసరం ఉందా?, తెలంగాణ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకతపై ఉందా? రాష్ట్రంలో అధికారంలో ఉండి కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఢిల్లీలో ధర్నా చేయాల్సిన అవసరం ఏముంది? కేంద్ర ప్రభుత్వం ఈడీ, ఐటీ దాడులు చేస్తే ప్రభుత్వ వ్యూహమేంటి? ఇలా పలు రకాల ప్రశ్నలకు…
తెలంగాణ ఉద్యమం ఉద్యోగాల కోసం జరిగిందన్నారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. విభజన లో ప్రధాన పాత్ర పోషించిన చరిత్ర ఉస్మానియా యూనివర్సిటీది. విద్యార్ధుల ప్రాణాలు కోల్పోవద్దు అని సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల త్యాగం మరవలేము. రాహుల్ గాంధీ నీ ఉస్మానియా యూనివర్సిటీ కి తీసుకువస్తాం. రాజకీయాలకు సంబంధం లేకుండా యూనివర్సిటీ వెళ్తారు. యూనివర్సిటీ సందర్శించి.. విద్యార్థులతో మాట్లాడతారు. యూనివర్సిటీ సమస్యలు..ఉద్యోగాల భర్తీ మీద మాట్లాడతారు. సమస్యలు రాహుల్ గాంధీ దృష్టికి తీసుకువచ్చే…
ప్రాణహిత నదికి భక్తులు పోటెత్తారు. ప్రాణహిత పుష్కరాలు నేటితో పరిసమప్తం కానున్నాయి .దీంతో ప్రాణహిత పుష్కర ఘాట్లు భక్తులతో కిక్కిరిసాయి. పాఠశాలలకు వేసవి సెలవులు కూడా ప్రకటించడంతో పిల్లా పాపలతో పుష్కర స్నానాలకు బయలుదేరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో ప్రాణహిత పుష్కరాలకు భక్తులు పోటెత్తారు. పుష్కరాలు చివరిరోజు కావడంతో వేకువ జామున నుండే తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల నుండి కాళేశ్వరం త్రివేణి సంగమానికి చేరుకొని గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు…
* శ్రీకాకుళం జిల్లా నైరా గ్రామంలో నూతన గ్రామ సచివాలయ భవన ప్రారంభోత్సవం చేయనున్న రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల మంత్రి ధర్మాన ప్రసాదరావు * నేడు పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయి 12 వ ఆరాధనోత్సవాలు. ముస్తాబైన ప్రశాంతి నిలయం. ప్రత్యేక పూల అలంకరణలో సత్యసాయి మహా సమాధి. * IPL 2022: ఇవాళ లక్నో వర్సెస్ ముంబై మ్యాచ్. ముంబై వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్. * బెంగళూరులో ఖేలో ఇండియా వర్శిటీ క్రీడలు…
రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వాలని నిర్ణయించారు సీఎం కేసీఆర్.. తెలంగాణ ప్రభుత్వం తరపున.. ఈనెల 29వ తేదీన సాయంత్రం 6.10 గంటలకు ఎల్బీ స్టేడియంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.. ముస్లిం మత పెద్దల సమక్షంలో, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వాధికారులు, ప్రజలు పాల్గొనే ఇఫ్తార్ విందును రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించనున్నదని వెల్లడించారు కేసీఆర్.. Read Also: Case on SI: యువకుడి ఆత్మహత్య.. ఎస్ఐపై కేసు నమోదు.. తెలంగాణ రాష్ట్రం నేడు…
ఈ మధ్య తెలంగాణలో జరిగిన కొన్ని ఘటనల్లో పోలీసులపై తీవ్ర విమర్శలు వచ్చాయి.. అయితే, ఓ యువకుడి ఆత్మహత్యకు కారణం అంటూ ఎస్ఐ గుర్రం ఉదయ్ కిరణ్ పై కేసు నమోదు చేశారు ములుగు పోలీసులు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలోని ద్విచక్ర వాహనాల షోరూం వద్ద జరిగిన ఘర్షణ.. ఓ యువకుడి ప్రాణం తీసింది. 12 రోజుల క్రితం ద్విచక్ర వాహనానికి సంబంధించిన ఎన్వోసీ కోసం పెండ్యాల ప్రశాంత్…
సృష్టిలో తల్లి జన్మనిస్తుంది. కానీ అవయవదానం చేసేవారు పునర్జన్మను ఇచ్చినట్టే. ఈమధ్యకాలంలో అవయవ దానం పట్ల అవగాహన పెరుగుతోంది. అవయవదానంతో మరొకరికి పునర్జన్మ నిచ్చిన దాతలు దేవుడితో సమానం అన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. రవీంద్ర భారతిలో జీవన్ దాన్ ఆధ్వర్యంలో ఆర్గాన్స్ డోనర్స్ కుటుంబ సభ్యులకు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి తలసాని. అవయవదానం చేసి అనేకమంది ప్రాణాలు కాపాడిన అవయవదాతలను స్మరించుకోవాలన్నారు. అవయవదానంతో 3800 మంది పునర్జన్మ పొందారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన…
ఒకవైపు కోళ్ల దాణా ధరలు ఆకాశాన్నంటుతుండగా మరో వైపు కోడిగుడ్ల ధర మాత్రం రోజురోజుకు పడిపోతున్నాయి.ఇంకోవైపు ఎండలు వేడిమి తట్టుకోలేక కోళ్లు మృతి చెందుతుండడంతో కోళ్ల ఫారాల యజమానులు నష్టాల ఊబిలో పడుతున్నారు.. పది సంవత్సరాలలో ఎన్నడూ లేనంతగా కోళ్ల పరిశ్రమ నష్టాల బాటలో నడుస్తుండడంతో పౌల్ట్రీ రైతులు తమకు ఆత్మహత్యలే శరణ్యం అంటున్నారు.. ఒక్కసారిగా పెరిగిన దాణా రేట్లతో సతమతమవుతున్న కోళ్ల రైతుకు గోరుచుట్టుపై రోకలిపోటులా గిట్టు బాటుకాని విధంగా గుడ్డు ధర ఉండడంతో పరిశ్రమ…
నిర్మాణారంగానికి ప్రధానంగా అవసరమయిన సిమెంట్ మంట పెడుతోంది. ధరలు భగ్గమంటున్నాయి. ఈ నెలలోనే మరో 50 రూపాయల వరకు ధర పెరుగుతుందని క్రిసిల్ అంచనా వేస్తోంది. ఇప్పటికే భారీగా ఉన్న సిమెంట్ ధరలతో ఇంటి నిర్మాణం తడిసి మోపెడవుతోంది. సిమెంట్ ధరలు మరోసారి భారీగా పెరగనున్నాయి. ఈ నెలలోనే బస్తాపై 25 నుంచి 50 రూపాయల వరకు పెరగొచ్చని క్రిసిల్ అంచనా వేస్తోంది. సిమెంట్ తయారీలో ఉపయోగించే బొగ్గు, పెట్రోలియం కోక్ గత 6 నెలల్లో 30…