Telangana to Launch Tourist Police Units: తెలంగాణలో పర్యాటక పోలీసులు త్వరలో రాబోతున్నారు. రాష్ట్ర పర్యాటక ప్రదేశాలకు వచ్చే పర్యాటకుల భద్రత కోసం ప్రత్యేకంగా టూరిస్ట్ పోలీస్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు డీజీపీ జితేందర్ తెలిపారు. మొదటి దశలో 80 మంది పోలీసు సిబ్బందిని టూరిజం శాఖకు కేటాయిస్తామని డీజీపీ వెల్లడించారు. వరల్డ్ టూరిజం డే సెప్టెంబర్ 27 నాటికి పూర్తిస్థాయి టూరిస్ట్ పోలీస్ సిస్టమ్ అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పర్యాటకాన్ని…
యాదగిరిగుట్టలో కొత్తగా నిర్మించిన సర్కిల్స్‌కు నామకరణం చేశారు. కృష్ణ శిలతో ఆలయం నిర్మించిన సమయములోనే ఈ సర్కిల్స్ (కూడళ్ళు) ఏర్పాటు చేశారు. కానీ వీటికి పేర్లు పెట్టకపోవడముతో భక్తులు తాము ఎక్కడ ఉన్నామో అర్థంకాని స్థితిలో ఉండేది. అలాగే తమ వాళ్ళను కలవడానికి ఇబ్బంది పడ్డారు.
లాడ్ బజార్ వ్యాపారుల ఉదారత చాటుకున్నారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల దగ్గర వ్యాపారులు డబ్బులు తీసుకోలేదు. మిస్ వరల్డ్ పోటీదారులు కొనుగోలు చేసిన వస్తువులను ఉచితంగానే అందజేశారు. డబ్బులు తీసుకునేందుకు వ్యాపారుల నిరాకరించారు. హైదరాబాద్ విశిష్టతను చార్మినార్ లాడ్ బజార్ ప్రత్యేకతలను ప్రపంచవ్యాప్తంగా తమ దేశాల్లో చాటాలని మిస్ వరల్డ్ కంటెస్టెంట్లను కోరారు. మిస్ వరల్డ్ ప్రతినిధులకు తమ షాపుల్లోకి గులాబీ పూలు ఇచ్చి ఆహ్వానించారు.
Miss World 2025 : మిస్ వరల్డ్ – 2025 పోటీల్లో పాల్గొంటున్న ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు బుద్ధపూర్ణిమ సందర్భంగా సోమవారం నాగార్జునసాగర్‌లోని బుద్ధవనాన్ని సందర్శించనున్నారు. ఈ ప్రత్యేక ఆధ్యాత్మిక పర్యటనలో మొత్తం 30 దేశాలకు చెందిన మిస్ వరల్డ్ పోటీదారులు పాల్గొననుండగా, వీరిలో ఎక్కువమంది ఆసియా దేశాల నుంచి వచ్చినవారు ఉన్నారు. బౌద్ధమతంపై గల విశ్వాసం, బుద్ధుని చరిత్రపై ఆసక్తితో, ఈ సుందరీమణులు బౌద్ధ థీమ్ పార్క్‌లోని మహాస్థూపం వద్ద ప్రత్యేక ధ్యాన…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీల కార్యక్రమాలకు పకడ్బందీగా భద్రత ఏర్పాట్లను చేయాలని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్ ఐపీఎస్ పోలీస్ అధికారులను ఆదేశించారు. డీజీపీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన ప్రత్యేక సమావేశంలో పోలీసు ఉన్నతాధికారులతో డైరెక్ట్ జనరల్ ఆఫ్ పోలీస్ భద్రత ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా డీజీప మాట్లాడుతూ.... రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఇటీవల పోలీసు అధికారులతో సమావేశమై తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్…
కశ్మీర్ లో చిక్కుకున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారిని సురక్షితంగా స్వస్థలాలకు రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పర్యటకులకు తగిన సహాయం అందిస్తామని వెల్లడించారు. ఈ ఘటనపై తెలంగాణ పర్యటక శాఖ అధికారులు.. ఢిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులతో పాటు కేంద్ర ఏజెన్సీలతో సమన్వయం చేస్తూ పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు. READ MORE: Pahalgam Terror Attack: జమ్మూకాశ్మీర్‌లో భారీ నిరసనలు.. హిందూస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు…
CM Revanth Reddy : మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. బాపూఘాట్లో నిర్మించ తలపెట్టిన గాంధీ సరోవర్తో పాటు మీర్ అలం ట్యాంక్ పై నిర్మించనున్న బ్రిడ్జి నమూనాలను సీఎం పరిశీలించారు. మీర్ అలం ట్యాంక్‌పై బ్రిడ్జి నిర్మాణ పనులకు జూన్‌లో టెండర్లు పిలవాలని ముఖ్యమంత్రి అన్నారు. ఈలోగా అందుకు అవసరమైన సర్వేలు, నివేదికలు, ప్రతిపాదనలు, డిజైన్లతో డీపీఆర్‌ను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. శుక్రవారం కమాండ్ కంట్రోల్ సెంటర్…
Jupally Krishna Rao : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో పర్యాటక శాఖపై చర్చ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం కొత్త పర్యాటక విధానాన్ని రూపొందించి అమలు చేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో పర్యాటక రంగానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో, ఈ ప్రభుత్వం దిశానిర్దేశంతో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. పర్యాటక అభివృద్ధి లక్ష్యాలు రానున్న ఐదేళ్లలో రూ. 15,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించడం. మూడు లక్షల మందికి అదనపు ఉపాధి అవకాశాలు కల్పించడం. దేశీయ, అంతర్జాతీయ…
టీటీడీ వివాదంపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. రవీంద్ర భారతిలో బిల్డ్ నౌ పోర్టల్ ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి టీటీడీని ఉద్దేశించి మాట్లాడారు. ప్రతి సారి వాళ్ళని మా ఎమ్మె్ల్యే లెటర్ తో దర్శనం అడుక్కోవడం ఎందుకు? అని ప్రశ్నించారు. వాళ్లకు టీటీడీ ఉంటే మాకు వైటీడీ ఉందన్నారు. భద్రాచలంలో రాముడు లేడా? అని ప్రశ్నించారు. మనకు శివుడి ఆలయాలు తక్కువా? అన్నారు. కేటీఆర్.. మిస్ ఇండియా పోటీలు ఇక్కడ ఎందుకు అంటున్నారని.. ఆయన బాధ ఏంటన్నారు. హైదరాబాద్…