ప్రస్తుతం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రం భక్తులతో కోలాహలంగా మారింది. బీఆర్ఎస్ హయాంలో ఆలయ రూపురేఖలు మారిపోయాయి. అద్భుతమైన గడి నిర్మాణంతో పాటు భక్తులకు అనేక సౌకర్యాలు కల్పించారు.
తాజాగా యాదగిరిగుట్టలో కొత్తగా నిర్మించిన సర్కిల్స్‌కు నామకరణం చేశారు. కృష్ణ శిలతో ఆలయం నిర్మించిన సమయములోనే ఈ సర్కిల్స్ (కూడళ్ళు) ఏర్పాటు చేశారు.
కానీ వీటికి పేర్లు పెట్టకపోవడముతో భక్తులు తాము ఎక్కడ ఉన్నామో అర్థంకాని స్థితిలో ఉండేది. అలాగే తమ వాళ్ళను కలవడానికి ఇబ్బంది పడ్డారు.
ప్రస్తుతం ఈ నామకరణం సర్కిల్స్ కు పేర్లు పెట్టడంతో భక్తులకు చాలా సులభం తాము ఎక్కడ ఉన్నామో తెలుస్తోంది. తమ వాళ్ళను కలవడానికి సులువుగా ఉంటుందంటుంది. ఈ పేర్లు కూడా ఎంతో అద్భుతంగా నిర్ణయించారు.
శ్రీ యాదఋషి సర్కిల్, శ్రీ హనుమాన్ సర్కిల్, శ్రీరామానుజ సర్కిల్, శ్రీ ప్రహ్లాద సర్కిల్, శ్రీ గరుడ సర్కిల్ వంటి పేర్లతో కూడళ్లకు నామకరణం చేశారు.