లాడ్ బజార్ వ్యాపారుల ఉదారత చాటుకున్నారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల దగ్గర వ్యాపారులు డబ్బులు తీసుకోలేదు. మిస్ వరల్డ్ పోటీదారులు కొనుగోలు చేసిన వస్తువులను ఉచితంగానే అందజేశారు. డబ్బులు తీసుకునేందుకు వ్యాపారుల నిరాకరించారు. హైదరాబాద్ విశిష్టతను చార్మినార్ లాడ్ బజార్ ప్రత్యేకతలను ప్రపంచవ్యాప్తంగా తమ దేశాల్లో చాటాలని మిస్ వరల్డ్ కంటెస్టెంట్లను కోరారు. మిస్ వరల్డ్ ప్రతినిధులకు తమ షాపుల్లోకి గులాబీ పూలు ఇచ్చి ఆహ్వానించారు.
READ MORE: Randhir Jaiswal: కాశ్మీర్ విషయంలో ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు
కాగా.. హైదరాబాద్ నగరంలో 72వ మిస్ వరల్డ్ పోటీలు మే 11న అట్టహాసంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. 110కిపైగా దేశాలకు చెందిన సుందరీమణులు ఈ కిరీటం కోసం పోటీపడుతున్నారు. భారత్ తరఫున మిస్ ఇండియా నందిని గుప్తా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గచ్చిబౌలి స్టేడియంలో ‘జయజయహే తెలంగాణ’ రాష్ట్ర గీతం ఆలాపనతో పోటీలు మొదలయ్యాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్వహించిన కార్యక్రమాలు అలరించాయి.”ప్రపంచ శాంతికి, ఐక్యతకు మిస్ వరల్డ్ పోటీలు పాటుపడతాయి” అని నిర్వాహకులు ప్రకటించారు. ఈ మిస్ వరల్డ్ పోటీలు మే 31వ తేదీ వరకు జరుగుతాయి.