Jupally Krishna Rao : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో పర్యాటక శాఖపై చర్చ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం కొత్త పర్యాటక విధానాన్ని రూపొందించి అమలు చేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో పర్యాటక రంగానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో, ఈ ప్రభుత్వం దిశానిర్దేశంతో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. పర్యాటక అభివృద్ధి లక్ష్యాలు రానున్న ఐదేళ్లలో రూ. 15,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించడం. మూడు లక్షల మందికి అదనపు ఉపాధి అవకాశాలు కల్పించడం. దేశీయ, అంతర్జాతీయ…
టీటీడీ వివాదంపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. రవీంద్ర భారతిలో బిల్డ్ నౌ పోర్టల్ ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి టీటీడీని ఉద్దేశించి మాట్లాడారు. ప్రతి సారి వాళ్ళని మా ఎమ్మె్ల్యే లెటర్ తో దర్శనం అడుక్కోవడం ఎందుకు? అని ప్రశ్నించారు. వాళ్లకు టీటీడీ ఉంటే మాకు వైటీడీ ఉందన్నారు. భద్రాచలంలో రాముడు లేడా? అని ప్రశ్నించారు. మనకు శివుడి ఆలయాలు తక్కువా? అన్నారు. కేటీఆర్.. మిస్ ఇండియా పోటీలు ఇక్కడ ఎందుకు అంటున్నారని.. ఆయన బాధ ఏంటన్నారు. హైదరాబాద్…
Jupally Krishna Rao : హైదరాబాద్ మిస్ వరల్డ్ 2025 పోటీలకు ఆతిథ్యమిచ్చేందుకు సిద్ధమవుతోంది. మే 7 నుండి 31వ తేదీ వరకు జరగనున్న ఈ అంతర్జాతీయ అందాల పోటీల్లో సుమారు 140 దేశాలకు చెందిన అందాల భామలు పాల్గొనబోతున్నారు. తెలంగాణను అంతర్జాతీయంగా గుర్తింపును తెచ్చే ఈ వేదిక, రాష్ట్ర పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయనుంది. ఈ పోటీల సందర్భంగా, మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే అందాల భామలు మే నెలలో తెలంగాణలోని పలు పర్యాటక…
CM Revanth Reddy : పర్యాటక శాఖపై అధికారులతో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సమీక్ష ముగిసింది. ఫిబ్రవరి 10 లోగా పూర్తి టూరిజం పాలసీని సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించింది సీఎం రేవంత్ రెడ్డి. దేశ, విదేశాల్లోని బెస్ట్ పాలసీలను అధ్యయనం చేసి పాలసీని రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దేశ, విదేశాల పర్యాటకులను ఆకర్షించేలా తెలంగాణ టూరిజం పాలసీ ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎకో, టెంపుల్ టూరిజంపై ఎక్కువగా దృష్టి పెట్టాలని…
Konda Surekha : హనుమకొండ అటవీ శాఖ ఆధ్వర్యంలో హంటర్ రోడ్డు లోని జూ పార్కులో రెండు పులులను, అడవి దున్నలను, అదేవిధంగా ఇతర జంతువులను ప్రజల సందర్శనార్థం ప్రారంభించారు రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ, బీసీ సంక్షేమ, రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ కార్యక్రమానికి మేయర్ గుండు సుధారాణి పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ..…
Nagarjuna Sagar to Srisailam Tour: కృష్ణా నదిలో జల విహారానికి తెలంగాణ పర్యాటక శాఖ సిద్ధమైంది. ఈ మేరకు ప్రయాణికుల కోసం టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చారు.
తిరుమల వెంకన్న స్వామి భక్తులకు అదిరిపోయే ప్యాకేజీ అందుబాటులోకి వచ్చేసింది. ఈ టూర్ ప్యాకేజీ కేవలం ఒక రోజులో పూర్తవుతుంది. దీనిని తెలంగాణ టూరిజం నిర్వహిస్తోంది. బస్సులోనే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. పెద్దలకు ఈ టూర్ ప్యాకేజీ టిక్కెట్ ధర 3700 రూపాయలు., అలాగే పిల్లలకు 2960 రూపాయలు. ఈ ప్యాకేజీలో తిరుమలలో ఉచితంగా శ్రీవారి శీఘ్ర దర్శనం కూడా ఉంటుంది. Also Read: Leopard Attack: కళ్లుమూసి తెరిచేలోపు చిరుతకి ఆహారమైన శునకం.. వైరల్ వీడియో..…
హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని తెలంగాణ పర్యాటక శాఖ ప్రధాన కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కార్యాలయంలోని మొదటి అంతస్తులో ఉన్న అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ప్రమాదం సంభవించినట్లు అగ్నిమాపక సిబ్బంది ప్రాథమికంగా గుర్తించారు. కాగా.. ఈ ప్రమాదంలో అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లోని ఫైల్స్,…