DGP Jitender Reddy: హైదారాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు.. కీలక ఆదేశాలు జారీ చేసిన డీజీపీ
- దాదాపు 120 దేశాల నుంచి కంటెస్టెంట్లు
- ఇప్పటివరకు 116 దేశాల కంటెస్టెంట్లు సమాచారం
- వివిధ ప్రాంతాల్లో గ్రూపుల వారీగా పర్యటనలు
- పకడ్బందీగా భద్రత ఏర్పాట్లను చేయాలన్న డీజీపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీల కార్యక్రమాలకు పకడ్బందీగా భద్రత ఏర్పాట్లను చేయాలని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్ ఐపీఎస్ పోలీస్ అధికారులను ఆదేశించారు. డీజీపీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన ప్రత్యేక సమావేశంలో పోలీసు ఉన్నతాధికారులతో డైరెక్ట్ జనరల్ ఆఫ్ పోలీస్ భద్రత ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా డీజీప మాట్లాడుతూ…. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఇటీవల పోలీసు అధికారులతో సమావేశమై తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పెంచేలా మిస్ వరల్డ్ పోటీలను నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమాలకు పకడ్బందీగా భద్రత చేపట్టాలని తెలిపారన్నారు. దాదాపు 120 దేశాల నుంచి కంటెస్టెంట్లు రానున్నారని ఇప్పటివరకు 116 దేశాల కంటెస్టెంట్లు సమాచారం వచ్చిందన్నారు. దాదాపు నెలరోజుల పాటు వారు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో గ్రూపుల వారీగా పర్యటిస్తారని డీజీపీ అన్నారు. అతిథులు రాక శుక్రవారం నుంచి మొదలైందని మిస్ వరల్డ్ ప్రారంభ కార్యక్రమం ఈనెల 10వ తేదీన జరగనుందని తెలిపారు.
READ MORE: Sperm Count: వీర్యకణాల సమస్యతో ఇబ్బందులా..? కారణాలు ఇవేకావొచ్చు.. జాగ్రత్త సుమీ!
Also Read
- CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
- రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
- Gadikota Srikanth Reddy: కొత్త పెన్షన్ల పేరుతో మళ్లీ మోసం.. గడికోట ఫైర్
- KBR Park Elevated Corridor: 14 వద్దు.. ఒక్క ఎలివేటెడ్ కారిడార్ ముద్దు.! కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కొత్త ప్లాన్ ఇదే..
మిస్ వరల్డ్ షెడ్యూల్ లో భాగంగా ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయం, నల్గొండ జిల్లాలోని బుద్ధవనం, మహబూబ్ నగర్ లోని పిల్లలమర్రి, వరంగల్ జిల్లా, హైదరాబాదులోని లాల్ బజార్, సెక్రటేరియట్ , రాచకొండ కమిషనరేట్ పరిధిలోని యాదగిరిగుట్ట దేవాలయం, ఉప్పల్ స్టేడియం, పోచంపల్లి, రామోజీ ఫిలిం సిటీ, తదితర ప్రాంతాలను గ్రూపుల వారీగా మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు పర్యటిస్తారని డీజీపీ తెలియజేశారు. ఆయా ప్రాంతాలను, కార్యక్రమాలను అనుసంధానం చేస్తూ కంట్రోల్ ను ఏర్పాటు చేయనున్నమన్నారు. భారీ స్థాయిలో జరగనున్న ఈ పోటీలకు ప్రారంభ వేదికను గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహిస్తుండగా ఫైనల్ పోటీలను ఈనెల 31వ తేదీన హైటెక్స్ లో నిర్వహించనున్నామన్నారు. భారతదేశంలోనే పోలీస్ పెర్ఫామెన్స్ లో ప్రథమ స్థానంలో నిలిచిన తెలంగాణ పోలీస్ శాఖ మిస్ వరల్డ్ పోటీలకు 120 దేశాల నుంచి వచ్చే కంటెస్టెంట్లకు, అతిథులకు పకడ్బందీగా భద్రత చర్యలు చేపట్టి సమర్థతను ప్రపంచంలో ఇతర దేశాలకు చాటి చెప్పాలని డీజీపీ ఆకాంక్షించారు.
READ MORE: MP Yusuf Pathan: ఒడిశాలో బెంగాలీ కార్మికులపై దాడి.. అమిత్ షాకు టీఎంసీ ఎంపీ లేఖ!
ఈనెల 12వ తేదీన నాగార్జునసాగర్ లో ఉన్న బుద్ధవనం ప్రాజెక్టును కంటెస్టెంట్ లో కొందరు సందర్శిస్తారని, ఈనెల 13వ తేదీన లాల్ బజార్ , చౌమల్లా ప్యాలెస్ లను,మరికొందరు ఈనెల 14వ తేదీన వరంగల్ హెరిటేజ్ సందర్శన, రామప్ప ఆలయ సందర్శన, ఈనెల 15వ తేదీన యాదగిరి గుట్ట ఆలయ సందర్శన, అదే రోజున మరికొందరు పోచంపల్లిలో చేనేత వస్త్రాల తయారీని, ప్రదర్శనను ప్రత్యక్షంగా తిలకిస్తారని ఈనెల 16వ తేదీన హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్ లో నిర్వహించే మెడికల్ టూరిజం ఈవెంట్ కు హాజరవుతారని, అదే రోజున మరికొందరు పిల్లల మర్రి వృక్ష సందర్శన చేస్తారని, ఎకో పార్క్ సందర్శిస్తారని, ఈనెల 17వ తేదీన గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించే స్పోర్ట్స్ ఫైనల్ పోటీలలో పాల్గొంటారని, అదే రోజున మరికొందరు కంటెస్టెంట్లు రామోజీ ఫిలిం సిటీ సందర్శిస్తారని తెలిపారు. ఈనెల 18వ తేదీన మిస్ వరల్డ్ కాంటెస్టెంట్ లు తెలంగాణ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శిస్తారని, మరికొందరు కంటెస్టెంట్లు సచివాలయం పరిశీలిస్తారు. ఈనెల 20 తేదీన ఉప్పల్ స్టేడియంలో 21వ తేదీన శిల్పారామం లను సందర్శిస్తారు. ఈనెల 31వ తేదీన మిస్ వరల్డ్ ఫైనల్ పోటీలు జరుగుతాయని డీజీపీ అన్నారు. శాంతి భద్రతల అడిషనల్ డీజీపీ మహేష్ ఎం భగవత్ , అడిషనల్ డీజీపీ, మిస్ వరల్డ్ పోటీలకు పోలీస్ నోడల్ ఆఫీసర్ స్టీఫెన్ రవీంద్ర, డీజీ ఫైర్ సర్వీసెస్ నాగిరెడ్డి, హైదరాబాద్ అడిషనల్ సీపీ విక్రమ్ సింగ్ మాన్, సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి, రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు, ఇంటెలిజెన్స్ ఐజీపీ కార్తికేయ, హైడ్రా కమిషనర్ రంగనాథ్ , టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ ప్రకాష్ రెడ్డి, మల్టీ జోన్ల ఐజీపీలు చంద్రశేఖర్ రెడ్డి, సత్యనారాయణ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
-
G2 Release Date: అడివి శేష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘G2’ రిలీజ్ డేట్ లాక్..
-
Ajit Agarkar: భారత క్రికెట్లో కీలక పరిణామం.. థ్యాంక్యూ నోట్.. చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్‌బై!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
Hatah Teaser: కిరణ్ అబ్బవరం ‘హతః’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్.. ఆ నల్ల పిల్లి వెనుక అసలు కథేంటి?
ట్రెండింగ్
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!