CM Revanth Reddy : ఖమ్మం జిల్లా ఎప్పటిలాగే కాంగ్రెస్ పార్టీకి అగాధమైన అండగా నిలుస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన, తెలంగాణ ఉద్యమానికి పునాది పడింది కూడా ఇదే నేలలోనని గుర్తు చేశారు. 1969లో ప్రారంభమైన ఉద్యమం 60 ఏళ్ల పాటు కొనసాగడానికి పాల్వంచ కీలక భూమిక వహించిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ పాత్ర…
Bhatti Vikramarka : తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం గురించి కొన్ని వర్గాలు చేస్తున్న విమర్శలు పూర్తిగా నిరాధారమని తేల్చిచెప్పారు. ప్రభుత్వంలో ఎలాంటి అంతర్గత కలహాలు లేవని, పవర్ షేరింగ్ వంటి అంశాలు కేవలం ఊహాగానాలు మాత్రమేనని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం బలంగా, సమిష్టిగా పని చేస్తోందని, అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో అన్ని శాఖల మంత్రులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని…
Rajiv Yuva Vikasam : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘రాజీవ్ యువ వికాసం’ పథకానికి రాష్ట్రవ్యాప్తంగా అద్భుతమైన స్పందన లభిస్తోంది. లక్షల సంఖ్యలో యువత ఈ పథకం కోసం దరఖాస్తులు చేసుకున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ పథకంలో ఇటీవల ఆమోదించిన ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అమలు చేయబోతున్నట్టు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు తగిన ఆదేశాలు జారీ చేసింది. ఈ పథకానికి ఇప్పటివరకు ఎస్సీ సామాజికవర్గానికి…
Rajiv Yuva Vikasam : రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు గడువును ప్రభుత్వం పొడిగించింది. అభ్యర్థులు ఏప్రిల్ 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు. ఈ పథకానికి దరఖాస్తు ప్రక్రియపై సమీక్షించేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు మార్గదర్శకాలను వెల్లడించారు.…
తెలంగాణ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు నాలుగు కొత్త సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టనుంది. తెలంగాణ రైతాంగం, ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల పథకాలు ప్రారంభించనున్నారు.
Harish Rao : గ్రామసభలు పెడితే మీపై కూలీలు తిరగబడతారు జాగ్రత్త.. ఎకరం లోపు భూమి ఉన్నవారిని కూలీలుగా గుర్తించి 12 వేలు ఇవ్వాల్సిందే అని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇవాళ ఆయన సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడుతూ.. ఆర్ధికమంత్రి భట్టి గోబెల్స్ ని మించిపోతున్నారని, పూటకో తీరు ఆయన మాట్లాడుతున్నారన్నారు. నిన్న నాగర్ కర్నూల్ లో BRS హయాంలో ఒక్క ప్రాజెక్టు పూర్తికాలేదు అని అంటున్నారని, మేము మహబూబ్‌నగర్ జిల్లాలోనే 600 లక్షల ఎకరాలకు…
Harish Rao: కార్మికులకు సంబంధించి మంత్రి హరీశ్‌రావు కీలక ప్రకటన చేశారు. రైతు బీమా తరహాలో కార్మిక బీమా పథకాన్ని అమలు చేస్తామని హరీశ్‌రావు ప్రకటించారు. ఇప్పటికే అమలవుతున్న పథకంలో సాధారణ మరణానికి ఇచ్చే బీమా మొత్తాన్ని మూడు లక్షలన్నర లక్షలకు పెంచుతున్నట్లు వెల్లడించారు.