Rajiv Yuva Vikasam : రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు గడువును ప్రభుత్వం పొడిగించింది. అభ్యర్థులు ఏప్రిల్ 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు. ఈ పథకానికి దరఖాస్తు ప్రక్రియపై సమీక్షించేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు మార్గదర్శకాలను వెల్లడించారు. రేషన్ కార్డు ఉన్న వారికి ఆదాయ ధృవీకరణ పత్రం అవసరం లేదని తెలిపారు. దరఖాస్తుదారులకు తక్కువ కాగితపు పని ఉండేలా ఈ వెసులుబాటును కల్పించాలని అధికారులను ఆదేశించారు.
కుల ధృవీకరణ పత్రంపై కీలక మార్గదర్శకాలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన పాత కుల ధృవీకరణ పత్రాలను కూడా అనుమతించాలని కలెక్టర్లకు సూచించారు. ఈ పథకం కింద అర్హత కలిగిన యువతీ, యువకులు ఏప్రిల్ 14 వరకు తమ దరఖాస్తులను సమర్పించుకోవాలి. అవసరమైన పత్రాలను సమయానికి అందించి, అధికారుల మార్గదర్శకాలను పాటించాలి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో మరిన్ని అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశముందని అధికారులు తెలిపారు.
HCU Land Issue: పొలిటికల్ టర్న్ తీసుకుంటున్న HCU భూ వివాదం