మధిరలో మల్లు భట్టి విక్రమార్క గెలుపొందారు. 35 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో సీఎల్పీ నేత మరోసారి విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్ రాజ్ పై 35,190 ఓట్ల తేడాతో విక్టరీ సాధించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతుంది. ఇప్పటికే 20 స్థానాల్లో గెలువగా, 45 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నారు. ఈ క్రమంలో అధికార బీఆర్ఎస్ ఓటమి దిశగా పయనిస్తోంది. ఒకవైపు.. ఎర్రబెల్లి, నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, జగదీశ్వర్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్ రెడ్డి ఓటమి చెందారు.. కానీ, మం
పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి విజయం సాధించారు. వరుసగా ఏడుసార్లు విజయం సాధించిన ఎర్రబెల్లిని యశస్విని ఓడించడం సంచలనంగా మారింది. ఈ సందర్భంగా తన గెలుపుపై యశస్విని రెడ్డి మాట్లాడుతూ.. ఎంతటి బిగ్ షాట్ లు అయినా ప్రజలు తిరస్కరిస్తే �
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో హస్తం హవా కొనసాగుతుంది. అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ లీడింగ్ లో కొనసాగుతుండగా.. కొన్ని స్థానాల్లో గెలుపొందారు. తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొడంగల్ లో గెలుపొందారు. 32,800 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
తెలంగాణలో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతుండగా.. ఈ క్రమంలో బీజేపీ తొలి విజయం సాధించింది. నిర్మల్ లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై బీజేపీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. ఇదిలా ఉంటే.. బీజేపీ 8 స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతుంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ పలు నియోజకవర్గాల్లో గెలుపొందింది. భద్రాచలం బీఆర్ఎస్ అభ్యర్థి తెల్లం వెంకట్రావ్ చివరి రౌండ్ లో పుంజుకొని కాంగ్రెస్ అభ్యర్థి పోడెం వీరయ్య పై విజయం సాధించారు. ఈ స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థికి 4280 ఓట్ల మెజార్టీ లభించింది. ఇదిలా ఉంటే.. అంబర్ పేటలో కూడా బీఆర్ఎ�
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎంఐఎం బోణి కొట్టింది. చార్మినార్ నుంచి ఎంఐఎం అభ్యర్థి జుల్ఫికర్ అలీ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి మేఘా రాణి అగర్వాల్ పై అలీ గెలుపొందారు.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ మరో విజయం సాధించింది. రామగుండంలో కాంగ్రెస్ జెండా ఎగిరింది. బీఆర్ఎస్ అభ్యర్థి కోరుకంటి చందర్ పై.. కాంగ్రెస్ అభ్యర్థి మక్కాన్ సింగ్ ఠాకూర్ గెలుపొందారు. 35వేలకు పైగా మెజార్టీతో కోరుకంటి చందర్ పై ఘన విజయం సాధించారు.