BRS Victory: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ పలు నియోజకవర్గాల్లో గెలుపొందింది. భద్రాచలం బీఆర్ఎస్ అభ్యర్థి తెల్లం వెంకట్రావ్ చివరి రౌండ్ లో పుంజుకొని కాంగ్రెస్ అభ్యర్థి పోడెం వీరయ్య పై విజయం సాధించారు. ఈ స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థికి 4280 ఓట్ల మెజార్టీ లభించింది. ఇదిలా ఉంటే.. అంబర్ పేటలో కూడా బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ ఘన విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థిపై సుమారు 3వేల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. మరోవైపు బాల్కొండలో మంత్రి ప్రశాంత్ రెడ్డి కూడా విజయం సాధించారు. 3 వేల ఓట్ల తేడాతో ప్రశాంత్ రెడ్డి గెలుపొందారు.