తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతుంది. ఇప్పటికే 20 స్థానాల్లో గెలువగా, 45 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నారు. ఈ క్రమంలో అధికార బీఆర్ఎస్ ఓటమి దిశగా పయనిస్తోంది. ఒకవైపు.. ఎర్రబెల్లి, నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, జగదీశ్వర్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్ రెడ్డి ఓటమి చెందారు.. కానీ, మంత్రి చామకూర మల్లారెడ్డి విజయం సాధించారు. మల్లారెడ్డి దాదాపు 9 వేల ఓట్ల ఆధిక్యంతో సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు. కాగా, ఇతర మంత్రులు కేటీఆర్ (సిరిసిల్ల), తలసాని శ్రీనివాస్ యాదవ్ (సనత్ నగర్), హరీశ్ రావు (సిద్ధిపేట), సబితా ఇంద్రారెడ్డి (మహేశ్వరం) ముందంజలో ఉన్నారు.